అన్వేషించండి

OBC List: ఆ కులాలను ఓబీసీల్లో చేర్చేలా ప్రయత్నాలు - శ్రీకాకుళం ప్రజాప్రతినిధులకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా

Delhi: ఉత్తరాంధ్రలో వెనుకబడిన ఐదు కులాలను ఓబీసీల్లో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు.

Union Minister Rammohan Naidu:  ఉత్తరాంధ్రలోని సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తూర్పుకాపు, కళింగ వైశ్య, శిష్టకరణ, శొండి, అరవ కులాలను ఓబీసీ జాబితాలో చేర్పించాలని  కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీగా మొదటి సారి ఎన్నికలయినప్పటి నుండి పదేపదే పార్లమెంట్ దృష్టిలో కూడా ప్రస్తావించారు.  ఈ సామాజిక వర్గాలను ఓబీసీలుగా చేర్చేందుకు త్వరితగతిన రిజిస్ట్రేషన్ అమలయ్యేలా చూడాలని తాజాగా కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి దృష్టికి రామ్మోహన్నాయుడు తీసుకెళ్లారు. 

కేంద్రమంత్రిని కలిసిన శ్రీకాకుళం జిల్లా ప్రజా ప్రతినిధులు   

కేంద్రమంత్రిగా ఉన్నా ఉత్తరాంధ్రలో వెనుక బడిన ఈ సామాజిక వర్గాలను ఓబీసీ జాబితాలో చేర్పించేందుకు విక్రమార్కుడిలా పట్టుబడుతూ ముందుకె ళ్లడం పట్ల సిక్కోలు జిల్లాలోని ఆ సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేసుకున్నారు. ఈ మేరకు  కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరేంద్ర కుమార్నురామ్మోహన్ నాయుడు కలిసి గత పదేళ్లుగా పార్లమెంట్లో, ఎన్బీసీ కమిషన్లో పోరాడుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పలాస ఎమ్మెల్యే శిరీషతో కలిసి కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్తో అనేక విషయాలపై చర్చించారు.  తూర్పుకాపు, కళింగవైశ్య, శిష్ఠకరణ, సోండి, అరవ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకతను రామ్మోహన్ నాయుడు ఆయనకు వివరించారు. దీనిపై గతంలో ఎన్సీబీసీ చైర్మన్ గంగారాం ఆహిర్ ఆధ్వర్యంలో ఐదు సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులతో సామాజిక వేదిక నిర్వహించామని తెలిపారు. ఈ అంశంపై తాను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నామని, దీనిని ప్రాధాన్యతగా గుర్తించడంతో పాటు త్వరితగతిన రిజిస్ట్రేషన్ అమలయ్యేలా చూడాలని విన్నవించారు.

పూండి రైల్వే స్టేషన్, బెండి గేటు  పనులు చేపట్టాలి

శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ప్రాధాన్యమైన ఉద్దానంలో ఉన్న పూండి రైల్వే స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ను కలుసుకున్నారు. కరోనా ముందు పూండిలో భువనేశ్వర్ - సికింద్రాబాద్ (విశాఖ ఎక్స్ ప్రెస్), భువనేశ్వర్ బెంగళూరు (ప్రశాంతి ఎక్స్ ప్రెస్), పూరీ - తిరుపతి ఎక్స్ ప్రెస్ రైళ్ల నిలుపుదల చేసేవారని గుర్తు చేశారు. వజ్రపు కొత్తూరు, నందిగాం, సంతబొమ్మాళి మండలాలకు చెందిన ప్రజలు ఈ స్టేషన్ పైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. ప్రాధాన్యతను గుర్తించి, ఆయా రైళ్ల నిలుపుదలను పునః ప్రారంభించాలని కోరారు. అలాగే... పూండి రైల్వే స్టేషన్లో తాగునీరు, ప్రయాణికుల విశ్రాంతి భవనాలు, మరుగుదొడ్లు, రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. దీనితో పాటు నత్తనడకన సాగుతున్న బెండి గేటుఫై ఓవర్ పనులను వేగవంతం చేసి, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని వివరించారు.

పెంండింగ్‌లో ఉన్న రైల్వే పనులు పూర్తి చేయాలి! 

 పలాస,  కాశీబుగ్గ ఎల్సీ గేటు వద్ద నిలిచిపోయిన రైల్వే ఫుట్ ఓవ ర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తిచేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఆయన కార్యా లయంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పలాస ఎమ్మెల్యే శిరీష రైల్వేమంత్రిని కలిశారు. గత కొంతకాలంగా ఆ పను లు నెమ్మదిగా కొనసాగేందుకు కారణాలను ఆయన కు వివరించారు. రద్దీగానుండే పలాస రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో ఈ నిర్మాణం కొనసాగుతోండ డం, ట్రైన్ ట్రాఫిక్ కారణాలతో అత్యవసర పరిస్థితు ల్లో వాహనాలు నిలిచిపోతున్నాయని, ప్రాణాపాయ పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించారు. ఆర్ వోబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకురా వాలని కోరారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పం దించి, ఆర్వోబీ నిర్మాణానికి హామీనిచ్చారు.ఎన్నికల ముందు కొన్ని హామీలను ఇచ్చాను ఎంపీగా కొనసాగుతూ ఇప్పుడు కేంద్రమంత్రి అయ్యాను జిల్లాలో నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఖచ్చితంగా కొన్ని పనులు అంటూ నెరవేర్చాలి అని సంబంధిత శాఖ మంత్రులతో జిల్లా భౌగోళిక పరిస్థితులను వివరించారు. గత కొన్నేళ్లుగా ఈ జిల్లాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక్కడ సమస్యలు అక్కడే ఉండిపోయాయి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే సరి అవి క్లియర్ చేయాలని కోరారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Home Minister on CIBMS: స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
Pushpa 2: 'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
Embed widget