![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
FireAccident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం, ఆ ప్రాంతాన్ని కమ్మేసిన దట్టమైన పొగ
Vizag Steel Plant FireAccident: విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
![FireAccident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం, ఆ ప్రాంతాన్ని కమ్మేసిన దట్టమైన పొగ fire broke out at Visakhapatnam Steel Plant FireAccident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం, ఆ ప్రాంతాన్ని కమ్మేసిన దట్టమైన పొగ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/a6847789c0788c4705fb2cfdc9e7a3f91708172851511233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
fire broke out at Visakhapatnam Steel Plant: విశాఖపట్నం: సాగర నగరం విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్టీల్ ప్లాంట్ లోని కోకోవెన్ విభాగంలో ఉన్న నాఫ్తలీన్ యూనిట్లో మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. కోకోవెన్ యూనిట్లో వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసి పడి అగ్నిప్రమాదానికి దారి తీసింది.
నిప్పురవ్వలు పడి మొదట నాఫ్తలీన్ దగ్దం కావడంతో... భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. కోకోవెన్ యూనిట్లో విద్యుత్ పరికరాలు, మెషినరీ, మెటీరియల్ పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం సంభవించిన కొంత సమయానికి అక్కడ పెద్ద మొత్తంలో పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. గతంలోనూ పలుమార్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)