AP Minister Sandhya Rani son and PA: ఏపీ మంత్రి సంధ్యారాణి కుమారుడు, పీఏపై లైంగిక ఆరోపణలు! వేధిస్తున్నారని స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు! ప్రభుత్వం సీరియస్!
ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు, పీఏపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. కోర్కె తీర్చాలని వేధిస్తున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది.

AP Minister Sandhya Rani son and PA: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమస్యల్లో పడ్డారు. ఆమె కుమారుడు పృథ్వీ, పీఏ సతీష్‌పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. తనను లైంగికంగా వేధిస్తున్నారని, గంట వచ్చి వెళ్లమన చెబుతున్నారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఇది ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. దీన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. వెంటనే పీఏను విధుల నుంచి తప్పించింది. సమగ్ర విచారణ చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
మంత్రి కుమారుడు పృథ్వీ కూడా తనకు మెసేజ్ చేశాడని మహిళ ఆరోపిస్తోంది. తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లాలని చెప్పాడని చెప్పుకొచ్చింది. తన భర్త 2021లో కరోనాతో చనిపోయాడని, తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఐదు లక్షలు ముందుగా సతీష్ అనే వ్యక్తి తీసుకున్నారని చెప్పింది. క్యాష్ రూపంలో ఇంకా ఎక్కువగానే తీసుకున్నారని అన్నారు. అయితే తన జాబ్ గురించి తర్వాత ఉన్నతాధికారులను అడిగితే ఎలాంటి డబ్బులు తాము తీసుకోలేదని తేలిందన్నారు. ఇదంతా సతీష్ తీసుకున్నట్టు ఆమె ఆరోపిస్తున్నారు.
ఈ విషయంలో సతీష్‌ను నిలదీసినట్టు చెప్పుకొచ్చారామె. విషయం తెలుసున్న మంత్రి కుమారుడు పృథ్వి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా వెల్లడించారు. ఇంతలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. పలు మార్లు ఫోన్‌లు చేసి ఒక గంటకు వచ్చి వెళ్లాలని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా మహిళా వివరించారు. ఆమె కూడా తనను పది మంది ముందు తిట్టారని, తర్వాత వేరే ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేశారని అన్నారు.
తనకు జరుగుతున్న అన్యాయం గురించి స్థానికంగా ఉండే పోలీసులు పట్టించుకోవడం లేదని మహిళ ఆరోపించారు. అందుకే జిల్లా ఎస్పీకి వచ్చి సమస్య చెప్పుకున్నట్టు వెల్లడించారు. స్థానిక పోలీసులు కనీసం ఫిర్యాదు తీసుకోవడానికి
కూడా ధైర్యం చెయడం లేదని అన్నారు. మహిళా సంఘాలతో కలిసి వచ్చిన బాధిత మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
విషయం తెలుసుకున్న ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే మంత్రి సంధ్యారణి పీఏ సతీష్‌ను విధుల నుంచి తీసేస్తున్నట్టు ప్రకటించింది. ఆదేశాలు జారీ చేసింది. అతనిపై కేసు నమోదు చేయాలని కూడా పేర్కొంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి వాస్తవాలు వెల్లడించాలని ఆదేశించింది. ఆరోపణ చేస్తున్న మహిళను కూడా విచారించాలని పేర్కొంది.





















