Srikakulam: శాఖల పనితీరును ఎండగట్టిన ఎమ్మెల్యేలు, నీళ్లు నమిలిన అధికారులు
మెదడుకు పదును పెట్టిన కూన రవికుమార్ తన అమ్ములపొదిలోని అస్త్రాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. పెద్దన్న పాత్ర పోషిస్తూ, ప్రతి శాఖపైనా ప్రశ్నల వర్షం కురిపించడంతో అధికారులు సమాధానం చెప్పలేకపోయారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివే'ఢీ'గా సాగింది. ఇటుకూటమి ఎమ్మెల్యేలు, అటు వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధుల వాదోపవాదాలు, ప్రశ్నల వర్షం అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అధికారుల పనితీరును ఎండగట్టారు.తనదైన శైలిలో.. గుక్కతిప్పుకోలేనంతగా ప్రశ్నల పరంపరను సంధించారు. ఒక రకంగా చెప్పాలంటే.. విశ్వరూపం ప్రదర్శించారు. తన అమ్ములపొదిలోని ప్రతి అస్త్రాన్ని ప్రయోగించారు. దాదాపు అన్ని శాఖలపైనా తనకు గల పట్టును నిరూపించుకున్నారు. ప్రధానంగా అభివృద్ధిపైనే చర్చిద్దామని, రాజకీయాలు మాట్లాడొద్దంటూ.. హితవు పలికారు. మరోవైపు అధికార గణాన్ని బెంబేలెత్తించారు.
జడ్పీ సమావేశాలను రెండురోజుల పాటు నిర్వహిస్తే బాగుంటుందని, నీటి పారుదల శాఖపై ప్రత్యేకసమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. సమావేశంలో సెంట్రాఫ్అట్రాక్షన్గా నిలిచారని చెప్పడం అతిశయోక్తి కాదు. అన్ని శాఖలపైనాఆయనకున్న పట్టును చూసి.. ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులువిస్తుపోయారు. ప్రధానంగా వ్యవసాయ, అనుబంధశాఖలు, నీటిపారుదలశాఖలపై చర్చ సాగింది. ఇక శ్రీకాకుళం శాసనసభ్యుడు గొండు శంకర్, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి.గోవిందరావు, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు. రమణమూర్తి, ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రాధాన్యత అంశాలపై చర్చిద్దామని జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ పిలుపునిచ్చారు.
జడ్పీ సర్వసభ్య సమావేశం
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ విజయ, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలపై చర్చిద్దామన్నారు. ప్రస్తుత సమావేశంలో ప్రాధాన్యత శాఖ పై చర్చిస్తామన్నారు. ఆమదాలవలస శాసన సభ్యులు కూన రవికుమార్ మాట్లాడుతూ జలవనరుల శాఖ, గృహ నిర్మాణ శాఖలో ఇన్ చార్జ్ లపైన, పదోన్నతులు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలపై సుదీర్ఘంగా చర్చించేందుకు సమావేశాలను రెండు రోజుల పాటు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా సాగుకు సరిపడా ఎరువులను డీసీఎంఎస్, ఏపీసీఎస్, రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరా చేయాలని కోరారు. వ్యవసాయ సహాయకులను రేషనలైజేషన్ చేయాలని ఎమ్మెల్యే జయృష్ణ సూచించారు. వ్యవసాయ శాఖపై తీసుకున్న చర్యలను జేడీ శ్రీధర్ వివరించారు. జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా సాగులోకి వచ్చిందని, అప్పటి అవసరం మేరకు 62 వలే మెట్రిక్ టన్నుల ఎరువుల వచ్చాయన్నారు. కొరత వాస్తవమేనని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని జేడీ వివరించారు. ప్రైవేటు డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని, వారిని అదుపు చేయాలని బగ్గు. రమణమూర్తి కోరారు.
జల వనరుల శాఖపై..
జలవనరుల శాఖ ఎస్ఈ సుధాకర్ జిల్లాలో వ్యవసాయానికి అందిస్తున్న సాగునీరు పై వివరించారు. శాసన సభ్యులు కూన రవి కుమార్ మాట్లాడుతూ నారాయణపురం ఆయకట్టు పై సాగు అవుతున్న పెనుబర్తి గ్రామానికి ఇప్పటికీ సాగునీరు రాలేదని, ఓనిగెడ్డ, నారాయణపురంలలో లస్కర్స్ కొరత తీర్చాలన్నారు. శాసన సభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ వంశధార కట్టడాలు కూలుతున్నాయని, చివరకు సాగునీరు వెళ్లాలంటే షట్టర్స్, రెన్నోవేషన్ చేయాలన్నారు. లస్కర్స్ వేయాలని చెప్పారు.
గొండు శంకర్ శ్రీకాకుళం నియోజక వర్గంలోని ఇరిగేషన్ సమస్యలు పై వివరించారు. మామిడి గోవిందరావు మాట్లాడుతూ వంశధార కాలువలమరమ్మతులకు గురైనాయని, వంతెనలుమరమ్మతులు చేయించాలని చెప్పారు. రెల్లిగెడ్డపై ఉన్న కాంట్రాక్టర్ తొలగించాలని, బల్క్మిల్క్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలకుసంబంధించి భవనాలను ఖాలీగాఉంచకుండా అంగన్వాడీ భవనాలుగావినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని శాసన సభ్యులు కూనరవి కుమార్ కోరారు.
వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి డీఎంహెచ్ఐ డాక్టర్ బి. మీనాక్షి సీజనల్ వ్యాధులు పై వివరించారు. అన్ని పీహెచ్సీల్లో మందులను అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యేలు కోరారు. ఎన్ఆర్ఆజీఎస్ ప్రగతిపై డ్వామా పీడీ చిట్టిరాజు, విద్యాశాఖ ప్రగతిపై డీఈవో తిరుమల చైతన్య వివరించారు. అంతకు ముందు జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సాధారణ బదిలీలు, తదితర వాటిపై వివరించారు.