అన్వేషించండి

Srikakulam News: శ్రీకాకుళ జిల్లా ఆఫీస్‌ ఖాళీ చేసేసిన వైసీపీ- పార్టీ మూతపడిందంటున్న ప్రత్యర్థులు

Srikakulam News: శ్రీకాకుళ జిల్లా వైసీపీ ఆఫీస్‌ ఖాళీ చేశారు. తాత్కాలికంగా ధర్మాన క్యాంపు కార్యాలయంలో కాపురం పెట్టారు. దీనిపై కేడర్ అసంతృప్తిగా ఉంటే... పార్టీ బిచానా ఎత్తేసిందంటున్నారు ప్రత్యర్థులు

Srikakulam Latest: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోంది. ఓడిపోయామనే బాధతో చాలా మంది పార్టీకి దూరమయ్యారు. ఉన్న వాళ్లు కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒకరిద్దరు జిల్లా రివ్యూ మీటింగో ఇంకేదో సమావేశమో పెట్టుకుందామంటే కూడా జిల్లా పార్టీకి కార్యాలయం లేకుండా పోయింది. ఐదేళ్ల పాటు రాజభోగాలు అనుభవించిన నాయకులు ఇప్పుడు కనీసం పార్టీ గురించి పార్టీ కేడర్‌ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అందుకే శ్రీకాకుళంజిల్లాలో వైసీపీ మూతపడిందని సెటైర్లు వేస్తున్నారు. 

జిల్లా కేంద్రంలో వైసీపీకి కార్యాలయం లేదంటే అవమానంగా భావిస్తున్నారు కేడర్. ప్రత్యర్ధుల నవ్వులాట, సెటైర్లు పక్కన పెడితే పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ స్థాపించిన రోజుల్లోనే శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. నగరం మధ్యలో మొన్నటి వరకు పార్టీ కార్యకలాపాలు సాగించారు. అధికారం దిగిపోయిన ఆరు నెలల్లో దాన్ని మూసేశారు. 
ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఒక్కడే జగన్ వెంట నడిచినప్పుడే శ్రీకాకుళం మధ్యలో పార్టీ కార్యాలయం కళకళలాడింది. కానీ ఐదేళ్లలో చాలా మందికి పార్టీ నుంచి లబ్ధిపొందారు. పదవులు అనుభవించారు. అలాంటిది ఇప్పుడు తలో చేయి వేసినా పార్టీకి ప్రత్యేక కార్యాలయమే కట్టించే పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం పార్టీ కార్యాలయం నగరంలో లేదని చెప్పడానికే అవమానంగా ఉందంటోంది కేడర్‌.  

మొదట్లో టౌన్ హాల్‌లో పార్టీ కార్యాలయం నిర్వహించారు. కృష్ణదాస్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సూర్యమహాల్ జంక్షన్ వద్ద గ్యాస్ ఆఫీసు దగ్గర పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఎన్నికల ఓటమి పాలైన తరువాత కూడా అదే ఆఫీస్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడుగా కృష్ణదాసు కార్యకలాపాలు చేపట్టారు. ఏమైందో ఏమో కానీ కొద్ది నెలల క్రితం అక్కడ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. 
తర్వాత ఓ వస్త్ర దుకాణం పార్కింగ్‌ స్థలంలో పార్టీ కార్యకలాపాలు కొనసాగించారు. ఆయన కూడా స్థలానికి ఖాళీ చేయాలని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు క్యాంపు కార్యాలయం వద్దకు చేరారు. తాత్కలికంగా అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 

ఇదే కేడర్‌ను ఇబ్బంది పెడుతోంది. పార్టీకి కార్యాలయం లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తోంది. పార్టీ కార్యాక్రమాలు కొన్నింటి ధర్మాన క్యాంపు కార్యాలయం చేపడుతున్నారు. మీడియా సమావేశాలు హెూటల్లో నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు హైఫైగా ఉండే పార్టీ ఆఫీసు ఇప్పుడు ఎందుకు లేకుండా పోయిందని నిలదీస్తున్నారు. దీన్ని గమనించి జిల్లాలో వైసీపీ బిచానా ఏత్తేసిందంటూ టీడీపీ, జనసేన నేతలు సెటైర్లు వేస్తున్నారు. జిల్లాలో మాజీ స్పీకర్‌ తమ్మినేని, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు, డాక్టర్ సీదిరి అప్పలరాజు లాంటి నేతలు ఉండి కూడా పార్టీ కార్యాలయం లేదనిపించుకోవడం ఏంటని కేడర్ నిర్వేధంలో ఉంది. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం లేదనే సమాచారం ఆ పార్టీ ఛీప్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చేరిందా అని ఆరా తీస్తున్నారు. 

పార్టీ అధినాయకత్వం అధికార పార్టీపై దండేత్తేందుకు పోరాటాలకు రోడ్డు మ్యాప్ ప్రకటించింది. జగన్ నియోజకవర్గాల పర్యటనలకు కూడా సిద్దమయ్యారు. ఇలాంటి టైంలో సమాయాత్తం అయ్యేందుకు వ్యూహాలు చర్చించుకునేందుకు పార్టీ ఆఫీస్ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కీలక నేతలు సిక్కోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా పరిస్థితి ఎందుకని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లా ఓటర్లు 2019లో వైసిపికి బ్రహ్మరథం పట్టారు. పదికి ఏనిమిది అసెంబ్లీ స్థానాల్లో గెలిపించారు. గెలిచిన నేతల్లో ధర్మాన సోదరులు, సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం పదవులు అనుభవించారు. దీంతో నగర నడిబొడ్డునే ఉన్న జిల్లా పార్టీ కార్యాలయం సభలు, సమావేశాలు, మీడియా సమావేశాలు పార్టీ శ్రేణులతో కలర్‌ఫుల్‌గా ఉండేది. అధికారంలో ఉన్నపుడే పెద్దపాడుకు సమీపంలో సొంత కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు చకచకా సాగాయి. అప్పుడే పూర్తి అవుతుందని అనుకున్నారంతా. ఎందుకో ఆ పనులు ముందుకు సాగలేదు. 

Srikakulam News: శ్రీకాకుళ జిల్లా ఆఫీస్‌ ఖాళీ చేసేసిన వైసీపీ- పార్టీ మూతపడిందంటున్న ప్రత్యర్థులు

ఇప్పుడు అధికారం తారుమారుకావడంతో కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యాలయాలపై దృష్టి పెట్టింది. అనుమతులు లేకుండా ప్యాలెస్‌లు అడ్డగోలుగా నిర్మించారంటు అడ్డుపడింది. నగరపాలక సంస్థ నోటీసులు అంటించింది. ఓవైపు సొంత కార్యాలయం లేక అద్దెకు కూడా ఆఫీస్‌ తీసుకోకపోవడంతో కేడర్‌లో నైరాశ్యం నెలకొంది. దాదాపుగా నాలుగు మాసాలుగా పార్టీ కార్యాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు జిల్లా నేతలు. ధర్మాన క్రిష్ణదాస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నా.. ఆయన తన సొంత నియోజకవర్గం నరసన్నపేటలో కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించి కేడర్‌కు అందుబాటులో ఉంటున్నారు. కొందరు నాయకులు అక్కడికే వెళ్తున్నారు. దీంతో కొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం జిల్లా కేంద్రానికి ఆమడ దూరంలో ఉంటుండటంతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఓటమితో వైసీపీకి  ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదని అంటున్నారు. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన కీలక కార్యక్రమాలకు ముందస్తుగా కేడర్‌తో చర్చించే అవకాశం లేకుండా పోయింది. రోడ్డు మీదే నిరసన కార్యక్రమాలు చేసి వెనుదిరగాల్సి వస్తోంది. జగన్ జన్మదిన వేడుకలు సైతం ఏదో రోడ్డుపై తూతూ మంత్రంగా చేసి వెళ్లిపోయారు. 

ఈ ఇబ్బందిని కృష్ణదాసు దృష్టికి వెళ్లడంతో అద్దె భవన కోసం చూస్తున్నామని అంటున్నారు. ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా ప్రస్తుతం ప్రసాదరావు కార్యాలయం వద్ద కొనసాగుతుందంటున్నారు. సొంత కార్యాలయం ఇప్పట్లో పూర్తయ్యేలా లేదని గతంలో మాదిరిగా నగరంలో అద్దెకు భవనాన్ని తీసుకుని కార్యాలయం ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుందని పలువురు పార్టీ శ్రేణులు కోరుతున్నారు. లేదంటే ప్రజలకు అందుబాటులో లేకుండా చులకన అవుతామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Mother in law should die: అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Embed widget