అన్వేషించండి

Vizag News: పరాయి మహిళతో భర్త, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించిన మిస్ వైజాగ్ - అతని ఇంటి ముందే ఆందోళన!

Telugu News: తన భర్త మరో మహిళతో కలిసి ఉండగా విలేకరుల సాయంతో అతణ్ని నక్షత్ర అనే మహిళ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో భర్త తేజ, నక్షత్ర మధ్య చిన్నపాటి ఘర్షణ కూడా చోటు చేసుకుంది.

Visakhapatnam News: సినీ పరిశ్రమలో ఉన్న ఓ యువ జంట మధ్య విభేదాలు విశాఖపట్నంలో బయటపడ్డాయి. భర్త పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడని భార్య ఆరోపిస్తూ ఆయన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గతంలో మిస్‌ వైజాగ్‌ టైటిల్ గెల్చుకున్న నక్షత్ర అనే మహిళ విశాఖపట్నంలో ఆందోళనకు దిగారు. ఈ ఘటన విశాఖలో కలకలం రేపింది. నక్షత్ర 2017లో వెంటకసాయి తేజ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తడంతో తేజ మరో మహిళతో వేరు కాపురం పెట్టారని నక్షత్ర ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తమ మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూ ఉండేవని నక్షత్ర తెలిపారు.

గురువారం నక్షత్ర తన భర్త మరో మహిళతో కలిసి ఉండగా మీడియా విలేకరుల సాయంతో అతణ్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో భర్త తేజ, నక్షత్ర మధ్య చిన్నపాటి ఘర్షణ కూడా చోటు చేసుకుంది. షూటింగ్‌ ఆఫీసు దగ్గరికి వచ్చి నక్షత్ర గొడవ చేయడంతో పోలీసులు ఆమెకు నచ్చ చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే, నక్షత్ర తనపై తప్పుడు కేసులు పెట్టిందని తేజ ఆరోపిస్తున్నారు. తన ఆఫీసుకు వచ్చిన యువతీ యువకులు సినిమా అవకాశాలు, ఆడిషన్ల కోసం వస్తుంటారని తేజ తెలిపారు.

11 ఏళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో నక్షత్ర - వెంటకసాయి తేజ‌కు పరిచయం ఏర్పడి.. అది క్రమంగా స్నేహంగా తర్వాత ప్రేమగా మారింది. అనంతరం అది పెళ్లికి దారి తీసింది. మనసులు ఒక్కటి కావడంతో నక్షత్ర - సాయితేజ 2017 లో మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. క్రమంగా ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో.. భార్య నక్షత్రకు విడాకులు ఇవ్వకుండానే భర్త సాయి తేజ మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. తన భర్త తేజ ఆమె దగ్గరే ఉంటున్నాడని.. అందుకే తాను రెడ్ హ్యాండెడ్ గా అందరికి పట్టించినట్లు తెలిపారు. 

తన భర్త తేజా పబ్జీ గేమ్ ఆడుతూ కూడా అమ్మాయిలను ట్రాప్ చేసేవాడని నక్షత్ర ఆరోపించింది. తనతో సాయితేజ మాట్లాడిన ఆడియో, వీడియోలు ఉన్నాయని.. తనకు రోజుకో మహిళ కావాలంటూ తనపై ఒత్తిడి చేస్తున్నాడని వెల్లడించింది. దీంతో భర్త ఇంటి వద్ద నిరసనకు దిగింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget