By: ABP Desam | Updated at : 07 May 2022 11:18 AM (IST)
నర్సీపట్నం రేప్ కేస్ అప్డేట్
సంచలనం సృష్టించిన నర్సీపట్నంలో 6 ఏళ్ల బాలికపై రేప్ కేసులో నిందితుడు గోండి సాయిరాం కిరణ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బృందాలు తీవ్రంగా గాలించి నిందితుడిని పట్టుకున్నాయి. అతనిపై ఐపీసీ 376, పోక్సో చట్టాల క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతను పాత నేరస్తుడేనని చెబుతున్నారు. 2018 ,19 ల్లో నర్సీపట్నంలో జరిగిన పలు దొంగతనాల కేసుల్లో కిరణ్ నిందితుడిగా గుర్తించారు. చెడువ్యసనాలకు బానిసైనట్టు కూడా స్థానికులు తెలిపారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఎస్సీ కాలనీలో ఒక ఆరేళ్ళ బాలిక అర్ధరాత్రి రెండు గంటల దాటిన తర్వాత తన అక్కతో కలిసి బహిర్భూమికి వెళ్లింది. అక్కడే ఉన్న అదే కాలనీకి చెందిన గొంది సాయిరాం కిరణ్ ఆ పాప నోరు నొక్కి తీసుకెళ్లిపోయాడు. ఆ బాలిక సోదరి ఇంట్లోకి పరిగెత్తి తల్లిదండ్రులకు విషయం చెప్పింది కంగారు పడిన బాలికను వెతకడం మొదలుపెట్టారు. పక్కవీధిలో బాలికపై కిరణ్ అత్యాచారం చేస్తూ కనిపించాడు. జనం రావడంతో కిరణ్ పారిపోయాడు. రక్తస్రావంలో పడి ఉన్న బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
నిందితుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు
విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలించారు. బృందాలుగా ఏర్పడి కిరణ్‌కోసం ఎంక్వయిరీ చేశారు. చివరకు గురంధర పాలెం సమీపంలో కిరణ్ పోలీసులకు చిక్కాడు. ఇతనిపై పాత కేసులు కూడా నమోదై ఉన్నాయని,ఇతణ్ణి కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మంత్రి ఉషశ్రీ తెలిపారు. కేజిహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను ఆమె పరామర్శించారు.
ఇప్పటికైనా కళ్ళు తెరవాలి :టీడీపీ
ఆరేళ్ల బాలికలకు కూడా రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్న పాత్రుడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన ఆయన ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. సీఎం జగన్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారాయన.
నర్సీపట్నం హాస్పిటల్‌లో పాపకు చికిత్స అవసరం లేదన్నారు అనీ... తీరా చూస్తే కేజిహెచ్‌లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేశారాయన. మరో టీడీపీ నేత అనిత మాట్లాడుతూ బాలిక కనీసం వైద్యానికి సహకరించే పరిస్థితిలో కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నర్సీపట్నంలో చాలా మంది మాదకద్రవ్యాలకు బానిసై ఆడవాళ్లపై పడుతున్నారని.. లోకల్స్ చెప్పే వీడియోను టీడీపీ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
రాష్ట్రంలో గంజాయి ఏ స్థాయిలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుందో నర్సీపట్నంలోని ఈ మహళల మాటల్లో వినండి.
— Telugu Desam Party (@JaiTDP) May 6, 2022
ఇంతోడు గంజాయి తాగి, అంతోడు గంజాయి తాగి, ఆ మత్తులో వావి వారసులు తెలియకుండా ఆడ వాళ్ళ పై పడిపోతున్నారు, పోలీసులు పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసారు. pic.twitter.com/Ljn7AX8p0I
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
YSRCP Bus Yathra : ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా బస్సు యాత్ర- వ్యతిరేకత రాకుండా వైసీపీ స్కెచ్
AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర
New Trend In Vizag: మేడ మీద ఫుట్ బాల్ -వైజాగ్‌లో న్యూ ట్రెండ్
Bhogapuram Air Port: భోగాపురం అంటే పెళ్లి కానేదు- ఊర్ని అల్లకల్లోలం చేసి ఎళ్లిపోమంటే ఎలా? ఎయిర్‌పోర్టు నిర్వాసితుల గోడు
Breaking News Live Updates: జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యం : సీఎం కేసీఆర్
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
Atmakur By Elections: ప్రతిపక్షాల వ్యూహం ఏమిటి? | Andhra Pradesh Elections | ABP Desam