Battle of Bobbili: 1757 జనవరి 24న ఏం జరిగింది, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన బొబ్బిలి యుద్ధం
చరిత్రలో ఎన్ని యుద్ధాలు జరిగినా, ఏపీకి సంబంధించి ముఖ్యమైన పోరులలో బొబ్బిలి యుద్ధం ఒకటి. బొబ్బిలి సంస్థానం, విజయనగరం సంస్థానంతో కలిసి ఫ్రెంచ్ సైన్యంతో తలపడ్డ యుద్ధం ఒక్కరోజులోనే ముగిసింది.

Bobbili War Memorial | విజయనగరం జిల్లాలోని బొబ్బిలికోట జిల్లా కేంద్రానికి 60.కి.మీ దూరంలో ఉంది. ఈ కోట 17వ శతాబ్దంలో మట్టితో నిర్మించబడింది. పెద్దా రాయుడు (రాయుడప్ప రంగారావు బొబ్బిలి కోట వ్యవస్థాపకుడు. ఇతను వెలుగోటి వంశీయులకు చెందిన వెంకటగిరి రాజుల 15వ వారసుడు. శ్రీకాకుళం(సిక్కోలు) నవాబు షేర్ మహ్మద్ ఖాన్ కు., వెంకటగిరి మహారాజవారు దక్షిణాదిలో చేసిన సేవలకు ప్రతిఫలంగా బొబ్బిలిని ఇచ్చారు. ఈ రకంగా మహ్మద్ ఖాన్ వెంకటగిరి రాజులు బృందంలో భాగంగా ఇతను బొబ్బిలి ప్రాంతానికి వచ్చాడు. షేర్ ముహమ్మద్ ఖాన్ 1652 లో రాజాం ఎస్టేటును వెలుగోటి వంశీయులకు చెందిన రాయప్ప(పెద్దారాయుడు)కు బహూకరించాడు. ఇతను పట్టణాన్ని స్థాపించి ఒక కోటను నిర్మించాడు. పట్టణానికి గౌరవార్థం అతని పేరు మీద పెద్దపులి (బెబ్బులి) అని నామకరణం చేశారు తరువాత అది కాల క్రమంలో బొబ్బిలిగా రూపాంతరం చెందింది. ఈ రాజవంశీయులకు చెందిన ఆర్‌ఎస్‌ఆర్‌కె రంగారావు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనిచేశారు.
పొరాడిన రాజాం సంస్థానాధీశుడు తాండ్ర పాపారాయుడు.
బొబ్బిలి పట్టణం పేరు వినగానే 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం గుర్తుకు వస్తుంది. చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినా బొబ్బిలి యుద్ధానికున్న ప్రత్యేకత వేరు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణాన్ని పౌరుషానికి ప్రతీకగా అభివర్ణిస్తారు. పరాయి పాలనకు వ్యతిరేకంగా జరిగిన యుద్దంలో తాండ్ర పాపారాయుడు ప్రతాపానికి., వీరత్వం సాక్ష్యంగా నిలించింది. అందుకే ఈ యుద్దం వీరగాధ గురించి పాటగా, బుర్రకథగా, నాటకంగా, చలనచిత్రంగా ప్రజలలో ప్రాచూర్యం పొందింది. అప్పటి యుద్దానికి చిహ్నంగా విజయనగరం జిల్లాలోని భైరవసాగరం వద్ద స్మారక స్థూపం చిహ్నంగా నిర్మించబడింది.
కోటకు ఆకర్షణగా దర్బార్ మహల్
బొబ్బిలి కోట ప్రత్వేకతల విషయానికొస్తే., ఆ రోజుల్లో దర్బార్లు నిర్వహించడం కోసం ప్రత్యేక మందిరాన్ని నిర్మించారు. ఈ దర్బార్ మహల్, కోటకు ఆకర్షణగా నేటికీ నిలుస్తోంది. బొబ్బిలి రాజులకు చెందిన అతిథిగృహం గొప్ప ప్రాచుర్యం ఉంది. ఇప్పటికీ సందర్శకులు గెస్ట్ హౌస్‌ను చూసేందుకు వెళుతుంటారు. ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతూ ఉంటాయి. అప్పట్లో రాజులు వినియోగించిన సింహాసనాలు, పల్లకీలు రాచరిక భోగభాగ్యాలకు నిలువుటద్దంలా కనిపిస్తే, పురాతన నిర్మాణాలు, వస్తు సామగ్రి, వాహనాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రాణి చెల్లాయమ్మదేవి 18వ శతాబ్ధంలో నిర్మించిన మూడో కోట ఎంతో విశాలంగా, చారిత్రకు సాక్ష్యంగా కనిపిస్తుంది.
దక్షిణ దేవుడు, పడమర దేవుడు, ఉత్తర దేవుడు అనే మూడు ముఖద్వారాలు ఈ కట్టడంలో ఉన్నాయి. రాజు వంశీయులు మాత్రమే ఉత్తర దేవుడు ద్వారా ప్రవేశం చేయడానికి అవకాశం కల్పించబడింది. మిగిలిన రెండు ద్వారాలు సందర్శకులు నిత్యం వచ్చివెళ్లేందుకు మాత్రం వీలు కలిగించబడింది. శత్రు దుర్భేద్యంగా కోట చుట్టూ నిర్మించిన ఎత్తయిన ప్రహరీ సందర్శకులును ఆకట్టుకుంటుంది. సుమారు 40 అడుగుల ఎత్తుగల సింహద్వారాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. కోటలోపల అనేక భవనాలు, లోగిళ్లు, మండపాలు కలిగి ఓ గ్రామంలా సందర్శకులకు కనువిందు చేస్తుంది.
బొబ్బిలి కోటలో నిర్మించిన ఏడు పురాతన భవనాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటిని సప్తమహాల్స్‌గా పిలుస్తారు. వందల సంవత్సరాలు గడిచినా ఈ భవనాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందులో ఒక దర్భార్‌మహాల్ యూరోపియన్ కట్టడాన్ని తలపిస్తుంది. పూజమహాల్‌లో రాజవంశీయులు, ప్రస్తుతం మాజీ మంత్రి సుజయ కృష్ణరంగారావు కుటుంబం నివాసం ఉంది. కృష్టవిలాస్‌లో ఎమ్మెల్యే సోదరుడు బేబినాయన నివాసముంటున్నారు. మిగిలిన నాలుగింటిలో ప్రాంగ్‌మహాల్, సీతారామ మందిరం, రాణీ మహల్, లక్ష్మీవిలాస్ ఉన్నాయి. కోట నిర్మాణంలో బర్మాటేకు, రోజ్‌వుడ్ ఎక్కువగా వినియోగించారు. కోట పడమట దిక్కున గోడకు సమీపంలో పార్కింగ్ స్థలంలో రాజులు ఉపయోగించిన పురాతన వాహనాలు ఇప్పటికీ కనిపిస్తాయి.
ప్రస్తుతం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు
రాజ్యాలు పోయాయి. సోదరుడైన సృజన రంగ గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా కొనసాగారు ఆ తర్వాత. ఆర్ తమ్ముడైన బేబీ నాయనా ప్రస్తుతం బొబ్బిలి టిడిపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చరిత్ర మొత్తం ఇప్పటికీ చదల పట్టకుండా ఉండేందుకు ఆ స్థూపాన్ని నిర్మాణం చేసి వాటి ఆనవాళ్లను ఇంకా అలానే ఉంచి ప్రతి సంవత్సరం జనవరి 26న ఆ స్థూపాను వద్దకు వెళ్లి నివాళులర్పిస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

