News
News
X

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో పోరాటం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమా?, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దసపల్లా భూములపై పోరాటం చేసిన వైసీపీ అధికారంలోకి రాగానే 22ఏ ఎత్తివేయడం సరికాదని సోము వీర్రాజు అన్నారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ లేఖ రాశారు.

FOLLOW US: 
 
Somu Veerraju On Daspalla Lands : విశాఖ దసపల్లా భూముల వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్ కు లేఖ రాశారు. కబ్జాకు గురవుతున్న దసపల్లా భూములను కాపాడి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. విశాఖ నగర నడిబొడ్డున ప్రభుత్వ అతిథిగృహాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద దసపల్లా భూములను కొందరు బిల్డర్లకు అప్పగించటానికి రంగం సిద్ధమైందని, దీని వెనుక అధికార పార్టీ నాయకులకు, వారి బంధువర్గాలకు ప్రయోజనం చేకూరేలా కోట్లాది రూపాయల  కుంభకోణం దాగి ఉందని వార్తలు వస్తున్నాయని సోము వీర్రాజు అన్నారు. 2016లో సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయరాదని, వందల కోట్ల విలువైన భూములను రక్షించడానికి ప్రభుత్వం మరోసారి న్యాయపోరాటం చేయాలని సోము వీర్రాజు కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత మంత్రి  గుడివాడ అమర్నాథ్ .. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ భూములను ప్రభుత్వపరం చేయటానికి తగిన చర్యలన్నీ తీసుకుంటుందని పదే పదే చెప్పారని గుర్తుచేశారు.

వైసీపీ కూడా అదే భూదందా! 

సీఎం జగన్ తన పాదయాత్రలో ఆ భూముల విషయాన్ని ప్రస్తావించి, వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టటానికి చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు చేశారని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా నాడు వైసీపీ నేతలు చేసిన డిమాండ్లను విస్మరించి, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ అధికారులే నిషేధిత జాబితా (22 A) నుంచి ఆ భూములను తొలగించి వాటిని వైసీపీ అనుకూల బిల్డర్లకు అప్పగించటానికి ప్రయత్నిస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గత టీడీపీ ప్రభుత్వం ఆ భూములను తమ వారికి కట్టబెట్టడం కోసం చేసిన యత్నాలు బెడిసి కొట్టాయన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో భారీ భూదందా కు తెరలేపినట్లు స్పష్టం అవుతోందన్నారు. 

సుప్రీంకోర్టులో పిటిషన్ 

News Reels

"ఇంత జరుగుతున్నా కూడా వాటిని జిల్లా అధికార యంత్రాంగం కనీసం అధికారికంగా ఖండించకపోవడంతో భూ కుంభకోణం వాస్తవమేనని  ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. విశాఖలోని దసపల్లా హిల్స్ భూముల పరిరక్షణకు వెంటనే ఉన్నతస్థాయి అధికారుల సమావేశం ఏర్పాటుచేసి భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. సీఎం జగన్ స్వయంగా ఉన్నతాధికారులతో  చర్చించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పునః సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి అధికారులతో  సిట్  ఏర్పాటు చేసి అవసరమయ్యే న్యాయ ప్రక్రియ చేపట్టాలి.  గతంలో టీటీడీ భూములు అన్యాక్రాంతం చేయడానికి కొందరు తిరుమల కొండపై ఉన్న భూములు మావే అంటూ, టీటీడీ భూములు ప్రైవేటు భూములుగా చూపే ప్రయత్నాన్ని టీటీడీ అధికారులు అడ్డుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా దసపల్లా హిల్స్ భూముల పరిరక్షణకు  సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలి. నిజాయితీగా పోరాటం చేసి భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను." సోము వీర్రాజు 

బీజేపీ ప్రజా ఉద్యమం 

రూ.1500 కోట్ల పైబడి విలువైన  దసపల్లా హిల్స్ భూముల పరిరక్షణకు ముందుగా స్టే తీసుకు వస్తే తర్వాత కొంత కసరత్తు చేసి భూములను రక్షించుకునే అవకాశం ఉంటుందని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాకానిపక్షంలో ఈ కుంభకోణంలో  అధికార పార్టీ నేతలే, జిల్లా యంత్రాంగంతో కుమ్మక్కై పావులు కదుపతున్నారని భావించవలసి వస్తుందన్నారు. అదే జరిగితే ఆ భూముల పరిరక్షణకు బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. తదుపరి పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.  

Published at : 04 Oct 2022 07:47 PM (IST) Tags: BJP CM Jagan Somu veerraju Visakhapatnam news Daspalla lands

సంబంధిత కథనాలు

Nadendla Manohar : పవన్ ప్రచార రథం రంగుపై వైసీపీ విమర్శలు, నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్

Nadendla Manohar : పవన్ ప్రచార రథం రంగుపై వైసీపీ విమర్శలు, నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్

Chandrababu : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికే, నాలుగేళ్ల తర్వాత జగన్ కు బీసీలు గుర్తొచ్చారా? - చంద్రబాబు

Chandrababu : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికే, నాలుగేళ్ల తర్వాత జగన్ కు బీసీలు గుర్తొచ్చారా? - చంద్రబాబు

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Jabardasth Teja - Pavithra: ‘జబర్దస్త్’ తేజాకు, పవిత్రకు పెళ్లి? వైరల్ అవుతోన్న వీడియో

Jabardasth Teja - Pavithra: ‘జబర్దస్త్’ తేజాకు, పవిత్రకు పెళ్లి? వైరల్ అవుతోన్న వీడియో