AP BJP : ఉత్తరాంధ్రపై ప్రభుత్వం నిర్లక్యం - ఐదు రోజుల ఉద్యమం చేయాలని ఏపీ బీజేపీ నిర్ణయం !
ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. ఐదు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉద్యమం చేయాలని నిర్ణయించారు.
ఉత్తరాంధ్ర అభివృద్దిపై టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయని ఉద్యమం చేపట్టాలని ఏపీ బీజేపీ నిర్ణయించింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఉత్తరాంధ్ర నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయిదు రోజుల ఉద్యమ కార్యచరణ చేపట్టాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే విషయంలో టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాలు రెండూ ఘోరంగా విఫలమయ్యాయని సోము వీర్రాజు భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ేం చేయాలన్నదానిపై ఆ ప్రాంత ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్సులు, రాష్ట్ర పార్టీ పదాధికారులతో సోము వీర్రాజు విస్తృతంగా చర్చించారు.
పద్దతి లేకుండా విభజించడం వల్లే తెలుగు రాష్ట్రాలకు కష్టాలు - రాజ్యసభలో మోదీ కీలక వ్యాఖ్యలు !
ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులు, నీటిపారుదల పెండింగ్ ప్రాజెక్టులు ఎంత మేర పెండింగ్‌లో ఉన్నాయో పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్నాయో లేదో వివరాలు సేకరించారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని.. వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిన కారణంగా లక్షలాది ఎకరాల్లో సరైన పంటలు పండించుకునే అవకాశాలను ఉత్తరాంధ్ర రైతులు కోల్పోయారని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. అందుకే ఉత్తరాంధ్ర ప్రాంత రైతులు, ఇతర రాష్ట్రాలు,ప్రాంతాలకు, వ్యవసాయ కూలీలుగా, కార్మికులుగా వలసలుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో థర్డ్ వేవ్ ముగిసినట్లే, WFHలు అక్కర్లేదు.. కీలక వివరాలు చెప్పిన డీహెచ్
వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ప్రభుత్వం, వారి భవిష్యత్తుతో ఆటలాడుతోందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని ఒకొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.5 కోట్లు చొప్పున ఉత్తరాంధ్ర జిల్లాల్లో రూ.300 కోట్లు నీటిపారుదల, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం వెచ్చిస్తే ఆ ప్రాంతంలో 5 లక్షల ఎకరాలకు నీరు లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. తద్వారా ఆ ప్రాంతాల్లో కూడా పంటలు పుష్కలంగా పండుతాయన్నారు. ఇదే డిమాండ్‌తో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని నీటి పారుదల, పెండింగ్ ప్రాజెక్టులను నిర్లక్ష్యంతో చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ త్వరలోనే బిజెపి ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
5 రోజుల పాటు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉద్యమాన్ని నిర్వహించి ప్రభుత్వం కళ్ళు తెరిపింంచాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్ర జిల్లాల సమగ్రాభివృద్ధికి నిర్వహించే 5 రోజుల ఉద్యమం లో నిర్వహించే ఆందోళనల కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చూడాలని పార్టీ నేతలకు సోము వీర్రాజు దిశానిర్దేశం చేశారు.