News
News
X

Global Investors Summit: టార్గెట్ రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు:మంత్రి గుడివాడ అమర్నాథ్

Global Investors Summit:

FOLLOW US: 
Share:

Global Investors Summit: విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రూ.2లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖలోని జీఐఎస్ వేదిక వద్ద గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 

ఏపీ ప్రభుత్వం తరపున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ రేపు(శుక్రవారం) ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సదస్సుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. శుక్రవారం వచ్చే డెలిగేట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒకరోజు ముందుగానే రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టారు. 

అయితే పెట్టుబడులు పెట్టేవారికి ల్యాండ్స్, అన్ని అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చేసుకున్న ఎంవోయూలను వారు ఆరు నెలల్లో గ్రౌండ్ చేస్తే అదనంగా సాయం చేయమని సీఎం సూచించారని వెల్లడించారు. అదేవిధంగా, ఇన్వెస్ట్ మెంట్లను బేస్ చేసుకొని కొన్ని ఇన్సెంటివ్ లను క్రియేట్ చేశామన్నారు. ఈ సదస్సు వేదికగా మొత్తం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిండమే సీఎం టార్గెట్ గా పెట్టుకున్నారని మంత్రి తెలిపారు. భారీగా పెట్టుబడులు తెచ్చి, యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.  పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఉండేలా కొత్త ఇన్వెస్ట్మెంట్ పాలసీని తీసుకువస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ సమస్య లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీని రేపే మేం ప్రకటిస్తామని.. లేదంటే 15 రోజుల తర్వాత దాన్ని ప్రకటించడం జరుగుతుందన్నారు. పెట్టుబడుల కోసం వచ్చే ప్రతి అవకాశాన్ని మేం సమీక్షించనున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చేసుకునే ఎంవోయూలలో 80శాతం రియలైజ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ  సాయంత్రం విశాఖకు చేరుకుంటారు. ఆ తర్వాత సీఎం రేపు జరగబోయే సదస్సుకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రేపు 10.15 గంటలకు సీఎం జగన్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారు. వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్స్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రానున్నారు. రాబోయే ప్రముఖుల అందరి సమక్షంలో ఇనాగురల్ సెషన్  రేపు 2 గంటల ఉంటుంది. అదేవిధంగా రేపు కొన్ని ఎంవోయూలు చేయడానికి నిర్ణయించకున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసిన 150 పైచిలుకు స్టాల్స్ కు సంబంధించిన ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోపాటుగా, సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు సంబంధించి సెక్టరల్ సెషన్స్ కూడా జరగనున్నాయి. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్ వారితో బ్యాక్ టూ బ్యాక్ మీటింగ్ లో పాల్గొంటారు.” అని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. 

46 దేశాల ప్రముఖులు సమ్మింట్ కు వస్తున్నారని చెప్పారు.  8 నుంచి 10 మంది అంబాసిడర్స్ కూడా వస్తున్నారని.. వారికి రేపు సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందరికీ విందు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. డెలిగేట్స్ కు ఆంధ్రా రుచులను పరిచయం చేయబోతున్నామని వెల్లడించారు.

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కోసం అత్యద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం విజ్ణప్తి మేరకు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన ఎంవోయూల మాదిరిగా కాకుండా, వాస్తవానికి దగ్గరగా పరిశ్రమలు స్థాపించి, ఉద్యోగాలు కల్పించే విధంగా తాము చేసిన ఏర్పాట్లు గమనించిన తర్వాత పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుందన్నారు. మార్చి 4న 12 గంటలకు ముగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

Published at : 02 Mar 2023 03:06 PM (IST) Tags: YS Jagan VIZAG VisakhaPatnam Vizag Investors Summit Investors Summit In AP Investors Summit 2023

సంబంధిత కథనాలు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

పలాసలో భూవివాదాలపై మంత్రి భూ దర్బార్‌- కబ్జాలు నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటన

పలాసలో భూవివాదాలపై మంత్రి భూ దర్బార్‌- కబ్జాలు నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటన

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Visakhapatnam: చనిపోతామంటూ నిన్న దంపతుల సెల్ఫీ వీడియో - నేడు మృతదేహాలు లభ్యం

Visakhapatnam: చనిపోతామంటూ నిన్న దంపతుల సెల్ఫీ వీడియో - నేడు మృతదేహాలు లభ్యం

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు