అన్వేషించండి
Advertisement
Vizag News: రిషికొండ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్టే
రిషికొండలో అసలేం జరుగుతుంది. కొండను తవ్వేస్తూ పర్యావరణానికి ముప్పు తెస్తున్న ప్రభుత్వమంటున్న ప్రతిపక్షాలు. అనుమతులతోనే తవ్వుతున్నామని ప్రభుత్వం చెబుతోంది.
ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ షాక్ ఇచ్చింది. విశాఖ సమీపంలోని రిషికొండ వద్ద తవ్వకాలను నిలిపివెయ్యాలంటూ స్టే ఇచ్చింది . నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణం రాజు వేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ రిషి కొండపై ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే సంపూర్ణ అధ్యయనం కోసం కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీని నోడల్ ఏజెన్సీగా నియమించిన గ్రీన్ ట్రైబ్యునల్ 30 రోజుల్లోగా దాఖలు చెయ్యాలని తెలిపింది.
విశాఖకు రక్షణ ఋషి కొండ
విశాఖ చుట్టు పక్కల అనేక బీచ్‌లు ఉన్నా రుషికొండ, దాని చుట్టూ ఉన్న బీచ్ చాలా ముఖ్యమైనది. విశాఖకు తుపానుల బాధ లేకుండా చేసేవి ఒక పక్క డాల్ఫీన్ నోస్ కొండ అయితే మరోవైపు ఈ ఋషి కొండ దాని చుట్టు ప్రక్కల కొండలే. అయితే వాటిని ఇప్పుడు పర్యాటక అభివృద్ధి పేరుతొ తవ్వేస్తున్నారని చాలాకా లంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ తవ్వకాలను ఆపివెయ్యాలంటూ టీడీపీ ,జనసేన పదేపదే చేస్తున్నాయి. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా రుషికొండ వద్దకు వెళ్లాలని చూసినప్పుడు ఆయన్ని పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకోవడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. అసలు అక్కడ చేపడుతున్నవి టూరిజానికి సంబంధించిన పనులే అయితే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ ప్రశ్నించింది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం అక్కడ జరుగుతున్నవి టూరిజానికి సంబంధించిన పనులే అనీ అందుకు తమకు అన్న విధాలైన అనుమతులూ ఉన్నవని చెబుతూ వస్తుంది .
అధికార వైసిపీకి చెందిన అసమ్మతి నేత, ఎంపీ రఘురామ కృష్ణం రాజు గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. రుషికొండపై జరుగుతున్నవి పూర్తి గా పర్యావరణానికి హాని కలిగించే కార్యక్రమాలు అంటూ పిటీషన్ దాఖలు చేసారు. దానిపై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ స్టే ఆర్డర్ ఇస్తూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఎలాంటి తవ్వకాలూ రిషికొండపై చేపట్టరాదని తెలిపింది. దీనితో ఏపీ సర్కార్ కు షాక్ తగిలిందనే చెప్పాలి .
మితి మీరిన గోప్యం ఎందుకు?
రిషికొండ సమీపంలో ప్రభుత్వానికి చెందిన హరితా రిసార్ట్స్ ఉండేవి. ఇక్కడి అందాలను చూడడానికి వచ్చే పర్యాటకులకు ఈ రిసార్ట్స్ వసతి సౌకర్యం కల్పించేవి. అయితే అకస్మాత్తుగా వాటిని కూల్చేసిన ప్రభుత్వం ఇప్పుడు పెద్ద స్థాయి టూరిజం హోటల్ కడతామని రిషికొండను తవ్వేస్తున్నారు. అయితే ఆ మాట అధికారికంగా చెప్పడం లేదు. మరోవైపు ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం కోసం అని మరో వార్త వినబడుతుంది. అయితే భవనాలు కట్టడానికి ఏకంగా కొండను ఎందుకు తవ్వేస్తున్నారు.. సముద్ర తీర ప్రాంతంలో ఏకంగా కొండను తవ్వేయడంతో పాటు .. పెద్ద పెద్ద భవనాలు కట్టడానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని విపక్ష టీడీపీ ఆరోపిస్తుంది. అసలు ఈ ప్రాజెక్ట్ డీపీఆర్ ను ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదు అనే విమర్శలు అన్ని వైపులా వెల్లువెత్తుతున్నాయి .
సామాన్యులకు రాకపోకలు బంద్
రుషికొండపై ప్రభుత్వం తవ్వకాలు మొదలెట్టినప్పటి నుంచీ రుషికొండ సమీపంలో సామాన్యులకు అనుమతులు బంద్ అయ్యాయి. కొండా చుట్టూ రేకులతో అడ్డుగోడ కట్టి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది జనం దృష్టిలోకి వెళ్లకుండా చేశారు. దానితో అసలు రుషికొండపై ఏం జరుగుతుందన్న సందేహాలు విశాఖలో ప్రతీ ఒక్కరి మదిలో ఉంది. ఇప్పుడా ప్రశ్నలన్నిటికీ నేషనల్ ట్రైబ్యునల్ జోక్యంతో బయట పడతాయని అంటున్నారు విశ్లేషకులు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion