Visakhapatnam: ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం - ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
Visakhapatnam: విశాఖపట్నంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. ఒకరు మృతిచెందగా, మిగతావారి పరిస్థితి విషమంగా ఉంది.
Visakhapatnam: విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం, గోరపల్లిలో దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబ సభ్యులు అంతా కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. ఒక్కరు చేసిన పనికి ఆ కుటుంబంలోని సభ్యులు అంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతుండటం, పరువు పోతుండటంతో వాటిని భరించలేక తనువు చాలించడానికి నిర్ణయించుకున్నారు. పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేయాలని అనుకున్నారు. ముగ్గురు కలిసి విషం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అంతలోనే వచ్చిన మరో కుటుంబసభ్యుడు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించాడు. ఆ ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోగా.. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
గోరపల్లి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఆన్ లైన్ గేమ్స్ కు బానిసయ్యాడు. ఆ ఆటలు ఆడుతూ భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాడు. అక్కడా ఇక్కడా అప్పులు చేసి మరీ ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. చిల్లి గవ్వా ఆదాయం లేకపోవడంతో.. ఆ అప్పులు తీర్చలేకపోయాడు. అప్పు ఇచ్చిన వారు ఇంటిపైకి వచ్చి గొడవలు చేయడం, పరువు పోతుండటంతో ఆ కుటుంబ సభ్యులు భరించలేకపోయారు. ఎంతకీ సంతోష్ కుమార్ తీరు మారకపోవడంతో.. ఆ కుటుంబ సభ్యులు వారికి ఆత్మహత్యే శరణ్యం అనుకున్నారు. సంతోష్ కుమార్ తల్లి, తండ్రి, సోదరి పురుగుల మందు తాగారు. విషం ప్రభావంతో వారు అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన సంతోష్ కుమార్.. కుటుంబ సభ్యులను చూశాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ముగ్గురిని కేజీహెచ్ కు తరలించారు. కాగా కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తండ్రి కల్లూరి సత్యనారాయణ మృతి చెందాడు. భార్య సూర్య కుమారి, కూతురు నీలిమ (21) పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: Paris Olympics: ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా, పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత
తల్లి శవంతో బెల్లంపల్లి కల్వరి టెంపుల్ వద్దకు వచ్చిన వ్యక్తి
ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి తల్లి మణికుమారి అనారోగ్యంతో మరణించారు. ఆయన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌కు భక్తుడు. ఇక్కడి కల్వరి చర్చ్ ప్రవీణ్ ప్రార్ధనలు టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు చూసి ఆయన మహిమల పట్ల ఆకర్షితుడయ్యాడు. అపారమైన నమ్మకం పెంచుకున్నాడు. ఆయన తల్లి మణికుమారి అనారోగ్యానికి గురి కాగా, హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వైద్యం కొసం తీసుకువచ్చాడు. అక్కడ నాలుగు రోజులుగా చికిత్స పొందినా ఫలితం లేదని ఆమెను బెల్లంపల్లికి తీసుకువచ్చేందుకు సన్నద్దమయ్యాడు. గురువారం మణికుమారి చనిపోయింది. అయినా సరే, పాస్టర్ ప్రవీణ్ చేయి తాకితే తిరిగి ఆమె బతుకుతుందనే ఉద్దేశంతో శవాన్ని బెల్లంపల్లికి తీసుకువచ్చాడు. అయితే అక్కడి నిర్వాహకులు అతన్ని లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన చర్చి గేటు వద్దే చాలా సేపు నిరీక్షించారు. విషయం మీడియాకు తెలియడంతో అక్కడకు వెళ్లింది. పాస్టర్ ప్రవీణ్‌కుమార్ గొప్ప వ్యక్తి అని ఆయన టచ్ చేస్తే చాలు తన తల్లి లేచి కూర్చుకుంటదని వెల్లడించాడు. ఆయన మహిళలు ఎన్నో టీవీల్లో ప్రత్యక్షప్రసారాల ద్వారా చూశానని అందుకే నమ్మకంతో తీసుకువచ్చానని చెప్పాడు.