అన్వేషించండి

Gudivada Amarnath: ఏపీకి భవిష్యత్, గ్రోత్ ఇంజన్ విశాఖపట్నమే - మంత్రి అమర్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విశాఖపట్నం అని, ఈ నగరం ఏపీకి గ్రోత్ ఇంజన్ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

Visakhapatnam is Future of Andhra Pradesh: విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విశాఖపట్నం అని, ఈ నగరం ఏపీకి గ్రోత్ ఇంజన్ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) వ్యాఖ్యానించారు. స్థానిక రాడిసన్ బ్లూ హోటల్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో రాష్ట్ర అభివృద్ధి, విశాఖ నగర ప్రాముఖ్యత, భవిష్యత్తు గురించి చర్చించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల సర్వతో ముఖాభివృద్ధికి తీసుకున్న చర్యల గురించి తెలియజేయనున్నారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. రాడిసన్ బ్లూ హోటల్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ (AP CM YS Jagan) రానున్న సందర్భంగా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి అమర్నాథ్ సోమవారం పరిశీలించారు. 

సుమారు 2000 మంది ఈ కార్యక్రమానికి హాజరు 
అనంతరం మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. పరిశ్రమలు, పర్యాటకం, హాస్పిటల్స్, హోటల్స్, మౌలిక సదుపాయాలు తదితర రంగాలకు చెందిన సుమారు 2000 మంది ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలిపారు. విశాఖపట్నం విజన్ డాక్యుమెంటును సీఎం జగన్ వీరికి వివరించనున్నారు. విశాఖ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారని అన్నారు. దేశంలోని ప్రముఖ నగరాలకు దీటుగా, ఈస్ట్ కోస్ట్ కు గేట్ వే గా విశాఖను తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాలలో మౌలిక సదుపాయాల గురించి, విశాఖ నగరంలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను సీఎం తెలియజేయనున్నారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ లో తీసుకున్న నిర్ణయాల గురించి జగన్ వివరించనున్నారు. 

Gudivada Amarnath: ఏపీకి భవిష్యత్, గ్రోత్ ఇంజన్ విశాఖపట్నమే - మంత్రి అమర్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఎన్.టి.పి.సి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. 15 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుందని అమర్నాథ్ తెలిపారు. అలాగే విశాఖకు మంజూరైన బల్క్ డ్రగ్ పార్కు గురించి, ఫార్మా రంగంలో వస్తున్న పెట్టుబడుల గురించి పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ వివరిస్తారని చెప్పారు. ప్రపంచ స్థాయి మాల్స్ కూడా విశాఖలో అడుగుపెట్టనున్నాయని, ఇందులో భాగంగానే ఇనార్బిట్ మాల్ రూపుదిద్దుకుంటుంది అన్నారు. ప్రముఖ ఐటీ కంపెనీలు ఇప్పటికే విశాఖ నగరంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని, త్వరలోనే మరిన్ని కంపెనీలు రాబోతున్నాయని చెప్పారు. పర్యాటక రంగంలో మరికొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా విశాఖకు వస్తాయన్నారు. విశాఖలో ఫ్లైఓవర్, మెట్రో సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తెలియజేస్తారని అమర్నాథ్ చెప్పారు.

 జీవీఎంసీ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయలతో ముడసర్లోవలో నిర్మించనున్న జీవీఎంసీ నూతన భవనానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే సుమారు 9 నుంచి 10 కోట్ల రూపాయలతో టర్టెల్ బీచ్ ను ఏర్పాటు చేయనున్నారని దీనికి సీఎం శంకుస్థాపన చేస్తారని తెలియజేశారు. వెంకోజీ పాలెం నుంచి మారియట్ హోటల్ వరకు నిర్మించనున్న ఆల్టర్నేటివ్ డబల్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. మధురవాడకు కనితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఏర్పాటు చేయనున్న వాటర్ సప్లై ప్రాజెక్టుకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని అన్నారు.
రాష్ట్రంలో ఐటిఐ, పాలిటెక్నికల్ కళాశాలల అభివృద్ధికి సంబంధించి చేపట్టనున్న అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి తెలియజేయనున్నారు. 98 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఐ.టి.ఐ లు, పాలిటెక్నిక్ కళాశాలల ను సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభిస్తారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. సీఎం జగన్ అభివృద్ధి లక్ష్యాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మికపెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Embed widget