AP BJP News : విశాఖ సీతకొండకు వైఎస్ఆర్ పేరు పెట్టడంపై ఉద్యమం- బీజేపీ నేతల హౌస్ అరెస్టులతో దుమారం !
విశాఖలో ఏపీ బీజేపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు. పోలీసులు , ప్రభుత్వం తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు.
AP BJP News : ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న విశాఖ సీత కొండ కు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా నామకరణాన్ని చేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఉద్యమం చేయడానికి పిలుపునిచ్చారు. సోేమవారం రోజు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దమయ్యారు. అయితే పోలీసులు ఉదయం నుంచి వారిని హౌస్ అరెస్ట్ చేశారు. విశాఖ లో సీత కొండ పేరు మార్చడం అన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమానికి పిలుపు నివ్వడం తో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తో సహా బిజెపి నేతలను విశాఖ పోలీసులు లఅదుపులోకి తీసుకున్నారు.
స్టిక్కర్ల ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెబుతారు : మాధవ్
స్టిక్కర్లు ప్రభుత్వంగా పేరు గాంచిన వైసీపి ప్రభుత్వం పర్యాటక కేంద్రాలకు పేర్లు మార్చే పనిలో పడింది ఇదేమిటని ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులకు దిగుతోందని పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. పాలక పార్టీకి అధికారులు తందానా తానా అనడంతో ప్రభుత్వానికి పైత్యం ప్రకోపించి పిచ్చి పదిరకాలు అన్నచందంగా వ్యవహరిస్తోందని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభత్వం సంక్షేమ, అభివృద్ది పధకాలకు స్టిక్కర్లు వేసుకోవడానికి అలవాటు పడి సీత కొండ కు పేరు మార్చేసింది ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి శాశ్వత సిఎం అనుకుంటున్నారా అని మాధవ్ ఎద్దేవా చేశారు. వైఎస్ ఆర్ వ్యూ గా పేరు మార్చడంతో స్ధానికులు ప్రభుత్వాన్ని అసహ్యంచుకుంటున్నారన్నారు. ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం అధికారులు నిభంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారన్నారు. ముఖ్య మంత్రి కి పిచ్చి పరాకాష్టకు చేరి రాష్ట్రంలో ని అన్ని జిల్లాలకు వైఎస్ ఆర్ పేరుగా మార్చి రాష్ట్రానికి కూడా మార్చుకుంటారా అని ప్రశ్నించారు.
విశాఖ వాసులు ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు : సోము వీర్రాజు
ఏది ఏమైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం బిజెపి పోరాటాన్ని కొనసాగిస్తాం హౌస్ అరెస్టులతో ఉధ్యమాన్ని నిలువరించలేరు సీత కొండ పేరు తిరిగి నామకరణం చేసేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని సోము వీర్రాజు హెచ్చరించారు. ఈ మేరకు తన నివాసం నుండి మీడియాకు లేఖ విడుదల చేశారు. సీతకొండ వ్యూ పాయింట్ పేరు మార్పునలకు వ్యతిరేకంగా ఉద్యమానికి పిలుపునిస్తే విశాఖ పోలీసులు బిజెపి నేతలను హౌస్ అరెస్టు చేయటం పై బీజేపి రాష్ట్ర అద్యక్షుడు సొము వీర్రాజు మండిపడ్డారు.రాష్ట్ర ప్రభత్వం సంక్షేమ, అభివృద్ది పధకాలకు స్టిక్కర్లు వేసుకోవడానికి అలవాటు పడి సీత కొండ కు పేరు మార్చేసింది ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి శాశ్వత సిఎం అనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. వైఎస్ ఆర్ వ్యూ గా పేరు మార్చడంతో స్ధానికులు ప్రభుత్వాన్ని అసహ్యంచుకుంటున్నారన్నారని వీర్రాజు అన్నారు.
అధికార అహంతో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రభుత్వ వ్యవహారం : విష్ణు వర్థన్ రెడ్డి
బీజేపీ నేతల హౌస్ అరెస్టులపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా మండిడ్డారు.జీ 20 మీట్ కోసం సీతకొండ అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చిందని.. కేంద్రం నిధులతో అభివృద్ధి చేసి.. ఇప్పుడు సీతకొండ పేరు మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన బీజేపీ నేతల్ని హౌస్ అరెస్టులు చేయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికార అహం నెత్తికెక్కి ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గుర్తుచేస్తున్నామని.. బేషరతుగా అందర్నీ విడుదల చేసి.. తక్షణం సీతకొండ వ్యూ పాయింట్ పేరును గతంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.
తల్లి సీతకొండను ఆనకొండల్లా పేర్లు సైతం మింగిస్తూంటే ప్రశ్నించకూడదా @ysjagan గారు?
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) May 1, 2023
జీ 20 మీట్ కోసం సీతకొండ అభివృద్ధికి నిధులిచ్చింది కేంద్రం.
రూ. కోటి ఖర్చు కాని పనుల్ని రూ. 3.5 కోట్లు బిల్లలు పెట్టి మీ నేతలు దోచుకున్నారు.
ఇప్పుడు ఆ కొండ పేరు కూడా మార్చేస్తారా ?
ప్రశ్నించిన… pic.twitter.com/GzMdbbfrCd