అన్వేషించండి

Botsa Satynarayana: జగన్ విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం, త్వరలోనే డేట్ ఫిక్స్: బొత్స సత్యనారాయణ

Andhra Pradesh News: ఏపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బలంగా వీచిందన్నారు.

Botsa Satynarayana Press Meet | వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, త్వరలోనే డేట్ ఫిక్స్ చేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు తెలిసింది మోసం, దగా, కుట్రలు అని, మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ చెప్పింది చేస్తారని పేర్కొన్నారు. టీడీపీ కూటమి ఎన్ని హామీలు ఇచ్చినా ఏపీ ప్రజలు వారిని నమ్మలేదని, అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేశారని చెప్పారు. మే 13న జరిగిన ఏపీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీచిందన్నారు.

ప్రజలు జగన్ ను మరోసారి ఆశీర్వదించారు 
ఏపీ ఎన్నికలపై మంత్రి బొత్స మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో సీఎం జగన్ ను మరోసారి ఆశీర్వదించిన ప్రజలకు ధన్యవాదాలు. టీడీపీ కార్యకర్తలు ఓటమి తెలిసి, సహనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నారు. ఓడిపోతున్నారనే టీడీపీ నేతలు పల్నాడులో దాడులకు పాల్పడ్డారు.. మేం కనుక ఒక్క పిలుపు ఇచ్చి ఉంటే అంతా క్లోజ్.  సచివాలయ వ్యవస్థను అవినీతి రూపు మాపడానికి పెట్టాం. కార్యకర్తలు ఎప్పుడూ నేతల పక్కనే ఉంటారు. మహాత్మా గాంధీ కలలు కన్న వ్యవస్థే సచివాలయ వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థ కరోనా సమయంలో ఎన్నో సేవలు అందించింది. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం సేవలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందించారు వాలంటీర్లు.

ఎన్నికల సమయంలో టీడీపీ సహనం కోల్పోయినా, మనం సంయనంగా వ్యవహరించాలని వైసీపీ కార్యకర్తలకు సూచించాం. జగన్ ను అధికారంలోకి తీసుకురావాలి. మహిళలు, యువత, పేద వర్గాలకు మరో ఐదేళ్లు సంక్షేమాన్ని కొనసాగిస్తాం. కవ్వింపులు జరిగినా మా కార్యకర్తలు సహనంగా ఉన్నందుకు ఏపీలో భారీగా పోలింగ్ నమోదైంది. తులసివనంలో గంజాయి మొక్కలా కొందరు జర్నలిస్టులు ఉంటారు. ప్రజాధరణ ఎక్కువగా ఉన్న కారణంగానే నన్ను టీడీపీ కూటమి నేతలు నన్ను టార్గెట్ చేశారు. అది మా బలంగా భావిస్తాం. కానీ అది టీడీపీ శ్రేణుల బలహీనత. 

ఎవరిది కుటుంబ పాలన, మీరే ఆలోచించుకోండి 
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ నామినేటెడ్ పదవి తీసుకున్నాడు. కానీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గలేదు. చంద్రబాబు వదిన పురంధేశ్వరి మరో పార్టీలో అధ్యక్షురాలిగా ఉన్నారు. నందమూరి బాలకృష్ణ, ఆయన అల్లుళ్లు లోకేష్, భరత్ లు రాజకీయాల్లో ఉన్నారు. కుటుంబ పాలన ఎవరిదో ఇప్పుడు చెప్పండి. ఈవీఎంలు ఎక్కడ భద్రపరచాలి అనేది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. కానీ వ్యవస్థ మీద అవగాహన లేక ఈవీఎంలపై కామెంట్లు చేస్తున్నారని’ మండిపడ్డారు.

ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్స్ పెట్టవద్దని మంత్రి బొత్స సూచించారు. తాము గెలిచేస్తున్నామని టీడీపీ నేతలు ప్రచారం చేస్తే, అది నిజమని బెట్టింగ్ కాస్తే లక్షలు పోగొట్టుకుని, జీవితాలు కోల్పోతారని హెచ్చరించారు. జూన్ 4 వరకు ఆగితే ఫలితాలు ఎవరివైపు తేలుతుందని, వైసీపీ మరోసారి భారీగా సీట్లు సాధించి ఏపీలో అధికారంలోకి వస్తుందన్నారు. కేంద్రంలో ఎవరు వచ్చినా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధమని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలు తప్పా, రాజకీయ ప్రయోజనాలు తమకు ముఖ్యం కాదన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget