(Source: ECI/ABP News/ABP Majha)
విద్యార్థులను ఎండలో నిలబెట్టిన టీచర్- తప్పు తెలుసుకునేందుకు శిక్ష వేశామంటూ కవరింగ్
Visakha News: వర్క్ చేయలేదని చిన్న పిల్లలను ఎండలో నిల్చోబెట్టారు టీచర్. అదేంటని ప్రశ్నించారు ప్రయాణికులు. దీనిపై ఆమె సీరియస్ అయ్యారు.
Visakha News: విశాఖలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్ దారుణంగా ప్రవర్తించారు. విద్యార్థులు ఏదో తప్పు చేశారని వాళ్లకు తెలియాలన్న ఉద్దేశంతో శిక్ష వేశారు. కాళ్లకు షూ లేకుండా ఎండలో రోడ్లుపై నిలబెట్టారు.
కాళ్లు కాలుతున్నప్పటికీ ఆ పసి విద్యార్థులు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఇదేంటని ప్రశ్నించారు. విద్యార్థులు తప్పు చేస్తే మాత్రం ఇలాంటి శిక్షలు వేయడం ఏంటని ప్రశ్నించారు.
ప్రయాణికుల ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోయిన సదరు టీచర్ ఎదురు దాడికి దిగారు. అసలు తమ అనుమతి లేకుండా వీడియోలు ఎందుకు తీస్తున్నారని గొడవకు దిగారు. సీతమ్మధారలోని ఓప్రైవేట్ స్కూల్‌లో జరిగిన ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివాదం నడుస్తున్న టైంలో వచ్చిన మిగతా సిబ్బంది వీడియో తీస్తున్న వారిని వారించారు. గొడవ చేయద్దని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడే పుస్తకాలతో నిలబెట్టిన విద్యార్థలను వారి క్లాస్‌లకు పంపించి వేసినట్టు తెలుస్తోంది.
దీనిపై విద్యాధికారులు స్పందించాలని పలువురు నగరవాసులు కోరుతున్నారు. పిల్లలను దండించ కుండా చదువులు చెప్పాలని నిపుణులు చెబుతుంటే మానవత్వం మరిచి ఇలాంటి శిక్షలు వేయడమేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి శిక్షలు వేయడం వల్ల చదువు కోవాలనే కోరిక పిల్లల్లో పోతుందని.. చదువు అంటే భారంగా మారే ప్రమాదం కూడా ఉందంటున్నారు నిపుణులు.