Vizag Summit 2nd Day Investments : ప్రముఖ సంస్థల భారీ పెట్టుబడులు - రెండో రోజు ఎంవోయూలు చేసుకున్న ప్రముఖ సంస్థలు ఇవే !
విశాఖ పెట్టుబడుల సదస్సులో రెండో రోజు పలు సంస్థల పెట్టుబడుల ప్రకటనలు చేశాయి.
Vizag Summit 2nd Day Investments : విశాఖపట్నంలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సులో రెండో రోజు పలు ప్రముఖ కంపెనీలు ఏపీలో తమ పెట్టుబడులను ప్రకటించాయి. అపాచీ అండ్ హిల్ టాప్ గ్రూప్ ఇండియా ఆపరేషన్స్ హెడ్ సెర్గీలీ సమ్మిట్‌లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో వందల మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టనున్నట్లుగా ప్రకటించారు. పాదరక్షల తయారీకి ప్రపంచ స్థాయి సౌకర్యాలు అక్కడ కల్పిస్తామని.. పది వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని సెర్గీలీ ప్రకటించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ఎంవోయూ చేసుకున్నామని తొమ్మిది నెలల్లోనే వంద మిలియన్ డాలర్లు పెట్టుబడిపెట్టామన్ారు. పూర్తిగా ఎగుమతులు చేసే ఉత్పత్తులతో పరిశ్రమ ప్రారంభించామన్నారు. అపాచీ ఇండియా సంస్థకు ఇప్పటికే నెల్లూరులో పరిశ్రమ ఉంది.
ఏపీ ప్రభుత్వంతో సీఐఐ కలిసి పని చేస్తుంది : సుచిత్ర ఎల్లా
సమ్మిట్‌లో భారత్ బయోటెక్‌కు చెందిన సుచిత్రా ఎల్లా కూడా పాల్గొన్నారు. స్టార్టప్ ఎకో సిస్టమ్ ఎంతో ముఖ్యమన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇలాంటి ఎకో సిస్టమ్ సృష్టించడంలో ఎంతో ముందుకు వెళ్లాయన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఏపీ ప్రభుత్వంతో కలిసి ప్రోటోటైప్ డెవలప్‌మెంట్ సెంటర్ మీద పనిచేయాల్సిఉందన్నారు. ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం... నలబై శాతం మంది సైన్స్ గ్రాడ్యూయేట్స్ మహిళలే అవుతున్నా.. వారిలో శాస్త్రవేత్తలు అవుతున్నది మాత్రం కొద్ద మందేనన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి సీఐఐ పని చేస్తుందని ప్రకటించారు.
పులివెందులలో తొలి ప్రాజెక్ట్ - ఏపీలో భారీగా పెట్టుబడులు : వినీత్ మిట్టల్
అవాడా గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టర్ భారీ పెట్టుబడిని ప్రకటించారు. పెట్టుబడిదారులకు ఏపీ ఓ రోల్ మోడల్ గా ఉంటుందన్నారు. పదేళ్లుగా ఏపీలో పెట్టుబడులు పెడుతున్నామన్నారు. పులివెందులలో పెట్టిన తొలి సోలార్ ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్‌గా నడుస్తోందన్నారు. అవార్డులు కూడా వచ్చాయన్నారు. సంప్రదాయేతర ఇంధన విద్యుత్ విషయంలో దేశంలోనే ఇండియా ప్రత్యేకత లిగి ఉందన్నారు. పంప్డ్ హైడ్రో ప్రాజెక్టుల కోసం అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. సోలార్ విషయంలో ఏపీ లీడర్‌గా ఎదుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. అవాడా గ్రూప్ తరపున తాము పెద్ద ఎత్తున పెట్టుబడులను గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టబోతున్నట్లుగా వినీత్ మిట్టల్ ప్రకటించారు.
హెటెరో గ్రూప్ రూ. వెయ్యి కోట్ల పెట్టుబడి ప్రకటన
ఫార్మా రంగంలో ప్రపంచంలో భారత్ ఓ లీడింగ్ పొజిషన్‌లో ఉందని హెడెరో మేనేజింగ్ డైరక్టర్ బండి వంశీ కృష్ణ అన్నారు. విశాఖ సమ్మిట్‌లో మాట్లాడిన ఆయన రూ. వెయ్యి కోట్లను ఏపీలో పెట్టుబడిగా పెట్టనున్నట్లుగా ప్రకటించారు. మూడు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. కోరనా తర్వాత చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇండియాలో పెట్టుబడులు పె్టటేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఏపీతో తమ వ్యాపార బంధం కొనసాగుతుందని ప్రకటించారు. హెటెరో గ్రూప్ రెండున్నర బిలియన్ల డాలర్ల అతి పెద్ద ఫార్మా గ్రూపుగా ఉందని.. ఏపీ ప్రభుత్వ ఫార్మా పాలసీ వల్ల హెటెరో గ్రూప్ లాభపడిందన్నారు.విశాఖపట్నంలో ఐదు వందల ఎకరాల్లో యూనిట్ ఉందని తెలిపారు. విశాఖ నుంచి తాము చేస్తున్న ఉత్పత్తులు ప్రపంచం మొత్తం వెళ్తున్నాయన్నారు.