Dharmana Prasad Rao: నాడు సిక్కోలులో ఆయనే సింగం, నేడు పరిస్థితి ఉల్టా!
శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన హవాకు ఎదురుండదు. కానీ, జగన్ ఆడిన రాజకీయ చదరంగంలో రాజకీయ చాణుక్యుడైన ఆయన వ్యూహం వృథాగా మారింది!!
పద్దతిగా, పార్టీకి పరపతి పెంచేలా రాజకీయాలను నెరపడమే ఆయనకు ఉన్న అసలు సిసలైన విద్య. అన్నింటికీ మించి దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన సన్నిహితుడు. ఇన్ని లక్షణాలున్న మాస్ లీడర్ మరి సిక్కోలుకు 'సింగం' కాకుండా ఎలాపోతారు? స్థానికులు ఆయనను సిక్కోల్'సింగం' అంటారు. కానీ, అదంతా కొన్నేళ్ళనాటి ముచ్చట. రాజకీయ చదరంగంలో ధర్మాన వ్యూహం వృథాగా మారింది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన హవాకు ఎదురుండదు. విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో ఆయనకు బోలెడుమంది అనుచరులు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన సిఫార్సు చేసిన అభ్యర్థులే గెలుస్తుంటారు. కాదని సొంతంగా టికెట్ తెచ్చుకుంటే ఇప్పుడు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాం మాదిరిగా కష్టాలు పడక తప్పదు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కేవలం ఒక ఎమ్మెల్యేగానే ప్రజల తరఫున నిలబడి పక్క రాష్ట్రాలు, జిల్లాలు నుంచి వచ్చి ఇక్కడ భూకబ్జాలు చేస్తామంటే - సహించేదే లేదన్న మాట తాజాగా ధర్మాన నోట వచ్చేది కాదు.
దివంగత నేత వైఎస్సార్ ఇలాకాలో కేబినేట్ మంత్రిగా కూడా చౌదరీలు, రెడ్డిలను ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు ధర్మాన అన్న సంగతి వేరేగా చెప్పనవసరంలేదు. జిల్లాని అభివృద్ధి చేసేందుకు వచ్చే వారిలో ఏ రాష్ట్రమైనా, జిల్లాయైనా ఆహ్వానించే సున్నితమైన మనస్తత్వం కలిగిన ధర్మాన కళింగ కోమట్ల చేరికల సమావేశంలో జిల్లాలో భూదందాలకు వచ్చే ఎవరినైనా అపగల శక్తి తనకే ఉందన్నారు. ఆ ప్రసంగాన్ని వక్రీకరించిన మీడియాతోపాటు విపక్షాలు, స్వపక్షాలు కూడా ధర్మాన మాటను మంత్రాంగం చేసి మట్టికరిపించేందుకు ప్లాన్ చేసినట్లు కనిపించాయి. ఆ క్రమంలో కళింగ కోమట్ల ఆస్తులను కబ్జాలు చేసేందుకు వచ్చిన వారు ఎంతటి బలశాలియైనా ధర్మాన ప్రసాదరావు అనే నాయకుడు అడ్డుకుంటాడని విడమరిచి చెప్పేందుకు ఏ కళింగ కోమటి నాయకుడు ఎందుకు నేటి వరకూ ముందుకు వచ్చి మీడియా కూతలు, రాతలను ఖండించలేకపోయాయో ధర్మాన వెంట తిరిగే కోవర్టులకే తెలుసు.
ఇటువంటి శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం తాజా రాజకీయాల్లో 2019 సార్వత్రిక ఎన్నికల కంటే కళింగ కోమట్ల వాపును 2024లో బలుపుగా చూపిస్తున్న వైనం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరు స్తోంది. అతితక్కువ ప్రభావితమైన కళింగ కోమట్ల ఓటు బ్యాంకుతో బాహు'బలి'గా మారిన కళింగ కోమట్లతో నెరిపే రాజకీయాలు ధర్మాన చతురతకే ముచ్చె మటలు పట్టించేలా మారడానికి ఆయన వెనుకనే ఉండే కోవర్టు కోమట్ల వ్యవహారశైలి ఎన్నికల నేపథ్యంలో అత్యుత్సాహంతో అటుకెక్కి కూర్చోనడం పరిపాటే. కానీ, మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో శ్రీకాకుళం వైసీపీ జయా పజయాలను తామే నిర్ధేశించగలమన్న ధీమాకు ధర్మాన ఎందుకు చెక్ చెప్పకుండా తన రాజదండనకు పనిచెప్పకుండా వ్యవహ రిస్తున్నారో అంతుచిక్కని ప్రశ్న.
