By: ABP Desam | Updated at : 06 May 2022 07:15 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి ఆర్కే రోజా , సెల్వమణి
Minister RK Roja : 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబును బాదడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. చంద్రబాబు చేస్తుంది పోరాటం కాదని, అధికారంపై ఆరాటం అన్నారు. పోటీ అయినా పోరాటం అయినా సింగిల్ గా సింహంలా జగన్ రెడ్డి వస్తారన్నారు. చంద్రబాబుకు ఆ దమ్ముందా? అని ప్రశ్నించారు. టీడీపీ అనుకూల విద్యాలయాల నుంచి 10వ తరగతి పరీక్షా పేపర్లు లీక్ చేయించి గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవన్న ప్రచారం చేస్తోంది టీడీపీ నేతలే అని రోజా సంచలన ఆరోపణలు చేశారు. అయ్యన్న పాత్రుడు తల్లి, భార్య, అక్క చెల్లెళ్లు లేరా? అని ప్రశ్నించిన రోజా, అయ్యన్న మహిళా నేతల పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ ఇంటిలోని ఆడవాళ్లను ఎవరైనా అంటే మీరు ఊరుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెల్వమణి ఉద్దేశం అదికాదు
సెల్వమణి చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. సెల్వమణి సౌత్ ఇండియా టెక్నీషియన్స్ కు అధ్యక్షుడని, ఏ రాష్ట్రానికి సంబంధించిన కార్మికులు ఆ రాష్ట్రంలోనే పని చేసేలా ఉంటే అందరికీ ఉపాధి లభిస్తుందని సెల్వమణి ఉద్దేశం అన్నారు. విశాఖలో షూటింగ్స్ చేయమని ప్రభుత్వం అడిగినా నిర్మాతలు ఎందుకు చేయడం లేదన్నారు.
సెల్వమణి వివాదాస్పద వ్యాఖ్యలు
ఆర్కే సెల్వమణి ప్రస్తుతం ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకి అధ్యక్షుడిగా, తమిళనాడు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఓ సినీ పరిశ్రమకు సంబంధించిన ఓ కార్యక్రమంలో రెండ్రోజుల క్రితం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, వైజాగ్ లలో సినిమా షూటింగులు ఆపేయాలని తమిళ సినీ పరిశ్రమను కోరారు. పక్క రాష్ట్రాల్లో షూటింగులు జరపడం వల్ల తమిళ ఇండస్ట్రీకి చెందిన వేలాది మంది సినీ కార్మికులు చాలా నష్టపోతున్నారని చెప్పారు.
Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!
Breaking News Live Updates: బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్
Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
Mla Kotamreddy Sridhar Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఛాతిలో నొప్పి, చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు!
Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ - టీడీపీ నిర్ణయం !
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్