News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Pudimadaka Fishing Harbour : మత్స్యకారులకు గుడ్ న్యూస్, రూ.393 కోట్లతో పూడిమడక ఫిషింగ్ హార్బర్!

Pudimadaka Fishing Harbour : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో రద్దీ పెరిగిపోతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సిద్ధమైంది. అనకాపల్లి జిల్లాలోని పూడిమడక వద్ద హార్బర్ నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది.

FOLLOW US: 
Share:

Pudimadaka Fishing Harbour : విశాఖ సముద్ర తీరంలో మరో ఫిషింగ్ హార్బర్ సిద్ధం అవుతుంది. ఒడిశాలోని పారాదీప్, విశాఖ మినహా మధ్యలో మరో ఫిషింగ్ హార్బర్ లేదు. పెరుగుతున్న మత్స్యకార అవసరాలకు ఇవి సరిపోవడం లేదు. దీంతో విశాఖ సమీపంలోని అనకాపల్లి జిల్లాలో మరో ఫిషింగ్ హార్బర్ నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం రూ.393 కోట్లతో పూడిమడక వద్ద మరో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. టెండర్లు తుది దశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు . హార్బర్ కోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్ 30 ఎకరాల భూమిని కేటాయించారు.

విశాఖ ఫిషింగ్  హార్బర్ పై పెరుగుతున్న భారం

కొత్త హార్బర్ నిర్మాణం పూర్తి అయితే ప్రస్తుతం విశాఖలో ఉన్న ఫిషింగ్ హార్బర్ పై ఒత్తిడి తగ్గుతుంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ పరిధిలో 720 మెకనైజ్డ్ బోట్లు, 3 వేల  ఇంజిన్ బోట్లు  ఉన్నాయి. వీటి సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతూ వస్తుంది. పూడిమడక ఫిషింగ్ హార్బర్ పూర్తయితే  విశాఖ ఫిషింగ్ హార్బర్ పై పడుతున్న భారం తగ్గుతుంది అంటున్నారు అధికారులు. పైగా పూడిమడక, పాయకరావు పేట, యస్.రాయవరం, రాంబిల్లి, పరవాడ ప్రాంతాల మత్స్యకారులకు ఎంతో  ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.

అంచనా వ్యయం రూ.393 కోట్లు

పూడిమడక ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి  రూ.393 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపింది. ఈ హార్బర్ సామర్థ్యం ఏడాదికి 28 వేల టన్నులుగా లెక్కలు వేస్తున్నారు. హార్బర్ పూర్తయితే 930 బోట్లను ఇక్కడ ఒకేసారి నిలపవచ్చు అంటున్నారు అధికారులు. వీటిలో 9 మీటర్ల మోటరైజ్డ్ బోట్లు 700, 18 మీటర్ల మెకనైజ్డ్ బోట్లు  200,  24 మీటర్ల లాంగ్ లైనర్లు 30 అని చెబుతున్నారు. ఈ హార్బర్ పూర్తయితే దాదాపు 5 వేలకు పైగా మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. మూడేళ్ల లోపు ఈ ఫిషింగ్ హార్బర్ అందుబాటులోనికి రానుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.  అలాగే తుపాను లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఒకేసారి అన్ని బోట్లనూ నిలిపి ఉంచడానికి వైజాగ్ ఫిషింగ్ హార్బర్ సరిపోవడం లేదు. కొత్త హార్బర్ పూర్తయితే ఆ కష్టాలు తొలగిపోతాయని అధికారులు అంటున్నారు. పూడిమడక ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల దశాబ్దాల నాటి కల అని చెబుతున్నారు. నూతన హార్బర్ అందుబాటులోకి వస్తే మరింత మంది మత్స్యకారులకు ఉపాధి దొరుకుతోందని అంటున్నారు. 

Published at : 22 Jul 2022 02:13 PM (IST) Tags: ap govt AP News Visakhapatnam News tenders fishing harbour pudimadaka harbour pudimadaka harbor fishing harbor

ఇవి కూడా చూడండి

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంక్‌లకు 18 రోజులు సెలవులు, 6 రోజులు సమ్మె - ఇక మీ బ్యాంక్‌ పని అయినట్టే!

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంక్‌లకు 18 రోజులు సెలవులు, 6 రోజులు సమ్మె - ఇక మీ బ్యాంక్‌ పని అయినట్టే!

Deadlines in December: డెడ్‌లైన్స్‌ ఇన్‌ డిసెంబర్‌, వీటిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకే నష్టం!

Deadlines in December: డెడ్‌లైన్స్‌ ఇన్‌ డిసెంబర్‌, వీటిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకే నష్టం!

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

Latest Gold-Silver Prices Today 29 November 2023: రూ.63 వేలు దాటిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today 29 November 2023: రూ.63 వేలు దాటిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Petrol-Diesel Price 29 November 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price 29 November 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

టాప్ స్టోరీస్

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు

Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు

Jagan Case: కోడి కత్తి కేసులో జగన్‌ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్

Jagan Case: కోడి కత్తి కేసులో జగన్‌ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్

PM Narendra Modi: మీ ధైర్యం, సహనానికి హ్యాట్సాఫ్, కార్మికులతో ఫోన్‌లో ప్రధాని మోదీ

PM Narendra Modi: మీ ధైర్యం, సహనానికి హ్యాట్సాఫ్, కార్మికులతో ఫోన్‌లో ప్రధాని మోదీ