Gudivada Amarnath: మంత్రి గుడివాడ ఫోటోను గుడ్లతో కొట్టిన నేతలు - ప్రతీకారం తీర్చుకున్న వైసీపీ శ్రేణులు!
Gudivada Amarnath News : టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో గురువారం సెవెన్ హిల్స్ సర్కిల్ లో అమర్నాథ్ చిత్రపటాన్ని కోడిగుడ్లతో కొట్టారు.
AP News: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంత్రి అమర్ నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో గురువారం సెవెన్ హిల్స్ సర్కిల్ లో అమర్నాథ్ చిత్రపటాన్ని కోడిగుడ్లతో కొట్టారు. మంత్రి అమర్నాథ్ కు వ్యతిరేకంగా టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ.. తమ నాయకులు చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి అమర్ నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అని అన్నారు. మంత్రి అమర్ నాథ్ ను వారు ఒక బ్రోకర్ అంటూ అభివర్ణించారు.
పరిశ్రమల శాఖ మంత్రిగా అమర్ నాథ్ ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలని అన్నారు. ఆ తీసుకువచ్చిన పరిశ్రమల వద్ద నించొని సెల్ఫీ తీసుకొని పెట్టగలరా అని ఎద్దేవా చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే అని హెచ్చరించారు. తమ నాయకులపై మంత్రి అమర్ నాథ్ ఇకపై వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎస్ రతన్ కాంత్ టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు బొండా రవికుమార్ పీలా అవినాష్ బొత్స ప్రవీణ్ డెక్కా ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
గుడ్డు మంత్రి గారికి గుడ్ల తో సన్మానం..
— Team Rajakeeyam🥛 (@TeamRajakeeyam) February 22, 2024
ఎలా ఉంది బ్రో @gudivadaamar #HelloAP_ByeByeYCP pic.twitter.com/NGPlAHDUj6
లోకేశ్ చిత్రపటానికి పప్పు వేసి అభిషేకం
టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మంత్రి అమర్ నాథ్ చిత్రపటాన్ని గుడ్లతో కొట్టగా.. విశాఖపట్నంలో వైసీపీ నేతలు దానికి కౌంటర్ ఇచ్చారు. నారా లోకేశ్ ఫోటోకు పప్పుతో అభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.