IND vs AUS 2nd ODI: విశాఖలో రెండో వన్డే - నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, స్టేడియానికి వచ్చే వారికి పోలీసుల సూచనలివే
ఏ.సి.ఎ-వీ.డీ.సీ.ఏ డా.వై.ఎస్.ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య మార్చి 19న వన్డే మ్యాచ్ జరగనుంది. రెండు గంటల ముందుగా స్టేడియంలోనికి ప్రవేశించాలని పోలీసులు సూచించారు
![IND vs AUS 2nd ODI: విశాఖలో రెండో వన్డే - నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, స్టేడియానికి వచ్చే వారికి పోలీసుల సూచనలివే Vizag India vs Australia 2nd ODI Traffic diversions in Visakhapatnam on 19 March DNN IND vs AUS 2nd ODI: విశాఖలో రెండో వన్డే - నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, స్టేడియానికి వచ్చే వారికి పోలీసుల సూచనలివే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/18/f2fa79abf69aa2f8c88292cf50332ef51679145853409233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India vs Australia 2nd ODI, Visakhapatnam: విశాఖపట్నంలో ఏ.సి.ఎ-వీ.డీ.సీ.ఏ డా.వై.ఎస్.ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య మార్చి 19న వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్ ఆధ్వర్యంలో పటిష్ట బందొబస్తు ఏర్పాట్లు చేశారు. క్రీడాకారులు వచ్చే ఎయిర్పోర్ట్ వద్ద నుండి ఇరు జట్లు బస చేయు హోటళ్ల వద్ద, వారు నగరంలో ప్రయాణించు ప్రతీ మార్గాల వద్దా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, రూట్ బందో బస్తులతో పటిష్ట భద్రత కల్పించారు పోలీసులు.
స్టేడియం చుట్టూ బారి కేడింగ్ ఏర్పాటు చేసి, స్టేడియంలోనికి వెళ్లే అన్ని గేట్ల వద్ద ఏసిపి స్థాయి అధికారులతో తనిఖీ చేస్తూ, వారి టికెట్స్ ను పరిశీలించి, ఎటువంటి గుంపులూ ఏర్పడకుండా క్యూ లైన్ నందు లోపలకి ప్రవేసించే ఏర్పాట్లు చేశారు. స్టేడియంలో పర్యవేక్షణాధికారి గా డీసీపీ-1(ఎల్&ఓ) ,స్టేడియం వెలుపల పర్యవేక్షణాధికారిగా డీసీపీ-2(ఎల్&ఓ) , మొత్తం ట్రాఫిక్ పర్యవేక్షణాధికారిగా డీసీపీ(క్రైమ్స్) ఉన్నారు. గుంపులుగా జనాలు ఉండే ప్రతి చోటా ఎటువంటి అవాంతరాలు లేకుండా బందో బస్తు ఏర్పాట్లు చేశారు.
2 గంటల ముందే స్టేడియానికి రావాలి..
విశాఖలో జరగనున్న రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ నకు సుమారు 2000 మంది అధికారులతో బందోబస్తూ ఏర్పాటు చేశారు. స్టేడియంలో ఎటువంటి దొంగతనాలు ఇతర అపశృతులు లేకుండా ఉండేందుకు క్రైమ్ సిబ్బందితో పూర్తి నిఘా ఉంటుంది. మ్యాచ్ సందర్బంగా ఎక్కడా ట్రాఫిక్ నిలిచిపోకుండా పూర్తి ఎర్పాట్లు చేయడమైనది. మ్యాచ్ ను వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులు పోలీసు వారికి సహకరించాలని, మ్యాచ్ వీక్షించడానికి సరైన టికెట్స్ లేదా ఎంట్రీ పాస్ కలిగి ఉండి మాత్రమే రావాలని, తమకు టికెట్స్ తో తమకు నిర్దేశించిన గేట్ల ద్వారా రెండు గంటల ముందుగా స్టేడియంలోనికి ప్రవేశించాలని సూచించారు.
నగర ప్రజలకు, మ్యాచ్ వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులకు సూచనలు
ఆదివారం (మార్చి 19న) భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ, పలు సూచనలు చేశారు
1) విశాఖ వేదికగా మ్యాచ్ మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 10:30 వరకు జరుగును.
2) స్టేడియం సామర్థ్యం 28,000. అలాగే వారి వాహనాలు కూడా వేల సంఖ్యలో ఉంటాయి. కనుక మ్యాచ్ తో సంబంధం లేని వాహనదారులు మధురవాడ క్రికెట్ స్టేడియం వైపు ప్రయాణించకుండా, వేరే మార్గాలలో ప్రయాణించాలి
3) శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుండి విశాఖపట్నం నగరం లోకి వచ్చే బస్సులు, ఇతర కమర్షియల్ వాహనాలు, మారికవలస వద్ద, ఎడమ వైపు కి తిరిగి, జురాంగ్ జంక్షన్ మీదుగా తిమ్మాపురం చేరి, కుడి వైపు తిరిగి బీచ్ రోడ్డు లో ప్రయాణించి, ఋషికొండ, సాగర్ నగర్, జోడుగుళ్లపాలెం మీదుగా వెళ్ళవలెను.
4) శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుండి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు మొదలైనవి, కార్ షెడ్ వద్ద నుండి మిధిలాపురి కాలనీ మీదుగా, MVV సిటీ వెనుకగా వెళ్లి, లా కాలేజీ రోడ్డు మీదుగా NH 16 చేరి నగరం లోనికి వెళ్ళవలెను. లా కాలేజీ రోడ్డు నుండి, పనోరమ హిల్స్ మీదుగా, ఋషికొండ మీదుగా కూడా నగరం లోకి వెళ్ళవచ్చును.
5) విశాఖపట్నం నగరం లోనుండి, ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు బస్సులు ఇతర కమర్షియల్ వాహనములు, హనుమంతవాక నుండి ఎడమ వైపు తిరిగి, ఆరిలోవ brts రోడ్డు లో వెళ్లి, అడివివరం వద్ద కుడి వైపు తిరిగి ఆనందపురం మీదుగా వెళ్ళవలెను.
6) విశాఖపట్నం నగరం లో నుండి, ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు, కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు మొదలైనవి హనుమంతవాక జంక్షన్ నుండి ఎడమ వైపు తిరిగి, అడివివరం మీదుగా ఆనందపురం వెళ్ళవచ్చు, లేదా హనుమంతవాక జంక్షన్, లేదా విశాఖ వాలీ జంక్షన్, లేదా ఎండాడ జంక్షన్ వద్ద కుడి వైపు తిరిగి, బీచ్ రోడ్డు చేరి, తిమ్మాపురం వద్ద ఎడమవైపు తిరిగి, మారికవలస వద్ద NH 16 చేరవచ్చును.
భారీ వాహనాలకు సూచనలు:-
1) మార్చి 19న ఉదయం 06:00 గంటల నుండి రాత్రి 12:00 గంటల వరకు ఎటువంటి భారీ వాహనాలు మధురవాడ స్టేడియం వైపు అనుమతి లేదు
2) అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు వాహనాలు, నగరం లోకి రాకుండా, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి
3) శ్రీకాకుళం, విజయనగరం, వైపు నుండి అనకాపల్లి వైపు వెళ్ళు వాహనాలు నగరంలోకి రాకుండా, ఆనందపురం నుండి పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపు వెళ్లాలి.
4) విశాఖపట్నం నగరం నుంచి బయలుదేరి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు భారీ వాహనాలు అన్నీ అనకాపల్లి వైపు వెళ్లి, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్ళవలెను.
5) శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి విశాఖపట్నం నగరం లోకి వచ్చు భారీ వాహనాలు అన్నీ, ఆనందపురం నుండి పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి మీదుగా విశాఖపట్నం నగరం చేరుకోవాలి
మ్యాచ్ చూడడానికి వచ్చే వాహనదారులకు సూచనలు:-
1) విశాఖపట్నం నగరం వైపు నుంచి స్టేడియానికి వచ్చే VVIP, VIP వాహనదారులు, NH 16 లో స్టేడియం వరకు ప్రయాణించి, A గ్రౌండ్, B గ్రౌండ్, V కన్వెన్షన్ గ్రౌండ్ లలో వారి వారి పాస్ ప్రకారం చేరుకోవాలి.
2) విశాఖపట్నం వైపు నుంచి స్టేడియానికి చేరుకునే టికెట్ హోల్డర్స్, NH 16 లో ప్రయాణించి, స్టేడియం వద్ద గల హోల్డ్ ఏజ్ జంక్షన్ వద్ద ఎడమ వైపు తిరిగి, సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో పార్కింగ్ చేసుకోవాలి. సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో, ఆన్ లైన్ టికెట్స్ ను, ఒరిజినల్ టికెట్స్ గా మార్చుకొనుటకు కౌంటర్లు ఏర్పాటు చేశారు.
3) శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం, గంభీరం, బోయపాలెం, కొమ్మాది వైపు నుండి వచ్చు వారు, కార్ షెడ్ జంక్షన్ వద్ద కుడి వైపు తిరిగి, సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీ పార్కింగ్ గ్రౌండ్ చేరవలెను. లేదా కార్ షెడ్ జంక్షన్ నుండి ఎడమ వైపు తిరిగి, మిధిలాపురి కాలనీ మీదుగా వచ్చి, MVV సిటీ డబల్ రోడ్డు, పోలిశెట్టి వేణుగోపాలరావు గ్రౌండ్ లలో పార్కింగ్ చేయాలి.
4) విశాఖపట్నం నగరం నుంచి లేదా భీమిలి వైపు నుండి బీచ్ రోడ్డు మీదుగా స్టేడియం కు వచ్చేవారు, IT SEZ మీదుగా వచ్చి MVV సిటీ డబల్ రోడ్డు చేరి పార్కింగ్ చేసుకోవాలి.
5) విశాఖపట్నం నగరం నుండి వచ్చే Rtc స్పెషల్ బస్సులు NH 16 లో రాకుండా, బీచ్ రోడ్డు లో వచ్చి, IT SEZ మీదుగా వచ్చి, లా కాలేజీ రోడ్డు లో పార్కింగ్ చేయాలి
6) శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుండి వచ్చు rtc స్పెషల్ బస్సులు, మారికవలస, తిమ్మాపురం, IT SEZ మీదుగా వచ్చి, లా కాలేజీ రోడ్డు చేరి పార్కింగ్ చేసుకోవాలని విశాఖ సిటీ పోలీసులు సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)