Srikakulam: శ్రీకాకుళంలో బాబాయ్, అబ్బాయ్ శకం! జిల్లాకు మరో మైలురాయి
AP Latest News: శ్రీకాకుళం జిల్లాకు మీనీ ఎయిర్ పోర్టు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పకనే చెప్పారు.
Srikakulam News: శ్రీకాకుళం జిల్లాకు మరో తీపి కబురు అందునుందా... అంటే అవుననే పరిస్థితులుకనిపిస్తున్నాయి. ఇప్పటికే సంతబొమ్మాళి మండలం మూలపేటలో పోర్టు నిర్మాణం కొనసాగుతుంది. మీనీ ఎయిర్ పోర్టు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పకనే చెప్పారు. మరో వైపు తీరం గుండా సాగరమాల పథకం కింద ఆరులైన్లు రోడ్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే మరో మేజర్ ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంటుందని గత కొన్నిరోజులుగా ప్రచారం సాగుతున్న తరుణంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఓ రిఫైనరీ పెట్టే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వంతో గతకొన్ని రోజులుగా సంప్రదింపులు చేస్తుంది. మూలపేట పోర్టు, రానున్న ఎయిర్ పోర్టు, సాగరమాల రోడ్డును దృష్టిలో పెట్టుకుని ఈ రిఫైనరీ కూడాఅదే ప్రాంతంలో ఏర్పాటు చేయడంవల్ల అన్ని విధాలుగా దోహదపడుతుందని ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. కేంద్ర, రాష్ట్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు సొంత అడ్డా కావడంతో అన్ని విధాలుగా సహాయసహకారాలు అందుతాయని ప్రభుత్వం,కంపెనీ ప్రతినిధులు ఆలోచించే అవకాశాలు ఉంటాయంటున్నారు.
బీపీసీఎల్ సంస్థ దేశంలో సంవత్సరానికి 12 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనరీనిఏర్పాటు చేయాలని యోచిస్తోన్నట్లు కొన్ని ఆంగ్లపత్రికలలో కథనాలు రావడం అందుకు తగ్గట్టుగా గత నెల 11 పరిశ్రమల శాఖ మంత్రి భరత్తో ఆసంస్థ ప్రతినిధులు కలిసి లక్ష కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టే ఆలోచనలు ఉన్నట్లు పేర్కొన్నట్లు కథనాలు వచ్చాయి. సీఎంతో కలిసేందుకుతేదీనినిర్ణయిస్తే సంస్థ చైర్మన్ జి. కృష్ణరావు, సీఎం ను కలుస్తారని అప్పట్లో ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తో జరిపిన చర్చలలో లక్ష కోట్లు పెట్టుబడి తో సంస్థకు ముందుకు రాగా తొలివిడతలో రూ..55 నుంచి 75 వేల కోట్లు పెట్టుబడికి నిర్ణయించారని అందులో భాగంగా రాష్ట్రంలో మూలపేట, మచీలిపట్నం, రామయ్యపట్నం పోర్టు తీరంలో ఆ రిఫైనరీ ఏర్పాటు చేస్తే అవసరమైన స్థలాన్ని అందించేందుకు సుముఖుత వ్యక్తమూనట్లు ప్రచారం విస్తృతం సాగుతుంది.
ఇప్పటికే విశాఖపట్నం మల్కాపురంలో (హెచ్పీసీఎల్) ఉన్న విషయం విధితమే. ప్రభుత్వంతో జరుగుతున్న ఒప్పందం మేరకు అన్నికూలంగా కలిసొస్తే మూలపేటలోనే బీపీసీఎల్ ఏర్పాటుకు అధికంగా ఛాన్స్లుంటాయని అప్పుడే ప్రచారం సాగుతుంది.జాతీయ రహదారి కి దగ్గరకావడం, రైల్వే లైను సమీపంలో ఉండడం దీనికి తోడు పోర్టు పనులుతో సిద్ధమవుతుండడం అన్ని కూలంగా మారుతున్నాయి. ఒడిశా రాష్ట్రంలో సమీపంలో ఉండడంతో పవర్ గ్రిడ్ను పలాస ప్రాంతంలో నిర్మించారు. ఒడిశా రాష్ట్రం కూడ దగ్గరవుతుందని సంస్థ కూడ అవకాశాలుంటాయనేది పరిగణలోకి తీసుకోవచ్చును.
ఎయిర్ పోర్టు, సాగరమాల ప్రతిపాదనలు రెఢీ అవుతున్నా యి. దీనికి తోడు మూలపేటలో మినహిస్తే మిగిలిన రెండు చోట్ల అనుకూలమైన స్థలం లభిం చే అవకాశాలు తక్కువగానే చెప్పాలి. మచిలీపట్నం, రామయ్యపట్నంలో భూమి విలువ అధికం గా ఉంటుంది. అందుచేత నూతనంగా నిర్మిస్తున్న మూలపేట పోర్టు ఏరియా అనువైన ప్రాంతంగా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చర్చి స్తున్న ట్లు భోగట్టా. అన్ని అనుకూలిస్తే ఎగుమతి, దిగుమతు లకు ప్రధాన కేంద్రంగా మూలపేట పోర్టు మార నుందని వేరేగ చెప్పనక్కర్లేదు. ఇప్పటికే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సంబం ధిత సంస్థ ప్రతినిధులతోసంప్రదింపులు చేసినట్లు ప్రచారం సాగుతుంది. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా అభివృద్ధికి అన్నివిధాలుగా కృషి చేసేందుకు యత్నిస్తున్నారు.
రాష్ట్రంలో కొత్తగా నాలుగు విమానాశ్రయాలు నిర్మించేం దుకు అడుగులు వేస్తుండగాఅందులో మూలపేట పోర్టు సమీపంలో ఓ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించడంతోనే అన్ని అనుకూలంగా మారేందుకుఅవకాశం ఉందని చెప్పవచ్చును. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు,అచ్చెన్నాయుడు తమ ప్రయత్నాలు చేస్తారని జిల్లావాసులు ఆశిస్తున్నారు. రిఫైనరీ అనుకూలిస్తే బాబాయ్ అబ్బాయ్ శకంలో మరో మైలు రాయిగా నిలుస్తుంది. దివంగత కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జిల్లా అభివృద్ధికి నిరం తరం పరితపిం చారు. ఆయన ఆశయ సాధనకు కేంద్ర, రాష్ట్ర మంత్రి తీసుకునే నిర్ణయాలు చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచే అవకాశం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. వారి రాజకీయ ఎదుగుదలకు ఇప్పటికే అడ్డులేదని రానున్న రోజుల్లో ధోకా ఉండబోదని వాసులు అంటున్నారు. జిల్లా అంతేకాకుండా రిఫైనరీ ఏర్పాటు అయితే అందులో పది వేలమందికి ఉపాధి కల్పించడానికి దోహాదపడుతుందని అంటున్నారు. ఇదంతా అనుకూలంగా మారితే జిల్లా వాసులకు తీపి కబురుగానే చెప్పాలి.