గెలుపు ఓటములు ధర్మానను కుంగదీసే పరిణామాలు కావన్నవి జగమెరిగిన సత్యం. అంతటి దృఢమైన నాయకత్వాన్ని కళింగకోమట్లు పరోక్షంగా శాసించేందుకు ఎన్నికల వేళ రచించే వ్యూహాం బెడిసికొట్టకతప్పదన్న సంగతి బహిరంగ రహస్యమే. ఇదిలా ఉంటే, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో ధర్మాన ఎన్నికల ప్రచార రథ చక్రాలు కదిలితేఅక్కడ అభ్యర్థులను ఆయన సూచించినవారికిఅది నం బి. ఫారాలు ఇవ్వగలిగితే విజయం వైపు పయనం సాగేదన్న సంగతులు రాజకీయ విశ్లేషకులు చాలా బలంగా వివ రిస్తున్నారు. అయితే, జగన్రెడ్డి సర్వేలు-ఆయన ఏకస్వామ్య విధానంతో 2024 సార్వత్రిక ఎన్నికల అభ్యర్థుల చిట్టాలో చివరివరకు అపజయాలు చవిచూడాల్సిందే మరి. అంతటి అపజయాల అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తుకు బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీను వంటి పక్క జిల్లా నాయకులు భరోసా అంటూ జగన్రెడ్డి చెప్పే మాటల్లో చేతలు ఏ మేరకు ఉంటాయన్నది ఇప్పటికే అర్థమైపోయింది. నియోజకవర్గాల్లో వైసీపీలో రాజుకుంటున్న కుంపట్లు ఎగిసిపడే మంటల్లా మారినా ఇంకా సర్థుబాటు చేస్తామని, సాధ్యమైనంతవరకూ విభేధాలకు వకల్తాలు పుచ్చుకున్న బొత్స గత కొంతకాలంగా బోర్లపడి లేస్తున్నారు.
అలాగే, చిన్న శ్రీను పార్టీలోని లుకలుకలన్నీ సర్దుబాటు చేస్తానంటూ ఇటీవల పాత పట్నంలో చేపట్టిన సమావేశంలో అసమ్మతి సంగతి నేను చూసుకుంటానంటూ వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్| కోర్టినేటర్ మజ్జి శ్రీనివాస్ (చిన్న శ్రీను) చెప్పడం, అందుకు మద్దతుగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఇటువంటి చిన్నపాటి అసమ్మతి - కుమ్ములాటలు సీఎం జగన్ దృష్టికి వెళ్ళలేదని, వెళ్ళిన మరుక్షణం ఉపేక్షిం చరంటూ చేసే హెచ్చరికలను ద్వితీయశ్రేణినాయకులు ఏ మాత్రం పట్టించుకునే పాపానికి పోలేదు. భయ
పెడితే భయపడే రాజకీయాలు సిక్కోల్ కార్యకర్తల రక్తంలో ఉండదన్నది అంతకు ముందే చాలా నియోజకవర్గాల తగాదాల్లో రుజువైపోయింది. అందుకు తార్కాణమే పలాస అసెంబ్లీ స్థానంలోమంత్రి సీదిరి సిత్రాలకు అక్కడ కేడర్ ససేమిరా అంటూ ఎదురుతిరగడమే. బోర్లా పడి లేస్తున్న పక్కజిల్లా నేతలు బొత్స, చిన్న శ్రీను శ్రీకాకుళం రాజకీయాలపై సవారీ చేద్దామంటే వినే రకం ఇక్కడనేతలకు లేదన్నది ఇప్పుడిప్పుడే అధినాయకత్వానికి తెలుస్తోంది.మార్పు కావాలని కోరుకునే తరుణంలో జగన్రెడ్డి విజయసోపానం సక్సెస్ అయ్యిందే తప్ప ఆయన పార్టీ లోగో, అతనిరాజకీయ ఎత్తుగడలు కానేకాదంటూ రాజకీయ పరిశీలకులుతేల్చేశారు.
స్థానిక నాయకత్వానికే 20 శాతం ఓటు బ్యాంకుఉంటోందని అందులో ధర్మాన వంటి నాయకత్వ లక్షణాలు,ఆయన రాజకీయ ఎత్తుగడలు, అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించేలా అభ్యర్థుల ఎంపిక లాంటి నిర్ణయాలపై ధర్మాన మార్కు ఉంటే - సిక్కోల్లో వైసీపీ జయాపజయాలు లెక్కలే వేరుగా మారేది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కేవలం రెండు అసెంబ్లీ స్థానాలే విజయానికి అంచుల్లో ఉంటాయన్నదే తాజా సర్వేలు చెప్పే కథనాలు. పక్క జిల్లా నేతలైన బొత్స, చిన్నశ్రీను విజయనగరం జిల్లా రాజకీయాలనే సక్రమంగా ఏకతాటిపై నడపలేని శక్తిహీనులు ధర్మాన అడ్డాలో తమ రాజకీయ చాతుర్యాన్ని ప్రద ర్శిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో మరి కొద్దిరోజుల తర్వాత తేల నున్నది. అప్పుడు తెటతెల్ల మయ్యే వాస్తవాలు ధర్మాన నాయకత్వ లక్ష ణాల్లో వాపు కాదని, బలుపేనన్న నిజం రుజువయ్యే రోజలు దగ్గరలోనే ఉందని చెప్ప డంలో అతిశయోక్తి లేదు.