Fog In Vizag: పొగమంచుతో ప్రమాదం- విశాఖలో ఐదు వాహనాలు ఢీ
Andhra News in Telugu: పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఢీ కొన్న ఘటన వైజాగ్‌లో జరిగింది. ప్రాణ నష్టం లేకపోయినా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
పొగమంచు ప్రాణాలు మీదకు తీసుకొస్తోంది. ఉదయాన్ని ప్రయాణించే వాళ్లంతా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది. ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.
మొన్నటికి మొన్న మంచు ప్రభావంతో తెలంగాణలో రెండు ప్రమాదాలు జరిగాయి. అందులో ఆరుగుగు మృత్యువాత పడ్డారు. ఇప్పుదు వైజాగ్‌లో కూడా అలాంటి ప్రమాదమే జరిగింది. విశాఖ కొమ్మాది కూడలి వద్ద వరుసగా ఐదు వాహనాలు ఢీ కొన్నాయి. ప్రాణ నష్టం మాత్రం జరగలేదు.
కొమ్మాది జంక్షన్ వద్ద ముందు ప్రైవేట్ బస్సు , ట్యాంకర్ ఢీ కొట్టింది. ముంచు కారణంగా ఆ ప్రమాదాన్ని పసిగట్టలేకపోయిన కార్లు కూడా దా వాహనాలను ఢీకున్నాయి. ఏకంగా మూడు కార్లు ఆ వెహికల్స్‌ను ఢీ కొట్టాయి.
ఐదు వాహనాలు ఢీ కొన్న ఘటనతో కొమ్మాదిలో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదానికి అటూ ఇటూ భారీగా వాహనాలు జామ్ అయ్యాయి. అసలే పొగమంచు ఇటు ట్రాఫిక్, చలి కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది.