Weather Updates: వేడెక్కుతున్న ఏపీ, గాలుల ప్రభావంతో తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత ! ఎల్లో అలర్ట్
Telangana Weather Updates: రాత్రులు మాత్రం చల్లగా ఉంటున్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం వేడి ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
![Weather Updates: వేడెక్కుతున్న ఏపీ, గాలుల ప్రభావంతో తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత ! ఎల్లో అలర్ట్ Weather In Andhra Pradesh Telangana Hyderabad on 22 February 2022 Weather Updates: వేడెక్కుతున్న ఏపీ, గాలుల ప్రభావంతో తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత ! ఎల్లో అలర్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/11/ddd168858db1bd864d3dd607225f17a1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weather Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పొడి గాలులు పెరగడం వల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. తద్వారా వాతావరణం వేడెక్కుతోంది. రాత్రులు మాత్రం చల్లగా ఉంటున్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం వేడి ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ప్రాంతాలల్లో 20 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు.
ఏపీలో దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వాతావరణం పొడిగా ఉంటుందని, వాతావరణం మరింత వేడెక్కుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం వెచ్చగా ఉంటుంది. వర్ష సూచన లేకపోవడంతో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రలు భారీగా పెరుగుతాయిని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. అత్యల్పంగా బాపట్లలో 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జంగమేశ్వరపురంలో 19.2 డిగ్రీలు, నందిగామలో 20.4 డిగ్రీలు, కళింగపట్నంలో 19.6 డిగ్రీలు, అమరావతిలో 19.8 డిగ్రీలు, విశాఖపట్నంలో 23.6 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Daily weather report of Andhra Pradesh Dated 21.02.2022. pic.twitter.com/WC2b6zDPKQ
— MC Amaravati (@AmaravatiMc) February 21, 2022
రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా మారింది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని బార్డర్ ప్రాంత్రాల్లో మాత్రం వేడిగా ఉంటుంది. నందిగామ, మాచెర్ల, ద్వారకా తిరుమలలో మాత్రం ఇలాంటి పరిస్ధితి ఉంటుంది. విజయవాడలో కూడ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు చేరే అవకాశాలు భాగా కనిపిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడ సైతం భారీగానే పెరిగాయి. ఆరోగ్యవరం, అనంతపురం లాంటి ప్రాంతాల్లో ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం ఆరోగ్యవరంలో కనిష్ట ఉష్ణోగ్రత 17.5 డిగ్రీలు నమోదైంది. అనంతపురంలో 18.7 డిగ్రీలు, నంద్యాలలో 19.6 డిగ్రీలు, తిరుపతిలో 19.5 డిగ్రీలు, కర్నూలులో 21.2 డిగ్రీలు, కడపలో 22.6 డిగ్రీల మేర రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
#21FEB2022#Telangana District wise & #GHMC Mandal wise lowest Min. Temperature details in °C 👇 pic.twitter.com/mSrakq5dsa
— Hyderabad Rains (@Hyderabadrains) February 21, 2022
తెలంగాణ లో పెరుగుతున్న చలి..
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. కొన్ని చోట్ల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఉదయం వేళ చలి గాలులతో ఇబ్బందులు తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యల్పంగా ఆదిలాబాద్ లో 10 డిగ్రీలు, నిర్మల్ లో 12.3 డిగ్రీలు, సంగారెడ్డిలో 13.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 13.5 డిగ్రీలు, రంగారెడ్డిలో 13.8 డిగ్రీలు, జగిత్యాలలో 14.3 డిగ్రీలు, మెదక్‌లో 15 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)