By: ABP Desam | Updated at : 24 Mar 2022 10:10 AM (IST)
RRR థియేటర్లలో అధికారుల తనిఖీలు
ఏపీలో సినిమా థియేటర్‌లపై అధికారులు మరోసారి దృష్టి సారించారు. టాలీవుడ్ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా RRR మరో రోజులో రిలీజ్ కాబోతుంది. దీనిపై అంచనాలు, క్రేజ్ ఆకాశాన్నంటుతున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం, వారిద్దరూ టాలీవుడ్‌లోని రెండు పెద్ద కుటుంబాలకు చెందిన నటులు. అన్నిటినీమించి ఇది రాజమౌళి సినిమా కావడంతో ఎంత రేటైనా పెట్టి మొదటి రెండు రోజుల్లోనే సినిమా చూసెయ్యాలని ఎదురుచూసే వాళ్లకు కొదవ లేదు.
ఇలాంటి వాళ్ళను టార్గెట్ చేసి బ్లాక్ టికెట్టు అమ్మడానికి ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అంటున్నారు అధికారులు. ఇప్పటికే వైజాగ్లో RRR సినిమా టికెట్లు బ్లాక్‌లో 5000 వరకూ పలికింది అని వార్తలు వస్తున్నాయి. అల్లా ఎవరైనా బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన శిక్షలు ఉంటాయని అధికారులు , పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే సినిమా థియేటర్‌లనూ వారు చెక్ చేస్తున్నారు. అలాగే కొన్ని థియటర్‌లు కావాలనే ఆన్లైన్‌లో పూర్తి స్థాయిలో టికెట్స్ ఉంచడం లేదనే ఆరోపణలూ వస్తున్నాయి. ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని, ఎవరూ బ్లాక్ టికెటింగ్‌కి పాల్పడవద్దని వారు చెబుతున్నారు. అందుకే విశాఖలోని వివిధ థియేటర్ల వద్ద తనిఖీలు నిర్వహించారు .
టికెట్ల అమ్మకాలలో అవకతవకలు
వైజాగ్‌లోని అనేక సినిమాహాళ్ళలో టికెట్ల అమ్మకాలలో అవకతవకలు జరుగుతున్నాయని వస్తున్న ఆరోపణల్లో జిల్లా యంత్రాంగం అలెర్ట్ అయింది. RRR సినిమాకు సంబంధించిన టికెట్స్‌ను ఆన్లైన్‌లో ఉంచకుండా బ్లాక్ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చిన థియేటర్లపై అధికారులు తనిఖీలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే టికెట్స్ అమ్ముతున్నారా లేదా అంటూ వారు చెక్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సినిమా టికెట్స్‌ను ఆన్లైన్‌లో పెట్టకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు థియేటర్ల యాజమాన్యాలను హెచ్చరించారు.
టాలీవుడు మాత్రమే కాక దేశవ్యాప్తంగా సిని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న RRR మూవీ శుక్రవారం విడుదల కానుంది . దర్శక ధీరుడు రాజమౌళి ఇద్దరు టాప్ స్టార్స్ ,ఎన్టీఆర్ ,రాంచరణ్‌తో రూపొందించిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ కూడా ఈ సినిమాలో నటించడంతో బాలీవుడ్‌లోనూ RRRపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో, బాహుబలి తొలిరోజు రికార్డ్స్ ను బీట్ చేస్తుంది ఈ సినిమా అంటూ సినీ పండితులు లెక్కలు వేస్తున్నారు . స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతా రామ రాజు ,కొమరం భీం పాత్రల ఆధారంగా రూపొందిన కల్పిత కథతో ఈ సినిమా తెరకెక్కింది . ఈ నేపథ్యంలో థియేటర్ల వద్ద నందమూరి, మెగా ఫ్యాన్స్ కోలాహలం మామూలుగా లేదు .
Srikakulam Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం- ఇంటి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే !
Tammineni Seetharam : కుళ్లి, కృశించిపోయిన టీడీపీకి మహానాడులో దహన సంస్కారాలు, స్పీకర్ తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు
Jupudi Prabhakar Rao : శెట్టిబలిజలను క్షమాపణలు కోరిన జూపూడి ప్రభాకర్, 'మత్తులో ఉండి చేశారా' కామెంట్స్ పై వివరణ
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
YSRCP Bus Yathra : ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా బస్సు యాత్ర- వ్యతిరేకత రాకుండా వైసీపీ స్కెచ్
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!