By: ABP Desam | Updated at : 03 Mar 2023 12:17 PM (IST)
అక్కసుతోనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై విమర్శలు- ప్రతిపక్షాలపై మంత్రులు ఆగ్రహం
విశాఖలో చేపట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు పారిశ్రామిక దిగ్గజాలు వచ్చారని... ఇది జగన్ ప్రభుత్వ విజయంగా మంత్రులు అభివర్ణిస్తున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇంతటి విజయవంతమైన కార్యక్రమంపై అక్కసుతోనే ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రులు.
పర్యాటక శాఖ మంత్రి రోజా విశాఖలో జరుగుతున్న గ్లోబర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరయ్యారు. సీఎం జగన్‌తో కలిసి పారిశ్రామిక వేత్తలను కలిశారు. అంతకు ముందు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ కౌంటర్‌ను మంత్రి రోజా ప్రారంభించారు. యువతికి ఉద్యోగం ప్రజలకు ఆనందం కలిగించే ఒకే రంగం పర్యాటక రంగమని అభిప్రాయపడ్డారు. వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మెలో దాదాపు 20, 000 కోట్లకుపైగా పర్యాటక రంగంలో ఏంవోయులు జరగబోతున్నాయని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ఉన్న నమ్మకంతో దేశంలోనే కాకుండా విదేశాల నుండి ఎంతో మంది ఇన్వెస్టర్లు ఏపీకి వచ్చారని చెప్పారు రోజా. అంబానీ, ఆదాని, టాటా లాంటి గొప్ప వాళ్ళు కూడా ఈ సమ్మెట్ లో పాల్గొంటున్నరని ఇది చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అక్కసు వెల్లగక్కుతున్నాయన్నారు.
విశాఖలో పారిశ్రామికవేత్తలు సదస్సు సాక్షిగా రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టబడులు వస్తు న్నాయన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. దీన్నిప్రచారానికి వాడుకోకుండా ఒక ప్రణాళికబద్దంగా చేపట్టిన కార్యక్రమం ఇదన్నారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కొట్టు సత్యనారాయమ... జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకంతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడుతున్నారన్నారు. భారతదేశం నుంచే కాక ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడిదారులు పెట్టేందుకు ఏపీ వస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో మౌలికవసతుల కల్పనకు కావలసిన వనరులు పుష్కలంగా ఉన్నాయనే నమ్మకం పారిశ్రామికవేత్తలకు కలిగిందన్నారు కొట్టు. వెయ్యి కిలోమీటర్ల మేర కోస్టల్ కారిడార్ ఉండటం, వారి వారి ఉత్పత్తులను రవాణా చేసుకోవడానికి అనువైన ప్రదేశం ఆంద్రప్రదేశ్ అని వారంతా విశ్వసిస్తున్నారని అభిప్రాయపడ్జారు.
Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
Visakha News : విశాఖలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!
TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?