అన్వేషించండి

Gudivada Amarnath: వారి మరిదిలా మేం అప్పులు దుబారా చేయట్లేదు, చిన్నమ్మ తెలుసుకోవాలి - గుడివాడ కౌంటర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు.

రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడే అప్పు చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. తెచ్చిన ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై దర్యాప్తు జరిపిస్తామని, ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. విశాఖపట్నంలోని స్థానిక జీవీఎంసీ ఆవరణలో మీడియా ప్రతినిథులు బుధవారం మంత్రి అమర్నాథ్ ను ఈ విషయంపై స్పందించాలని కోరారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసాను ఒక పక్క ప్రజా సంక్షేమాన్ని, మరోపక్క రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తుందని అన్నారు. దీనికి అవసరమైన మొత్తాన్ని నిబంధనల మేరకు వివిధ రూపాల్లో సేకరిస్తుందని చెప్పారు. తాము ఎవరికీ చెప్పకుండా, చేసిన అప్పుకు లెక్క లేకుండా తెచ్చిన మొత్తాన్ని దుబారా చేయడం లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అప్పుకు లెక్క లేదని ఆయన ఆరోపించారు. 

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ కూడా బాగా ఆయనతో కలిసి ఉందని, అప్పుడు బీజేపీలో ఉన్న చిన్నమ్మ, బాబు చేసిన అప్పుల గురించి ఎందుకు అడగలేదని అమర్నాథ్ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి పైసాకి లెక్క చెబుతోందని అమర్నాథ్ అన్నారు. పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏదో మాట్లాడాలి కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చిన్నమ్మ నిజాలు తెలుసుకుంటే మంచిదని అమర్నాథ్ హితవు పలికారు.

‘‘ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలు, డెవలప్ మెంట్ వర్క్స్ అన్నీ కూడా ఓ పద్ధతి ప్రకారం నడుస్తాయి. ఒకవేళ లోటు బడ్జెట్ ఉంటే దాని ప్రకారమే అప్పులు చేస్తుంది. ఏదో దాచుకొని అప్పులు చేయడం లాంటిది ఉండదు. గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి పురంధేశ్వరికి మరిది అవుతారు. ఆయనలా మేం చేయట్లేదు. చేసిన పనిని పారదర్శకంగా చూపిస్తున్నాం. వారి మరిదిలా మేం చేసిన అప్పునకు లెక్కా డొక్కా లేకుండా ఏం లేము. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ అప్పుడే ప్రశ్నించి ఉంటే బాగుండేది.’’ అని గుడివాడ అమర్ నాథ్ అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Net Zero Village: ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget