అన్వేషించండి

Rains: ఉపరితల ద్రోణి ప్రభావం - ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి!

Andhra Pradesh Rains: ద్రోణి ప్రభావంతో ఏపీలో కొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు, తెలంగాణలో సోమవారం నుంచి పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు.

Weather Condition in Telugu States: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకూ ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 17 కి.మీ వేగంతో ఉత్తరదిశగా కదులుతున్నట్లు అమరావతి వాతావరణ విభాగం పేర్కొంది. పశ్చిమబెంగాల్‌కు ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. శనివారం రాత్రికి ఇది తుపానుగా మారి ఆదివారం అర్ధరాత్రికి సాగర్ ద్వీపం - ఖేపుపారా మధ్య తీరం దాటుతుందని అధికారులు తెలిపారు. ఈ తుపాను ప్రభావం ఏపీపై లేదని చెప్పారు. ద్రోణి కారణంగా రాగల రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఆ తర్వాత వాతావరణం పొడిగా ఉంటుందని అన్నారు. అటు, నైరుతి రుతు పవనాలు సైతం అరేబియా సముద్రంలోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి. ఈ నెల 31లోగా ఇవి మరింతగా పురోగమించి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్రాంతాల్లో వర్షాలు

ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అటు, విజయవాడలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులన్నీ జలమయం కాగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బెంజి సర్కిల్, మొఘల్రాజపురం, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. అలాగే, అనంత జిల్లా కల్యాణదుర్గంలో అత్యధికంగా 86.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పలు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రాయదుర్గం, కనేకల్, బొమ్మనహాల్ మండలాల్లో భారీ వర్షాలతో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. కర్నూలు జిల్లాలోనూ ద్రోణి ప్రభావంతో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించక మునుపే ముందస్తు వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు, కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్రం అల్లకల్లోలంగా ఉంది. శనివారం ఉదయం సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణలో ఇదీ పరిస్థితి

అటు, తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అలాగే, ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు.

Also Read: Revanth Reddy: తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినపడొద్దు: తొలి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget