By: ABP Desam | Updated at : 04 Dec 2021 06:59 AM (IST)
తుపానుపై జగన్ సమీక్ష
జవాద్ తుపాను తీవ్రతుపానుగా మారనుంది. ఐదో తేదీ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఒడిశాలోని కోస్తా ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రజిల్లాలకు వర్షాల ముప్పు పొంచి ఉంది. 70 నుంచి 90కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే అధికారులు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. తుపాను కారణంగా ఇవాళ గంటకు ఈదురుగాలులు వీస్తాయి. తుపాను కారణంగా 95కుపైగా రైళ్లు రద్దయ్యాయి.
తుపాను తీవ్రత తెలుసుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ అప్రమత్తమైంది. వాతావరణ శాఖ అంచనాలతో ప్రభావిత ప్రాంతాల్లో బలగాలను మోహరించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ 46 బృందాలు పంపారు. మరికొన్ని బృందాలు ఎక్కడికైనా వెళ్లేందు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావం శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉత్తరాంధ్రపై కనిపిస్తోంది. చలిగాలులు, వర్షాలు మొదలయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు సోమవారం వరకు సెలవులు ప్రకటించారు. ఏవైనా ప్రాంతాలు ముంపునకు గురైతే తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వాతావరణశాఖాధికారి సునంద తెలిపారు. అత్యవసర సేవల కోసం నౌకాదళం, కోస్టుగార్డు సేవలతోపాటు హెలికాప్టర్లు సిద్ధం చేశారు.
తుపానుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... అధికారులు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. ఆయన సూచనల ప్రకారం...శ్రీకాకుళానికి అరుణ్‌కుమార్, విజయనగరానికి కాంతిలాల్ దండేను ప్రత్యేకాధికారులుగా అధికారులు నియమించారు. తుపాను సన్నద్దతపై జిల్లా అధికారులతో వీళ్లిద్దరు చర్చలు జరుపుతున్నారు.
Koo Appఉత్తర కోస్తా జిల్లాలకు జవాద్ తుపాను ముప్పు నేపధ్యంలో క్యాంప్ కార్యాలయం నుంచి విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం శ్రీ వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ #CMYSJagan #AndhraPradesh #JawadCyclone - YSR Congress Party - YSRCP (@YSRCPOfficial) 3 Dec 2021
తుపాను కారణంగా ప్రాణ నష్టం అసలు ఉండకూడదని అధికారులకు సీఎం జగన్ గట్టగా చెప్పారు. సహాయచర్యల్లో అసలత్వానికి చోటు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని... జిల్లాకు పది కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచామని అధికారులు వివరించారు. తుపాను పరిస్థితిపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మాట్లాడారు. వారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలుసుకున్నారు.
Also Read: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Vizag Bride Death: పెళ్లి పీటలపై వధువు మృతి కేసులో వీడిన చిక్కుముడి - అసలు నిజం కనిపెట్టేసిన పోలీసులు
Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా
Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !
Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!
Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!
Akshay Kumar: అలా మాట్లాడితే నాకు నచ్చదు - సౌత్, నార్త్ కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ కామెంట్స్
CM Jagan In Davos: సామాన్యుల స్థోమతకు తగ్గట్టుగా వైద్యసేవలు, ఆ దిశగా ఏపీలో విప్లవాత్మక మార్పులు- దావోస్ సదస్సులో సీఎం జగన్
India Railways: భారత్‌లో భారీగా రైల్వే ట్రాక్‌ల ధ్వంసానికి పెద్ద కుట్ర - నిఘా వర్గాల హెచ్చరికలు