By: ABP Desam | Updated at : 21 Dec 2021 07:18 AM (IST)
ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్స్ (Representational Image)
AP Weather Updates: రెండు వైపుల నుంచి వీస్తున్న గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై ఉంది. ఓవైపు కోస్తాంధ్ర తీర ప్రాంతంలో తక్కువ ఎత్తులో ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తుండగా.. రాయలసీమలో ఈశాన్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. చలి గాలల ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ అన్ని ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలి విపరీతంగా పెరిగిపోతోంది. ఉదయం వేళ ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో నేటి నుంచి మరో నాలుగు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లో మరో మూడు రోజుల వరకు ఎలాంటి వర్ష సూచన లేదని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర తీరం వెంట ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత రోజురోజుకూ తగ్గుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. లేకపోతే అనారోగ్యానికి గురవుతారని సూచించారు. చల్లని గాలుల ప్రభావంతో ఏజెన్సీ ఏరియాలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయి.
దక్షిణ కోస్తాంధ్రంలో వాతావరణం నేడు కూడా పొడిగా ఉంటుంది. బలమైన గాలులు ఉత్తర దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్నా. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గనున్నాయి. మరో నాలుగు రోజులవరకు వాతావరణంలో పెద్దగా మార్పులేమీ ఉండవని తెలుస్తోంది. రాయలసీమలోనూ వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. నేటి నుంచి నుంచి మూడు రోజులవరకు సీమలో వర్షాలు పడే అవకాశం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
చలి గాలుల ప్రభావం ఉన్నా.. వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని రోజులపాటు తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదని స్పష్టమైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యశాఖ అధికారులు సూచించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 6 డిగ్రీలకు పడిపోగా.. కొన్ని చోట్ల అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువ నమోదు అవుతుందని తెలిపారు.
Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. వరుసగా మూడో రోజు స్థిరంగా బంగారం, వెండి నేల చూపులు
Also Read: Drugs in Gujarat: గుజరాత్‌లో మరోసారి మత్తు భూతం.. పాక్ బోటులో రూ.400 కోట్ల డ్రగ్స్ సీజ్
States’ Startup Ranking 2021: స్టార్టప్స్‌ను ప్రోత్సహించడంలో గుజరాత్ , కర్ణాటక టాప్ - తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నాయంటే ?
CM Jagan : తెలంగాణ నుంచి ఆ డబ్బులు ఇప్పించండి, ప్రధానిని కోరిన సీఎం జగన్
PM Modi Black Balloons : ఏపీలో నల్ల బెలూన్లపై రాజకీయ రచ్చ, ఎవరు చేశారో తెలుసంటున్న బీజేపీ
Kishan Reddy Sorry Atchanna : తప్పు జరిగింది - అచ్చెన్నాయుడుకి కిషన్ రెడ్డి సారీ !
PM Modi In Bhimavaram : ప్రధాని ఏపీ పర్యటనలో అరుదైన ఘటన, స్వాతంత్య్ర సమర యోధుల కుమార్తెకు మోదీ పాదాభివందనం
Sesame Oil: నువ్వుల నూనెతో వండిన వంటలు తింటే మగవారికెంతో లాభం
IND vs SL Womens: రికార్డు సృష్టించిన స్మృతి మంథన, షెఫాలీ వర్మ - ఒక్క వికెట్ కూడా పడకుండా!
Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!
IND Vs ENG 5th Test England Target: 245 పరుగులకు టీమిండియా ఆలౌట్ - ఇంగ్లండ్ లక్ష్యం భారీనే అయినా!