By: ABP Desam | Updated at : 11 Feb 2023 02:58 PM (IST)
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
Vizag Steel Plant News: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో శనివారం పేలుడు ప్రమాదం జరిగింది. ఎస్‌ఎంఎస్-2 లిక్విడ్ విభాగంలో పేలుడు జరగడంతో 9మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురు రెగ్యులర్ కార్మికులు కాగా, ఐదుగురు ఒప్పంద కార్మికులున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడినవారందరినీ స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. తీవ్రగాయాలైనవారిని నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
స్టీల్ ప్లాంట్‌లో తరచూ ప్రమాదాలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవలి కాలంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుటున్నాయి. ద్రవ ఉక్కును నిల్వ చేసే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. సరైన సేఫ్టీ పద్దతులు పాటించకపోవడం వల్లనే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి. ఎన్ని జాగ్రత్లు తీసుకున్నా.. ప్రమాదాలు జరుగుతున్నాయని స్టీల్ ప్లాంట్ యజమాన్యం చెబుతోంది. సాధారణం ఉక్కు పరిశ్రమలో అదీ కూడా అది భారీ ఉత్పత్తి చేసే ఉక్కు పరిశ్రమలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే అత్యంత ఉన్నమైన భద్రతా ప్రమాణఆలు పాటిస్తారు. కానీ విశాఖ ఉక్కు పరిశ్రమలో ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి. నివారించేందుకు యాజమాన్యం అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రమాదం జరిగినప్పుడల్లా గాయపడుతున్నారు.
శుక్రవారమే అంబటి సుబ్బన్న కంపెనీలో ఘోర ప్రమాదం - ఏడుగురు మృతి
శుక్రవారమే తూ.గో జిల్లా పెద్దాపురం మండలం జి.రాఘంపేట అంబటి ఆయిల్స్ పరిశ్రమలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిశ్రమలోని ఆయిల్ ట్యాంకర్‌ను కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చూస్తుంటారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ట్యాంకులో ఆయిల్ మొత్తం తీసివేశారు. దీంతో ఏడుగురు కార్మికులు అందులో దిగి ట్యాంకర్‌ను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ఘాటైన వాయువులు వెలువడటంతో కార్మికులు ఊపిరి అందలేదు. వెంటనే బయటకు వచ్చేందుకు కార్మికులు ప్రయత్నించినప్పటికీ ఫలించకపోవడంతో ఊపిరాడక ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. అయితే సమయం గడుస్తున్నప్పటికీ శుభ్రం చేసేందుకు వెళ్లిన కార్మికులు బయటకు రావడంతో మిగిలిన కార్మికులు వెళ్లి చూడగా అందరూ విగతజీవులుగా కనిపించారు. దీంతో ట్యాంకర్‌ను అప్పటికప్పుడు యంత్రాలతో కూల్చి అందరినీ బయటకు తీసుకువచ్చారు.
ఏపీలో పెరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలు
ఇటీవలి కాలంలో పారిశ్రామిక ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఏపీలో ఇలాంటి ప్రమాదాల సంఖ్య పెరగడం.. ప్రజల్లో కూడా ఆందోలన కలిగిస్సోతంది. అధికారులు సరైన రీతిలో తనిఖీలు చేపట్టకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని.. కార్మికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పర్యావేక్షణా లోపం లేదని.. యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయా కంపెనీల ప్రతినిధులు ఎప్పటికప్పుడు చెబుతున్నారు.
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!
AP New Industrial Policy: పీపీపీ విధానంలో ఇండస్ట్రియల్ పార్కులు- కొత్త ఇండస్ట్రీయల్ పాలసీ ప్రకటించిన ఏపీ
G20 Summit: నేటి నుంచి విశాఖలో జీ20 సదస్సు - హాజరుకానున్న 57 మంది విదేశీ ప్రతినిధులు
APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!
Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!
పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ - అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన
Pan-Aadhaar: పాన్-ఆధార్ లింక్ గడువును పొడిగించే ఛాన్స్, మరో 3 నెలలు అవకాశం