BJP Vishnu : ఏపీలో కనుమరుగు కాబోతున్న ఓ ప్రాంతీయ పార్టీ - ఏపీబీజేపీ నమ్మకం ఏమిటంటే ?
వచ్చే ఎన్నికల తర్వాత ఏపీలో ఓ ప్రాంతీయ పార్టీ కనుమరుగు అవుతందని విష్ణువర్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు.
BJP Vishnu : ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్‌సీపీ ఉండదని తిరుపతిలో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోధర్ వ్యాఖ్యానించిన ఒక్క రోజులోనే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే ఆయన పార్టీ పేరు చెప్పకపోయినా వచ్చే ఎన్నికల తర్వాత ఓ ప్రాంతీయ పార్టీ ఉండదని స్పష్టం చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కంటే కూడా కుటుంబ రాజకీయాలు, కుటుంబాభివృధికి ఎక్కువ రోజులు మనుగడ ఉండదని,కిరణ్ కుమార్ రెడ్డితో సహా పలువురు మాజీ కేంద్ర మంత్రులు బీజేపీ వైపు చూస్తున్నారని, కర్ణాటక ఎన్నికల అనంతరం బీజేపీ పార్టీకి నాయకులు క్యూ కడుతారని వెల్లడించారు.
మాజీ సిబిఐ అధికారి జేడీ లక్ష్మీ నారాయణ ఒక రోజు కెసిఆర్ ను, మరొక రోజు కేటీఆర్ ను పొగుడుతూ మీడియా సమావేశం పెట్టుతున్నారని, ఇక బుధవారం నాడు ఏకంగా కేఏ పాల్ తో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి జేడీ లక్ష్మీ నారాయణ రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ స్వార్ధం కోసం విశాఖ ఉక్కు అనే నినాదంతో వెళ్లడం సమంజసం కాదన్నారు.. రాష్ట్ర ప్రజల ద్వారా 850 కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తామని, ఒక డొల్ల కంపెనీతో టెండర్ వేయడం జరిగిందన్నారు.. కెసిఆర్ ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నే కొనేస్తానని చెప్పడం మరో విడ్డురంగా ఉందన్నారు.. ఇవ్వని చూస్తుంటే కేఏ పాల్ స్థాయికి జేడీ లక్ష్మీ నారాయణ దిగజారి పోయారా అనే అనుమాలు వస్తున్నాయని ఆయన తెలిపారు.
ఎంపీ కావాలనే ఆశ తోటి రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్నారా లేక కెసిఆర్ ట్రాప్ లో పడ్డారా అనే అనుమానం కలుగుతుందన్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారిగా పని చేసిన జయప్రకాశ్ నారాయణ మూడు నాలుగేళ్లలో పెట్టుబడులు రాకుంటే వేల మంది కార్మికులు రోడ్డున పడుతారని మాట్లాడుతున్నారని, అదే రిటైర్డ్ అయినా ఐపీఎస్ అధికారి జెడి లక్ష్మీనారాయణ మాత్రం క్రౌడ్ పుల్లింగ్ ద్వారా ఫండింగ్ చేస్తానని చెప్తున్నారని అన్నారు. ఈ డ్రామాలు రాజకీయ స్వార్ధం కోసం చేస్తున్నారని, విశాఖ ఉక్కుపై కుట్ర జరుగుతోందని, విశాఖ ఉక్కుపై భారత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఆయన తెలియజేశారు.. బిఆర్ఎస్ పార్టీలో చేరాలనుకుంటే జేడీ లక్ష్మీ నారాయణ చేరవచ్చని, ఎంపీ టికెట్ తీసుకోవచ్చని, కెసిఆర్ విశాఖ ఉక్కునే కొనేస్తారంటా, అలాంటి వాళ్లే ఏపీ ప్రజలను అవమానిస్తారని ఆయన మండిపడ్డారు.. తెలుగు తల్లి విగ్రహాన్ని చూసి ఓర్చుకోలేని వ్యక్తి, బిఆర్ఎస్ పార్టీ పెట్టి ఆంధ్ర ప్రజలను ఎలా ఉద్ధరిస్తారో కెసిఆర్ ఏజెంట్లు చెప్పాలన్నారు.
కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ ద్రోహి, రాయలసీమకు నీళ్లు రాకుండా చేసిన నాయకుడు, వచ్చే ఎన్నికల అనంతరం ఓ ప్రాంతీయ పార్టీ కనుమరుగు అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. జాతీయ దృక్పధం లేని కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో ఓటమి తప్పదని, బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు..