అన్వేషించండి

YV Subbareddy Vizag Meeting: వైసీపీలో ముసలం, వైవీ సుబ్బారెడ్డిని ఘెరావ్ చేసిన సొంతపార్టీ నేతలు 

YSRCP News: విశాఖలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి ముందే రచ్చ చేశారు. తమ అసంతృప్తిని బయటపెట్టారు.

AP Politics: విశాఖపట్నం: ఇన్ ఛార్జ్‌ల మార్పుతో వైసీపీలో ముసలం పుట్టింది. వైరివర్గం విమర్శలకంటే సొంత పార్టీ నేతలే వచ్చే ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి ఎక్కువ ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పక్కదారి పట్టారు. ఇంకొందరు సైలెంట్ గా ఉన్నా సమయం వచ్చినప్పుడు తన తడాఖా చూపించడానికి రెడీగా ఉన్నారు. పోయేవాళ్లు పొండి, ఉండేవాళ్లు ఉండండి అంటూ పైకి వైసీపీ అధిష్టానం గంభీరంగా చెబుతున్నా లోలోపల కేడర్ కూడా తరలిపోతోందనే అనుమానం ఉండనే ఉంది. కొత్త ఇన్ చార్జ్ లను ప్రకటించిన చోట, సిట్టింగ్ ఎమ్మెల్యేల వర్గాలు ఇంకా హడావిడి చేస్తున్నాయి. తమకు పాత నాయకులే కావాలని గొడవలకు దిగుతున్నాయి. తాజాగా విశాఖలో నిర్వహించిన ఓ మీటింగ్ లో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy)కి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ముందే నాయకులు నినాదాలు చేశారు. గాజువాక నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని మార్చకూడదని కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలు ఎక్కువ కావడంతో చివరకు వైవీ హడావిడిగా స్టేజ్ దిగి వెళ్లిపోయారు. 

గాజువాక నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ని ఓడించారు వైసీపీ నేత నాగిరెడ్డి. ఈసారి ఆయన కొడుకు అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. అయితే అక్కడ ఆ కుటుంబానికి టికెట్ లేకుండా కొత్తగా ఉరుకూటి రామచంద్రరావుని తెరపైకి తెచ్చింది అధిష్టానం. ఉరుకూటికి అక్కడ వైసీపీ టికెట్ ఖాయమైంది. ఆయన్ను ఇన్ చార్జ్ గా ప్రకటించారు. దీంతో నాగిరెడ్డి వర్గం అలకబూనింది. వైవీ సుబ్బారెడ్డి వారిని సర్దుబాటు చేసినా, కేడర్ మాత్రం తగ్గేది లేదంటున్నారు. వైవీ ముందే రచ్చ చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీటింగ్ లోనే వారు తమ అసంతృప్తిని బయటపెట్టారు. నాగిరెడ్డి మాత్రమే తమకు నాయకుడని, ఇంకెవరూ తమకు వద్దంటున్నారు నేతలు. 

మంగళగిరి నియోజకవర్గంలో ఇన్ చార్జ్ మార్పుతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు వెళ్లిపోయారు. ఇలాంటి చోట్ల ఇబ్బంది ఉన్నా అక్కడ వ్యవహారం క్లియర్ కట్ గా ఉంది. ఆళ్ల వర్గం ఎవరైనా ఉంటే ఆయనతో బయటకు వెళ్లిపోతారు. మిగిలిన వాళ్లు కొత్త ఇన్ చార్జ్ గంజి చిరంజీవితో కలసిపోయి వైసీపీ గెలుపుకోసం కృషి చేస్తారు. కానీ గాజువాక లాంటి చోట్ల పరిస్థితి తేడాగా ఉంది. నాగిరెడ్డి పార్టీకి రాజీనామా చేయలేదు, అలాగని కొత్త ఇన్ చార్జ్ కి జై కొట్టలేదు. ఆయన అనుచరులు మాత్రం గొడవ చేస్తున్నారు. నాగిరెడ్డికి మాత్రమే సీటు ఇవ్వాలంటున్నారు. ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్తానని వైవీ మాటిచ్చారు. ఆ మాటకు ఎంత వేల్యూ ఉందో ఆయనకు కూడా తెలుసు. ఒకసారి జగన్ కమిట్ అయ్యాక, ఇక అక్కడ ఇన్ చార్జ్ ని మార్చే ప్రసక్తి ఉండదు. అలాగని నాగిరెడ్డి పార్టీలోనే ఉంటూ ఇలా గొడవలు చేయిస్తుంటే అది మొదటికే మోసం. అందుకే అధిష్టానం ఆలోచనలో పడింది. 

మిగతా చోట్ల కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పటికిప్పుడు పార్టీని వదిలి బయటకు వెళ్లేందుకు నాయకులు ఇష్టపడటం లేదు. అదే సమయంలో తమ అనుచరులతో ఆందోళనలు చేయిస్తున్నారు. వీరందరితో వైసీపీ అంతర్గత రాజకీయాలు వేడెక్కాయి. మిగతా నియోజకవర్గాల విషయంలో కూడా మార్పులు చేర్పులు ఉంటే అప్పుడు హడావిడి మరింత పెరిగే అవకాశముంది. కానీ వైసీపీ మాత్రం ఓ విషయంలో క్లారిటీతో ఉంది. ఉండేవాళ్లు ఉండొచ్చు, నచ్చనివాళ్లు వెళ్లిపోవచ్చు అంటూ సజ్జల వంటి నేతలు ఇప్పటికే అసంతృప్తులకు క్లారిటీ ఇచ్చారు. వెళ్లేవారి గురించి వారు లైట్ తీసుకుంటున్నారు. అయితే ఈ అసంతృప్తులు పార్టీ విజయావకాశాలను ఏమేరకు దెబ్బతీస్తారనేదే అసలు పాయింట్. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP DesamTirumala Lighting and Flower Decoration | వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందంగా ముస్తాబైన తిరుమల ఆలయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Aishwarya Rajesh: Aishwarya Rajesh: అమ్మ బాబోయ్... ఐశ్వర్యను ఇంత మోడ్రన్‌గా ఎప్పుడూ చూసి ఉండరు
Aishwarya Rajesh: అమ్మ బాబోయ్... ఐశ్వర్యను ఇంత మోడ్రన్‌గా ఎప్పుడూ చూసి ఉండరు
Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
Hero Splendor Plus: స్ప్లెండర్ ప్లస్ ధరను పెంచిన కంపెనీ - ఎంత పెరిగిందంటే?
స్ప్లెండర్ ప్లస్ ధరను పెంచిన కంపెనీ - ఎంత పెరిగిందంటే?
Embed widget