అన్వేషించండి
Advertisement
King Cobra Man: ఆయన్ని చూస్తే కింగ్ కోబ్రాలు సెల్యూట్ చేస్తాయి
అడవుల్లోని జీవ వైవిధ్యాన్ని బ్యాలెన్స్ చేస్తున్న కింగ్ కోబ్రాల అవసరం ప్రకృతికి చాలా ముఖ్యమని అంటున్నారు మూర్తి. అందుకే వాటిని రక్షించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.
చూడగానే భయాన్ని.. ఆశ్చర్యాన్ని కలిగించే కింగ్ కోబ్రాలను కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడో యువకుడు. వైజాగ్‌కు చెందిన మూర్తి కంఠి మహంతి. జువాలజీలో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ చేసారు. మొదటి నుంచీ కింగ్ కోబ్రాల పట్ల ఆసక్తి కల మూర్తి.. వాటిని కాపాడటానికి నిర్ణయించుకున్నారు. ఇవి ప్రమాదకరమైన జీవులుగా భావించి గిరిజనులు చంపేస్తుండడంతో వారిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
తన ఆలోచనలను ఫారెస్ట్ అధికారులతో పంచుకుని వారి సహకారంతో ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ నెలకొల్పి తూర్పు కనుమల్లోని అరుదైన జీవజాతుల్ని, ముఖ్యంగా కాంగ్ కోబ్రాలను కాపాడుతున్నారు. దీని కోసం ఆయన విదేశాల్లో ప్రత్యేక శిక్షణ పొందారు. 2016 లో తొలిసారిగా శ్రీకాకుళంలో ఒక కింగ్ కోబ్రాను కాపాడిన మూర్తి అక్కడి నుంచి విశాఖ మన్యంలోని అనేక గిరినాగుల్ని కాపాడారు. విషపూరిత పాముల్ని తినే కింగ్ కోబ్రా.. తాచు, పొడ, కట్ల పాము వంటి పాములు బాధ జనాలకు లేకుండా చేస్తుందనీ అడవుల్లోని జీవ వైవిధ్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండడం వలన కింగ్ కోబ్రాల అవసరం ప్రకృతికి చాలా ముఖ్యమని అంటున్నారు మూర్తి .
పాము జాతిలో తిరుగులేని నాగరాజం -కింగ్ కోబ్రా :
కింగ్ కోబ్రా.. ఆ పేరు వింటేనే పడగ విప్పి ఠీవిగా కనపడే మహాసర్పం కనిపిస్తుంది. గిరిజనులు అలుగు నాగు, గిరినాగు, రాచనాగు ఇలా అనేక పేర్లతో పిలుచుకునే ఈ పాము విషపూరిత సర్పాల్లోనే అతి పొడవైంది. ఏకంగా 18 అడుగుల పొడవు పెరిగే కింగ్ కోబ్రాలు ఆహారంగా ఇతర పాముల్నే తింటుంది. కొన్నిసార్లు ఏకంగా కొండచిలువల్ని సైతం కింగ్ కోబ్రాలు తినేసిన సంఘటనలూ ఉన్నాయి. దీని విషం ఎంత పవర్ ఫుల్ అంటే ఒక్కకాటులో 20 మంది మనుషుల్ని లేదా ఒక పెద్ద ఏనుగును చంపేంత విషం ఉంటుంది.
మామూలుగా 20 ఏళ్ళు బతికే కింగ్ కోబ్రా ఒక్కోవిడతలో 20 నుంచి 40 గుడ్లను పెడుతుంది. అంతేకాదు ఆ గుడ్లను పొదగడం కోసం గూడు కట్టే పాము కూడా కింగ్ కోబ్రానే. తాచు పాములానే దీనికీ పడగ ఉంటుంది. కానీ ఇది తాచుపాము జాతికి చెందదు. బాగా ఎదిగిన కింగ్ కోబ్రా నేలపై నుంచి 6 అడుగుల ఎత్తు వరకూ లేచి పడగను ఎత్త గలదు. చూడడానికి భీకరంగా కనపడే కింగ్ కోబ్రా నిజానికి మనుషుల మీదకు దాడికి దిగదు . అసలు మనుషులు ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తుంది. అయితే అడవులు నాశనం అవుతుండడం, దారి తప్పడం , బాగా వేడిగా ఉండే ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లే ప్రయత్నం చెయ్యడంలో జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి.
అలా జనావాసాల్లోకి వచ్చిన కింగ్ కోబ్రాలను కాపాడడానికి ఈస్టర్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రయత్నిస్తుంది. వీరి ఆఫీస్ వైజాగ్‌లో ఉండగా .. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండడానికి చోడవరంలో మరో కార్యాలయం ఏర్పాటు చేశారు. చాలా విశాలమైన ప్రాంతంలో విస్తరించిన తూర్పుకనుమలనూ, విశాఖ మన్యం మొత్తాన్ని కవర్ చెయ్యడం సాధ్యం కాదు కాబట్టి గిరిజ యువకుల్లో ఆసక్తి కలవారిని వాలంటీర్ లుగా చేర్చుకున్నారు. వారితో కూడా జనావాసాల్లోకి వచ్చిన కింగ్ కోబ్రాలను, ఇతర జీవజాతులను కాపాడి, తిరిగి అడవుల్లో వదిలేసేలా వారికి ట్రైనింగ్ ఇస్తుంది ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ. వీరి గురించి తెలుసుకున్న అనేక మంది ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ ఎక్స్ప్లోరర్ లు తూర్పుకనుమలకు వచ్చి వీరితో కలిసి కింగ్ కోబ్రాలపై అనేక పరిశోధనలు సైతం చేస్తున్నారు .
అటవీశాఖ ప్రోత్సాహం చాలానే ఉంది :
ఇక ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ ని మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న అటవీశాఖ అధికారులు కింగ్ కోబ్రాలను కాపాడడంలో మూర్తి అండ్ కో పాత్ర చాలా ఉందని చెబుతున్నారు. ఒక ఎన్జీవో ఇలాంటి అరుదైన పనిచెయ్యడానికి ముందుకు రావడం చూసి తాము ప్రోత్సహించామని ,దానివల్ల చాలా మంచి ఫలితాలు వచ్చాయని అంటున్నారు ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రామ్ మెహన్. అటవీ పరిభాషలో కింగ్ కోబ్రా చాలా ముఖ్యమైన జీవ జాతి అనీ ,తాము చేపట్టిన కార్యక్రమాల వల్ల గిరిజనుల్లోనూ ,అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే వాళ్ళలోనూ అవగాహన బాగా పెరిగింది అనీ అంటున్నారు ఆయన.
ఇంతకుముందు కింగ్ కోబ్రా కనిపిస్తే చంపేసేవారని ,ఇప్పుడు ఆ పరిస్థితి మారి ,పాము కనపడగానే ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ కి ఫోన్ చేస్తున్నారని తద్వారా వాటిని కాపాడడంలో తమకు అవకాశాలు పెరిగాయని రామ్ మోహన్ అంటున్నారు.ఇలా అరుదైన కింగ్ కోబ్రా లను కాపాడడమే లక్ష్యంగా అడవుల్లో పనిచేస్తున్న మూర్తి అండ్ కోను ఇప్పటికే అనేక అవార్డులు ,పురస్కారాలు వరించాయి .
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion