(Source: ECI/ABP News/ABP Majha)
Tammineni Sitaram: తొడగొట్టిన ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ఎందుకో తెలుసా?
Tammineni Sitaram: వచ్చే ఎన్నికల్లో కూడా సీఎం జగన్ కే ఓటు వేస్తామంటూ ఓ మహిళ తొడ కొట్టిందని గుర్తు చేస్తూ.. స్పీకర్ తమ్మినేని సీతారం కూడా తొడకొట్టారు. వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామన్నారు.
Tammineni Sitaram: ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చకపోవడం వల్ల గత ఎన్నకల్లో ఆయనను ప్రజలంతా ఓడించారని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. యువతకు ఉద్యోగాలు, రైతు రుణాలు మాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని.. ఇలా సవాలక్ష మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు కే.గోవింద రావు అధ్యక్షతన శనివారం కన్వీనర్లు, వాలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటన మాట్లాడారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లగా.. ఓ మహిళ మళ్లీ జగన్ కే ఓటేస్తామని తొడ కొట్టి చెప్పిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఆమెలాగే స్పీకర్ తమ్మినేని కూడా తొడ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.
వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించబోతున్నాం..
నారావారి పల్లెలో రెండకరాల భూమి ఉన్న చంద్రబాబు ఇప్పుడు కోటీశ్వరుడు ఎలా అయ్యారని, ఆయన దగ్గర ఏమైనా మంత్ర దండం ఉందని అని ప్రశ్నించారు. అలాంటిదేమైనా ఉంటే నిరుపేద్ ప్రజలకు అందజేయమని సూచించారు. టీడీపీ వస్తే వాలంటీర్ వ్యవస్థను పీకేస్తామని చెబుతున్నారని, అందుకే త్వరలోనే వైసీపీ ప్రభుత్వం.. వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగుల కింద ప్రకటించబోతుందని తెలిపారు.
చంద్రబాబు పర్యటనలు అసమర్థుడి అంతిమయాత్ర..
చంద్రబాబు పర్యటనలు అసమర్థుడి అంతిమయాత్ర లాంటివని స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. జనంతో జగన్ బంధం ఎప్పుడో ముడిపడిందని స్పష్టం చేశారు. సంక్షేమం-అభివృద్ధే సీఎం జగన్ పాలనా నేత్రాలు అన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలే చంద్రబాబును ఇంటికి పంపిస్తారన్నారు. తోకలు కత్తిరిస్తానన్నందుకు బాబు పిలకనే బీసీలు కట్ చేశారని ఆరోపించారు.
అసమర్థుడి అంతిమయాత్ర
"జనం-జగన్' బంధం ఎప్పుడో ముడిపడిపోయింది. అది 2024 ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తుంది. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ సారి మహిళలే చంద్రబాబును తిరస్కరించి ఇంటికి పంపడం ఖాయం. చంద్రబాబు రాజకీయ అంపశయ్యపై ఉన్నారు. జనం వెంటిలేటర్ తీసేస్తే ఇక ఆయన పని అయిపోయినట్లే. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం. బాబు చేసే యాత్రలు అసమర్థుడి అంతిమయాత్ర లాంటివి. మూడు రోజులుగా కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు పర్యటనలో మాట్లాడే మాటలు వింటుంటే రాబోయే ఎన్నికల్లో గెలుపుపై ఆయనకు నమ్మకం కోల్పోయినట్లు కనిపిస్తోంది. అధికారమనే మానసిక వ్యాధితో బాబు బాధపడుతున్నారు. "నా కుర్చీ...నా కుర్చీ"అంటూ కలవరిస్తూ అలాగే కుప్పకూలిపోతారు."- స్పీకర్ తమ్మినేని
బాబు పిలకనే కత్తిరించారు
చంద్రబాబుకు దమ్ముంటే గత ఎన్నికల్లో 612 వాగ్దానాలతో విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను బయటకు తీసి మాట్లాడాలని స్పీకర్ తమ్మినేని సవాల్ చేశారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని అడుగుతుంటే వెబ్‌సైట్ నుంచే మేనిఫెస్టోను తీసేశారని విమర్శించారు. ఎన్టీఆర్ ఆత్మ బాబును వదలదన్నారు. ఎన్నికల సమయంలోనే బాబుకు ఎన్టీఆర్ గురుకొస్తారు, ఆయన విగ్రహాలను, ఫ్లెక్సీలను ఆవిష్కరిస్తారని ఆరోపించారు. ప్రజల ముందు మాట్లాడేటప్పుడు దిగజారిపోయి మాట్లాడరాదని సూచించారు. ఎన్నికలు సమీపించే కొద్దీ బాబు ఇంకా దిగజారిపోతారని స్పీకర్ తమ్మినేని మండిపడ్డారు. నాయీబ్రాహ్మణులు బాబును కలిస్తే మీ తోకలు కత్తిరిస్తానని వారితో దురుసుగా మాట్లాడినందుకు బీసీలు, బాబు పిలకనే కత్తిరించి ఇంట్లో కూర్చోపెట్టారని స్పీకర్ అన్నారు. మత్స్యకారులతోనూ ఇలాగే వ్యవహరించి, తన నైజాన్ని ప్రదర్శించారన్నారు.