Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
Andhra Pradesh: తెలుగు అమ్మాయిని క్షమించి వదిలేయాలంటూ మరోసారి లోకేష్‌కు నటి శ్రీరెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్టీకి దూరంగా ఉంటానంటూ జగన్‌కు కూడా లెటర్ రాశారు.
Andhra Pradesh News: వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బూతులతో రెచ్చిపోయిన అనేక మంది మద్దతుదారుల్లో ఒకరు శ్రీరెడ్డి. ఆమెకు ఇప్పుడు అరెస్టు భయం పట్టుకుంది. ఏపీలో వివిధ ప్రాంతాల్లో నమోదు అవుతున్న కేసుల ఆమెను వణుకుపుట్టిస్తున్నట్టు కనిపిస్తోంది. క్షమించి వదిలేయాలని విజ్ఞప్తి చేస్తూ వీడియోలు, లెటర్లు రాస్తున్నారు.
నటి శ్రీరెడ్డి వైసీపీ హాయాంలో తరచూ సోషల్ మీడియాలో కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వివాదాల్లో ఉండేవాళ్లు. ఇప్పుడున్న ప్రభుత్వం సోషల్ మీడియాలో అసభ్యకరం పోస్టులు పెట్టిన వారిపై కొరడా ఝుళిపిస్తుండడంతో అరెస్టు భయంతో శ్రీరెడ్డి మొన్న వీడియో రిలీజ్ చేశారు. మతి తప్పి ప్రత్యర్థులపై తప్పుడు కూతలు కూశాను క్షమించాలని అందులో వేడుకున్నారు. అయినా కూటమి శ్రేణులు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు. గతంలో ఆమె నోటి వెంట వచ్చిన బూతుకామెంట్స్‌ను పోలీసులు అందజేసి కేసులు పెట్టాలని ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు.
ఇప్పటికే పోలీసులు ఆమెపై కేసులు నమోదు చేశారు. అరెస్టు చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది. దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన శ్రీరెడ్డి ఈసారి ఏకంగా మంత్రి లోకేష్‌కు బహిరంగ లేఖ రాశారు. తెలుగు అమ్మాయిని క్షమించి వదిలేయాలని తెలియక తప్పు చేశానంటూ క్షమాపణలు చెప్పారు. తనను అరెస్టు చేయవద్దని.. ప్లీజ్ లోకేశ్ అన్నా.. నన్ను వదిలేయండి అంటూ వేడుకున్నారు శ్రీరెడ్డి. సేవ్ మై ఫ్యామిలీ, నాపై నమోదైన కేసుల నుంచి నన్ను బంధ విముక్తురాల్ని చేయండి అంటూ ప్రాథేయపడ్డారు.
Please anna begging you🙏 save me pic.twitter.com/tXxKPIjutl
— Sri Reddy (@SriReddyTalks) November 14, 2024
శ్రీరెడ్డి రాసిన ఓపెన్ లెటర్ ఇదే" లోకేష్ అన్న, నేను పుట్టింది గోదావరి, అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే. అందుకే నాకు మీ కమ్యూనిటీ వాళ్లే 95% ఫ్రెండ్స్. ఈవిషయాన్ని చాలా వీడియోల్లో చెప్పాను. వెరీ రేర్ కేస్‌లో మైట్ బీ నేను మెన్షన్ చేసి ఉంటాను. కానీ నేను అవమానించలేదు. మా అమ్మ నాన్న కూడా విజయవాడతోనే ఎక్కువ అనుబందం. అలాగే మా సొంత ఇల్లూ గట్రా అక్కడే. అమరావతి రావడం మా ఇంట్లో వాళ్లను ఎంత సంతోషపెట్టింది. ఎందుకంటే వాళ్ళకున్న అరకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయని.. అందుకే మా అమ్మనాన్ని టీడీపీకి ఓటు వేశారు.
లోకేష్ అన్నా మీరు కొన్నివిషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంత కంటే ఎక్కువ మంచితనం కూడా ఉంది. ఈ నా కేసుల విషయంలో మాట్లాడమని నేను అంతకుముందు వీడియోలో చెప్పినట్టు సారీ చెప్పమనింది కూడా మా కుటుంబ సభ్యులే. అలాగే మా కుటుంబసభ్యులు మీతో డైరెక్ట్‌గా మాట్లాడమని చెప్పారు. అయినా నాకు అంత స్థాయి లేదు. అందుకే ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నాను.
అన్నా నేను మీ పార్టీని, కార్యకర్తల్ని, మీ అధికారులని, మీ అనుబంధ Media సంస్థలని, జనసేన, జనసేన మీడియా, వీర మహిళలను, వారి కుటుంబ సభ్యులను అల్రెడీ నేను అనేక సందర్భాల్లో సారీ చెప్పాను. అనేక సార్లు నేను రూడ్‌గా మాట్లాడడటం జరిగింది. (అందరికే మళీ క్షమించమని అడుగుతున్నాం)
గత పదిరోజులుగా మీడియాలో వచ్చే కథనాలు, వాటి కింద కార్యకర్తలు పెట్టే కామెంట్లు, మీ నాయకులు చేసే కామెంట్లు, డిబేట్స్‌లు చూసిన తరువాత కూటమిలో ఉన్న అందరూ చేసిన అటాక్ చూసిన తర్వాత నాకు అరమైంది. నేను ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీశానో, బాధపెట్టానో అర్ధమైంది. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా ఒక వెంకటేశ్వరస్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెపున్నాను (మా కులదైవం కూడా) ఇంతమంది మహభావాలు జుగుప్పారు భాషలో నేను మాట్లాడి తప్పు చేశాను. నా పూలలు, హోమాలు, భక్తి గురించి బహుషాగా మీకు తెలిసే అవకాశం లేదు. ఇంత పూజలు, ప్రార్ధనలు చేసే నేను ఈ పాపం ఎలా చేశాను, ఏ కండ కావరంతో చేశాను అనేది నాకు అర్ధం కాలేదు. అందుకే మందుగా చంద్రబాబునాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కల్యాణ్ గారికి, వారి కుటుంబసభ్యులకి, మిగతా మీడియాకు నా హృదయపూర్వక సారీ. .. మీ అందరూ పెద్దమనసు చేసుకొని తెలుగమ్మాయిని క్షమించండి.
లోకేష్ అన్నా.... నా ఫామిలీ మీద ఒట్టు వేసి చెబుతున్నాను ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవడానికి ఈ లెటర్ అనుకోకండి.. ఈ వారం ఆహారం, నిద్ర, లేకుండా కామెంట్స్ చదివి ఎంతో మనోవ్యథకు గురై తీసుకున్న నిర్ణయం. నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి. ఇన్‌కేస్ ఫ్యూజర్‌లో వైఎస్‌ఆర్‌సీపీ తిరిగి అధికారంలోకి వచ్చినా తిరిగి నా బుద్ధి వక్రం అవుతుందని అనుకోకండి. అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు. ఇకపై ఫిల్తీ ల్యాంగ్వేజ్ ఎవరి మీద కూడా వాడనని మా కులదైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా దాకా వచ్చేసరికి నేను చేసిన తప్పు ఏంటని అర్థమైంది ఎంత బాధ ఉంటుందో.
