అన్వేషించండి

Duvvada Srinivas: దొరికేసిన దువ్వాడ- రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యగా చెప్పాలంటూ మాధురికి బ్రీఫింగ్‌

Tekkali: వైఎస్‌ఆర్‌ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటి ట్విస్ట్ రివీల్ అయింది. మాధురిది సూసైడ్ కాదని ప్రమాదాన్ని ఆత్మహత్యగా మార్చేశారని ఫోన్ సంభాషణ ద్వారా తేలింది.

Srikakulam: దువ్వాడ శ్రీనివాస్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్, మాధురి వాయిస్‌తో ఉన్న ఓ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవ జరుగుతున్న టైంలోనే మాధురి ఓ కారు ప్రమాదంలో చిక్కుకున్నారు. తాను ఆత్మహత్య చేసుకోవడానికే కారును స్పీడ్‌గా నడిపానంటూ అప్పట్లో దుమారం రేపాయి. 

అయితే అదంతా దువ్వాడ శ్రీనివాస్ బ్రీఫింగ్ అంటూ ఇప్పుడు ఓ ఆడియో వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత మాధురికి ఫోన్ చేసిన దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు. ప్రమాదం ఎలా జరిగింది... దెబ్బలు ఏమైనా తగిలాయా అని ఆరా తీశారు. తనకు చిన్న దెబ్బలే తగిలాయని బెలూన్స్ ఓపెన్ కావడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని చుట్టుపక్కల వాళ్లు వచ్చి రక్షించారని మాధురి చెప్పారు. 
ఈ సంభాషణల్లో చాలా సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇది ప్రమాదం కాదని ఆత్మహత్య చేసుకోవడానికే తాను ఇలా కారును స్పీడ్‌గా నడిపించానని చెప్పాలని అందులో దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నట్టు వాయిస్‌లో ఉంది. 
సంభాషణ ఇలా సాగింది
దువ్వాడ శ్రీనివాస్:- హలో...
మాధురి:- ఏవండీ..
దువ్వాడ శ్రీనివాస్:- ఆ..ఆ.. అమ్మా.. ఎలగుందే?
మాధురి:- ఫర్లేదు(ఏడుస్తూ)
దువ్వాడ శ్రీనివాస్:- ఆ... ఏం పనిచేశావే నువ్వు.. ఎంత పని చేశావే నువ్వు... అందుకే ఆడిని తీసుకెళ్లూ తీసుకెళ్లూ అంటే నా మాట వినవు నువ్వు. 
మాధురి:- ఆడికి కూడా ఏదో అయిపోయి ఉండేది. 
దువ్వాడ శ్రీనివాస్:- ఇప్పుడు ఎలాగుంది నీ ఒంట్లో..
మాధురి:- ఆ... 
దువ్వాడ శ్రీనివాస్:- ఆ... 
మాధురి:- హలో... 
దువ్వాడ శ్రీనివాస్:- ఒంట్లో ఎలగుంది? 
మాధురి:- తల... తలకు దెబ్బ తగిలింది. తలంతా నొప్పిగా ఉంది. 
దువ్వాడ శ్రీనివాస్:- నిన్ను ఇప్పుడు హాస్పిటల్‌లో పెట్టారా? 
మాధురి:- యాంబులెన్స్‌లో ఉన్నాను.. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు. 
దువ్వాడ శ్రీనివాస్:- యాంబులెన్స్‌లో ఉన్నావా?
మాధురి:- అవును.. 
దువ్వాడ శ్రీనివాస్:-హేమాచలం నీ యనకాలే వస్తున్నాడు. దగ్గరికి వచ్చేశాడు.  
మాధురి:- ఎవరు?
