News
News
X

విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్ హంగామా- పెద్ద ఎత్తున విమానాల ల్యాండింగ్‌కు ఎయిపోర్ట్‌ సన్నద్ధం

విమానాల ల్యాండింగ్ కోసం 11 వందల అడుగుల రన్‌వే సిద్ధంగా ఉంది. ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్‌ను ఇండియన్ నేవీ చూస్తోంది. పార్కింగ్‌, ప్రయాణికుల రాకపోకల అంశాన్ని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ చూసుకోనుంది. 

FOLLOW US: 
Share:

విశాఖలో గ్లోబల్‌  ఇన్వెస్టర్స్ సమ్మిట్ హంగామా మొదలైపోయింది. దేశవిదేశాల నుంచి పారిశ్రామికవేత్తల రాకపోకలతో విశాఖ ఎయిర్‌పోర్ట్‌ కిటకిటలాడుతోంది. మార్చి 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిటి నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దేశ విదేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించింది. 

ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారీగా సుమారు 40 దేశాల నుంచి ప్రతినిధులతోపాటు, స్వదేశ పారిశ్రామిక దిగ్గజాలు కూడా రానున్నారు. అందుకే విశాఖలో చార్టెడ్‌ ఫ్లైట్లు చక్కర్లు కొట్టనున్నాయి.  విశాఖ ఎయిర్‌పోర్టులో భారీగా చార్టెడ్‌ విమానాలు ల్యాండ్ కానున్నాయి. చార్టెడ్‌ ఫ్లాట్స్‌ ల్యాండింగ్‌కు సంబంధించిన రిక్వస్ట్‌లు  విశాఖ ఎయిర్‌పోర్ట్ అథారిటీకి  చాలానే వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్‌, జీఎంఆర్‌ గ్రూప్‌, జిందాల్‌ స్టీల్స్ అండ్‌ పవర్, అపోలో ఇలా పలు పారిశ్రామిక సంస్థల నుంచి రిక్వస్ట్ వచ్చినట్టు ఎయిర్‌పోర్ట్ అథారిటీ చెప్పింది. 

చార్టెడ్‌ ఫ్లైట్స్‌తోపాటు అదనంగా మరో 31 వాణిజ్య విమానాలు కూడా ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. గంటకు సుమారు పది విమానాల రాకపోకలను హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ హడావుడి ఉంటుందని భావిస్తున్నారు.   దీని కోసం పదహారు పార్కింగ్ బేస్ సిద్దం చేశారు. ఇందులో 12 కొత్తవికాగా...4 పాతవి. ఇవి ఎయిర్‌బస్‌ 777, ఎయిర్‌ బస్‌ A320, బోయింగ్‌ 747, ఏటీఆర్‌, చోపర్స్‌కు సరిపోనున్నాయి. 

విమానాల ల్యాండింగ్ కోసం 11 వందల అడుగుల రన్‌వే సిద్ధంగా ఉంది. ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్‌ను ఇండియన్ నేవీ చూస్తోంది. పార్కింగ్‌, ప్రయాణికుల రాకపోకల అంశాన్ని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ చూసుకోనుంది. 

రన్‌పై ఉన్న స్పేస్‌ను బట్టి విమానాల రాకపోకలను నియంత్రిస్తారు. ముందుగా వీఐపీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఒకవేళ రన్‌వే ఖాళీగా లేకపోతే.. పైలట్‌కు చెప్పి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రిలో ల్యాండ్ చేయాలని సూచనలు పంపించనున్నారు. మళ్లీ రన్‌వే ఖాలీ అయిన తర్వాత వాటిని విశాఖలో ల్యాండ్ అయ్యేలా చూస్తారు. 

అత్యవసర ల్యాండింగ్‌ కోసం కూడా విశాఖ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏదైనా`అత్యవసర పరిస్థితి ఏర్పడిదే విమానాలను తక్షణమే ల్యాండ్ అయ్యేలా ఆదేశాలు ఇవ్వనున్నారు. అయితే వచ్చే పారిశ్రామిక వేత్తలంతా వేర్వేరు టైమింగ్స్‌లో రానున్నారు. అందుకే విమానాల ల్యాండింగ్ సమస్య రాదని భావిస్తున్నారు. రోజులో 240 రాకపోకలను నియంత్రించేందుకు సన్నద్దమయ్యారు. 

సమ్మిట్‌కు హాజరయ్యే ప్రముఖుల జాబితాలో విదేశీ రాయబారులు, కేంద్రమంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు, అధికారులు ఉన్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ, “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయంలో చార్టర్డ్ విమానాల ల్యాండింగ్ కోసం వివిధ సంస్థల నుంచి ఐదు రిక్వస్ట్‌లు వచ్చాయి . మేము నిర్దిష్ట సమయంలో రన్‌వేపై స్థల లభ్యత ఆధారంగా ల్యాండింగ్ కోసం అనుమతులు ఇస్తాం. స్థలం అందుబాటులో లేకుంటే అదే విషయాన్ని పైలట్‌లకు తెలియజేస్తాం. కానీ ఇలాంటి పెద్ద ఈవెంట్‌లో విమానాల రాకపోకలను ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించగలమని నమ్ముతున్నాం అన్నారు. 

సమ్మిట్‌ కోసం 18 ఎయిర్‌క్రాఫ్ట్‌లను విశాఖ ఎయిర్‌పోర్ట్ అథారిటీ సిద్ధంగా ఉంచింది. ఎయిర్‌పోర్టు వచ్చిన ప్రతినిధులను నేరుగా సమ్మిట్ జరిగే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు వీటిని వినియోగించనున్నారు. దీని కోసం సమ్మిట్ జిరిగే ప్రాంతంలో మూడు హెలీప్యాడ్స్‌ను రెడీ చేశారు. ముఖ్యమైన ప్రతినిధుల కోసం 750 హోటల్‌ రూమ్స్‌ను ప్రభుత్వం బుక్ చేస్తే... ఎవరిక వారు వ్యక్తిగతంగా 1000కిపైగా రూమ్‌లను బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 

Published at : 02 Mar 2023 09:38 AM (IST) Tags: YS Jagan VIZAG VisakhaPatnam Vizag Investors Summit Investors Summit In AP Investors Summit 2023

సంబంధిత కథనాలు

Manyam Bandh:  ఏపీ ప్రభుత్వంపై  గిరిజనుల ఆగ్రహం- ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మన్యం బంద్

Manyam Bandh: ఏపీ ప్రభుత్వంపై గిరిజనుల ఆగ్రహం- ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మన్యం బంద్

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

పలాసలో భూవివాదాలపై మంత్రి భూ దర్బార్‌- కబ్జాలు నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటన

పలాసలో భూవివాదాలపై మంత్రి భూ దర్బార్‌- కబ్జాలు నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటన

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

టాప్ స్టోరీస్

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా-  ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు