Viral News: ఆ మాస్టారు పాటలు పాడితే విద్యార్థులకు మార్కులు వస్తున్నాయ్
శంకరరావు ప్రస్తుతం విజయనగరం జిల్లా గంగచోళ్లపెంట ఉన్నత పాఠశాలలో సోషల్ టీచరుగా పని చేస్తున్నారు. 1998 నుంచి ఆయన వివిధ వాద్య పరికరాలతో కళారూపాలను ప్రదర్శిస్తూ...పాఠాలను బోధిస్తున్నారు.
కోలాటం, పాట, నృత్యం, బుర్రకథలాంటి వివిధ కళారూపాలతో హైస్కూల్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఈయన పేరు బొంతలకోటి శంకరరావు. ఈ కళారూపాల ప్రదర్శనలో హార్మోనియం, కీబోర్డ్, గిటార్, కంజిర, తప్పెటగుళ్లు ఉపయోగిస్తూ గత 24 ఏళ్లుగా పాఠాలు చెప్తున్నారు. పాటల ద్వారా పాఠాలు అనే కాన్పెస్ట్ తో విద్యార్థులను ఆకట్టుకుంటూ తరగతి గదిపై విద్యార్థులకు ఆసక్తి పెంచుతున్నారు. ఉపాధ్యాయుడు శంకరరావు మూడు రాష్ట్రపతి అవార్డులతోపాటు ఐకరాజ్యసమితి నుంచి కూడా అవార్డు అందుకున్నారు.
శంకరరావు ప్రస్తుతం విజయనగరం జిల్లా గంగచోళ్లపెంట ఉన్నత పాఠశాలలో సోషల్ టీచరుగా పని చేస్తున్నారు. 1998 నుంచి ఆయన వివిధ వాద్య పరికరాలతో కళారూపాలను ప్రదర్శిస్తూ...పాఠాలను బోధిస్తున్నారు. తాను చెప్పే సాంఘిక శాస్త్రం పాఠాల్లోని ఏ పాఠాన్ని ఏ విధమైన కళారూపంలో చెప్తే బాగుంటుందో అలాగే పాఠాలు చెప్తారు. ఈ విధానం వలన పిల్లల్లో ఒత్తిడి సైతం తగ్గుతుందని శంకరరావు తెలిపారు.
స్కూల్ విడిచిపెట్టినప్పుడు విద్యార్థులు ఎంత ఉత్సాహంగా ఇంటికి వెళ్తారో అదే ఉత్సాహంతో తర్వాత రోజు మళ్లీ స్కూల్‌కు రావాలి. అప్పుడే విద్య పట్ల విద్యార్థుల్లో మక్కువ పెరుగుతుంది. నేర్చుకోవాలన్న తపన ఏర్పడుతుంది. ఈ రోజు కొత్తగా పాఠం నేర్చుకుందాం, పాట నేర్చుకుందాం, జానపద కళారూపం నేర్చుకుందామనే భావంతో డిఫరెంట్‌గా పాఠాలు చెప్తున్నారు శంకరరావు.
ఉపాధ్యాయులు శంకరరావు స్వయంగా సంగీత వాయిద్యాలను వాయిస్తూ పాఠాలు చెప్పడమే కాకుండా...పిల్లలను కూడా అందులో భాగస్వామ్యం చేస్తారు. దాని వలన పిల్లలు తరగతి గదంటే నాలుగు గోడలనే కాకుండా...కళాలతో పాటు విజ్ఞానాన్ని పొందే వేదికగా చూస్తారని సోషల్ సైన్సెస్ టీచర్ శంకరరావు అంటున్నారు. తరగతి గదిలోనూ, పాఠశాల ప్రాంగణంలోనూ ఆట, పాటలతో ఆనందకర వాతావరణంలో పాఠ్యాంశాలు బోధించడం వలన విద్యార్థులకు పాఠ్యాంశాలు బాగా అర్థమవుతాయని తెలిపారు.
సోషల్ సైన్స్ పాఠాలంటే చాలా మంది విద్యార్థులు బోర్ ఫీల్ అవుతారు. అలా ఫీలవ్వకుండా...వాళ్లు ఈ లెసన్ ని ఆడుతూ, పాడుతూ చేయాలనే భావంతోని పాట రూపంలో చెబుతున్నారు. స్వాతంత్రోద్యమాన్ని ఒక బుర్రకథ రూపంలో...ఆ తరగతిలో ఉన్న ముగ్గురు విద్యార్థులతో...మిగతా విద్యార్థులకు బుర్రకథ రూపంలో చెప్పిస్తున్నారు.
విద్య, వైద్య, వైజ్ఞానిక, సామాజిక అంశాలపై పాటలు రాయడం, రచనలు చేయడం, వాటికి అవసరమైన బాణీలను కట్టడంలో కూడా శంకరరావు దిట్ట. విభిన్నమైన బోధనపద్దతులతోపాటు జీవి వైవిధ్యంలో ఈయన కృషి చేస్తారు. అందుకుగాను మూడు రాష్ట్రపతి అవార్డులు, ఐకరాజ్యసమితి జీవవైవిద్య అంతర్జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. పాఠ్యాంశాలకు సామాజిక అంశాలను కలిపి పాటల రూపంలో పాఠాలు వినడం ఆసక్తికరంగా ఉందని, పాఠాలు కూడా బాగా గుర్తుంటున్నాయని విద్యార్థులు అంటున్నారు.
"6 నుంచి 10 వరకు మాకు సారే చెప్తున్నారు. పాఠాలను పాటలలో చెప్పడం మాకు చాలా అర్థమవుతున్నాయి. మాకు మాములుగా కన్నా...పాటలలో చెప్పడం, సరదాగా చెప్పడంతో బాగా అర్థమవుతున్నాయి." అని విద్యార్థులు చెబుతున్న మాట.
ఇటువంటి మాస్టారు మారేక్కడ దొరకరు. పాటలు రూపంలో పాఠాలు చెప్తూ...కళాత్మాకంగా తప్పెటగుళ్లు, బుర్రకథల రూపంలో ప్రదర్శనలు చేస్తున్నారు. లెసన్ చెప్పాలంటే పది పేజీలుంటుంది. అవన్నీ చదివిసి గుర్తుపెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అదే పాట రూపంలో మెయిన్ పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే ఫైనల్ ఎగ్జామైనా రాసేయవచ్చు. అలా చరిత్రకు సంబంధించి బోలెడు రచనలు కూడా చేశారు శంకరరావు మాస్టారు.
శంకరరావు టీచర్ ఏ స్కూల్ లో పని చేసినా ఆయన ఇదే విధంగా బోధన చేస్తుంటారు. దీంతో ఆయనతోపాటు పని చేసే సహాపాధ్యాయులు సైతం ఆయన చెప్పే విధానానికి ఆకర్షితులవుతారు. పిల్లలకు ఏ విధంగా పాఠాలు చెప్తే ఆసక్తిగా వింటారో శంకరరావు టీచర్ కు బాగా తెలుసునని చెప్తున్నారు