ఇప్పటికి నేను, నా కుటుంబం అనుభవించిన క్షోభ 1000 సంవత్సరాలకు సరిపడా అనుభవించాం. ఇంట్లో పెళ్ళికావలసిన పిల్లలు ఉన్నారు. నన్ను కొడిత ఒక నెల లేదా 3 నెలలకు గాయాలు మానవచ్చు. కానీ నా వల్ల ముగ్గురికి జీవితాంతం శిక్ష వేసిన దాన్ని అవుతాను. నా బాధ నాకంటే బాగా ఇంతమందిని పాలించే మీకు అర్ధమయ్యే ఉంటుంది. ప్లీజ్ అన్నా సేవ్ మై లైఫ్. ఇక మీడియా, సోషల్ మీడియా కేసుల నుంచి నన్ను బంధవిముక్తురాలిని చేయండి. లోకేష్ అన్నా నేను ఇంకా ఎవరికైనా సారీ చెప్పటం మరిచిపోతే, వారికి కూడా పేరు పేరునా క్షమాపణలు అడుగుతున్నాను. మూవీ ఫీల్డ్‌లో ఉన్న చిరంజీవి, నాగబాబుగార్లకు, అందరికీ కూడా నా క్షమాపణలు. Sri Reddy (Movie field)-failed Sri Paddy (Politics) failed (agreed) షర్మిలక్క, సునీతక్క క్షమించండి. మీరు కూడా.."అని లెటర్ ముగించారు.
జగన్, భారతికి ఓపెన్ లెటర్
తర్వాత వైసీపీ అధినేత జగన్‌కు, భారతికి కూడా శ్రీరెడ్డి లేఖ రాశారు. వైఎస్ఆర్‌సీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చానని వాపోయారు. సాక్షిలో పని చేసినప్పటి నుంచి ఇద్దరిపై గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయని.. ఇప్పుడు తనవల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చినందని అన్నారు. ఇకపై పార్టీకి, పార్టీ కార్యకర్తలకి దూరంగా ఉండాలనుకుంటున్నానని శ్రీరెడ్డి మరో లేఖ తెలిపారు. జగన్‌ను క్షమాపణలు కోరారు.
"జగనన్నకి, భారతమ్మకి నా హృదయ పూర్వక నమస్కారాలు ఈ జన్మకి మీ ఇద్దరిని నా కళ్ళతో TVలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటా, ఒక ఫొటో కూడా తీసుకునే అదృష్టాన్ని నేను కల్పోయాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా పేరుతో YSRCPకి చెడ్డపేరు తీసుకొచ్చాను. గత కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసిన పనికి అనేక మంది వైఎస్‌ఆర్‌సీపీపై దుమ్మెత్తి పోయడమే నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా కుంగ దీసింది. నేను పార్టీని అనేకమంది మాటల దాడి నుంచి కాపాడటంలో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నానని గ్రహించలేకపోయాను.
Forgive me Jagananna.. pic.twitter.com/RCPHg0u1Bz
— Sri Reddy (@SriReddyTalks) November 14, 2024
నేను ఎట్‌లీస్ట్ వైసీపీలో సభ్యురాలిని కూడా కాదు. సాక్షి టీవీలో పని చేసినప్పటి నుంచి మీ ఇద్దరి మీద గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి. పార్టీ ఎన్ని కష్టాలకోర్చి అధికారంలోకి వచ్చింది, ఇప్పుడ తిరిగి కష్టకాలంలో పడింది. మధ్యలో ఎన్నో కప్పాలు పార్టీని వెంటాడాయి. జగనన్న పాదయాత్ర, కేసులు, జైలు, ఆయన కష్టాలు చూసి ఆయనకు ఉడత సాయంగా ఉండాలని అనుకున్నాను. వేర విధేయత అధికం అవడంతో ప్రత్యర్థులను ఫిల్తీ లాంగ్వేజ్‌తో తెగబడుతున్నాను అనుకున్నాను కానీ పార్టీకి డ్యామేజ్ చేసున్నాను అనుకోలేదు. నేను చేసిన పని వల్ల మీరు ఎంత బాధ పడ్డారో నేను అర్థం చేసుకగలను. నా పాపం మీకు అంటొద్దు.
నేను పార్టీకి, పార్టీ కార్యకర్తలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. నా వలన పార్టీకి చెడ్డపేరు రావడం నాకు ఇష్టం లేదు. క్షమించండి.." అని జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Also Read: ఏపీలో నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు- వైసీపీ హయాంలో చేసిన పోస్టులు, కామెంట్లతో చిక్కులు!