దువ్వాడ శ్రీనివాస్:- హేమాచలం. హేమాచలం ఆల్రెడీ వచ్చాడు. అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మకు పంపిస్తున్నాను. నీవేం వర్రీ అవ్వకు. నువ్వు ఒక్కటి చెప్పు. దీన్ని ఏం చెప్తావంటే... నేను కావాలనే... సూసైడ్ చేసుకోవాలని చూసాను. ఆమె దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం. నాలుగు రోజులుగా చేస్తున్నదానికి సూసైడ్ చేసుకోవాలని చనిపోవాలని గుద్దేశానని చెప్పు. ఒకటే మాట.   
మాధురి:- ఆ... 
దువ్వాడ శ్రీనివాస్:- ఆ.. అది ఒకటే మాట చెప్పు. డాక్టర్‌ ఇవన్నీ నేను చూస్తాను. అందరూ వస్తారు ఫర్వాలేదు డోంట్‌వర్రీ. 
మాధురి:- నేను మనస్థాపం చెంది హైవేలో వెళ్లి గుద్ది చచ్చిపోదామని అనుకున్నాను.. నన్ను ఎవరూ కాపాడొద్దు అని 
దువ్వాడ శ్రీనివాస్:- ఆ.. అదే వర్డ్.. 
మాధురి:- ప్రెస్‌కి పంపించండి నేను దిగినప్పటికే. 
దువ్వాడ శ్రీనివాస్:- ఎవరికి? 
మాధురి:- ప్రెస్‌కి 
దువ్వాడ శ్రీనివాస్:- ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌ చేయాలి
మాధురి:- ఏంటీ... 
దువ్వాడ శ్రీనివాస్:- ఇప్పటికీ నేను చనిపోదామనుకుంటున్నాను.. అని
మాధురి:- అంతే... పంపించండి
దువ్వాడ శ్రీనివాస్:- నేను ఇప్పటికీ చనిపోతాను అంటూ వీడియో పంపించండీ.. 
మాధురి:- అవికి చెప్పి వెంటనే జీజీహెచ్‌కు పంపించండి, నేను బాగానే ఉన్నాను. ఎయిర్ బెలూన్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి.  
దువ్వాడ శ్రీనివాస్:- అవినాష్‌ వస్తున్నాడు. ఫస్ట్ హేమ వస్తున్నాడు నీ దగ్గరకు. 
మాధురి:- ఫస్ట్‌ అవినాష్‌కు చెప్పి ప్రెస్‌లను జీహెచ్‌కు అర్జెంట్‌గా వెళ్లమని చెప్పమనండీ. సూసైడ్‌ అటెంప్ట్ చేసిందని ఎవరికైనా చెప్పేయమనండీ.  
దువ్వాడ శ్రీనివాస్:- నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. 
మాధురి:- చేసే... త్వరగా చేయండి నేను చెప్తాను. బాగానే ఉన్నాను తలకి కొంచెం స్వెల్లింగ్ ఉంది అంతే.. లిప్‌కి దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది. అంతే. 
దువ్వాడ శ్రీనివాస్:- కారు బాగా బోల్తాపడిపోయిందంట కదా... 
మాధురి:- ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకు పల్టీలు కొట్టింది. లక్కీగా ఎవరో వచ్చారు. లేకుంటే పెట్రోల‌్ లీక్‌ అయి గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఊపిరి కూడా తీసుకోలేకపోయాను. 
దువ్వాడ శ్రీనివాస్:- ఇవన్నీ మాట్లాడొద్దు ప్రశాంతంగా ఉండు. హాస్పిట్‌లు వెళ్లు. అక్కడకు అందరూ వస్తారు. 
మాధురి:- నా ఫోన్స్ ఎక్కడున్నాయో తెలియదు?
దువ్వాడ శ్రీనివాస్:- ఫోన్స్ అన్నీ కానిస్టేబుల్‌ ఇచ్చాడు. 
మాధురి:- అందులో గోల్డ్ కూడా ఉంది. 
దువ్వాడ శ్రీనివాస్:- అన్ని కానిస్టేబుల్ దగ్గరున్నాయి. 
మాధురి:- ఆ.. 
దువ్వాడ శ్రీనివాస్:- పద్మ కూడా వస్తుంది అవినాష్ వస్తున్నాడు. 
మాధురి:- ఓకే 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget