News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Perni Nani: చంద్రబాబుని ఓదార్చడానికి వెళ్లి జైల్లో సెటిల్‌మెంటా? పవన్‌పై పేర్ని నాని సెటైర్లు

Perni Nani: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేని అధినేత పవన్ కల్యాణ్ పై పేర్ని నాని విమర్శలు గుప్పించారు.

FOLLOW US: 
Share:

Perni Nani: జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడిని ఓదారుస్తా అని వెళ్లి పవన్ కల్యాణ్ సెటిల్‌మెంట్ చేసుకుని వచ్చాడని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌ది ములాఖత్ కాదని.. మిలాఖత్ అని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. బీజేపీతో పవన్ ది తాత్కాలిక పొత్తు మాత్రమేనని, తెలుగు దేశంతోనే పవన్ కు శాశ్వత పొత్తు అని పేర్ని అన్నారు. ఈ విషయంలో పవన్ కు క్లారిటీ ఉందని, బీజేపీకే లేదని ఎద్దేవా చేశారు. బీజేపీకి జనసేన ఎప్పటికప్పుడు పిల్లి మొగ్గలు వేస్తోందని విమర్శలు గుప్పించారు. 

పవన్ పొత్తు పాతవార్తేనని.. ఇందులో కొత్తదనం ఏమీ లేదని పేర్ని నాని అన్నారు. తెలుగు దేశం పార్టీలో పవన్ కల్యాణ్ ఓ అంతర్భాగమని చెప్పారు. కలవడం, విడిపోవడం కేవలం ముసుగు మాత్రమేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పవన్ వ్యాపారం మాట్లాడుకుని వచ్చారా అనేది జనసేన కార్యకర్తలకైనా పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని చెప్పాలని పేర్ని నాని నిలదీశారు.

'పవన్ పరామర్శకు జైలుకు వెళ్లి చంద్రబాబుతో డీల్ కుదుర్చుకుని వచ్చారు. ప్రజాధనం దోచుకున్న దొంగను పవన్ పరామర్శిస్తాడా ఇదేనా పవన్ చెప్పిన జనసేన సిద్ధాంతం?. అవినీతిపై పవన్ రాజీలేని పోరాటం చేస్తానన్నాడు. మరి అవినీతిపరుడు అయిన చంద్రబాబుకు ఎలా మద్దతు ప్రకటిస్తాడు. తాను దోచుకున్న డబ్బులో నారా లోకేశ్ వాటా ఇస్తానని చెప్పాడా? లోకేశ్ తో సీట్లేనా లేక లెక్కలు కూడా పంచుకున్నారా?. తనను నమ్ముకున్న వారిని మోసం చేసి పవన్ లాభపడుతున్నాడు. కేవలం సినిమాల్లో మాత్రమే పవన్ హీరో.. బయట మాత్రం జోకర్. 25 స్థానాలకు పవన్ అభ్యర్థులను సప్లై చేస్తాడు' అంటూ పేర్ని నాని మండి పడ్డారు.

నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు - నాని

చంద్రబాబు నాయుడి తత్వమే వాడుకుని వదిలేయడమని గతంలో పవన్ కల్యాణ్ చెప్పారని.. అలాంటి వ్యక్తితో మరోసారి ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. జనసేన జెండా మోసే కార్యకర్తలకైనా ఈ విషయం చెప్పాలి కదా అన్నారు. పవన్ కల్యాణ్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతారని విమర్శించారు. టీడీపీ అవినీతి పార్టీ అని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని గతంలో విమర్శించిన పవన్ కల్యాణే.. ఇప్పుడు రాష్ట్ర ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తిని కలవడానికి జైలుకు వెళ్లారని పేర్ని నాన్ని అన్నారు. 

దొంగను, అవినీతి పరుడిని, అభియోగాలు ఉన్న ముద్దాయిని పరామర్శించడానికి వెళ్లారని చెప్పారు. సైద్ధాంతిక విభేదాలు మాత్రమే ఉన్నాయని చెబుతున్న పవన్ కల్యాణ్.. ఆ సిద్ధాంతాలు ఏమిటో చెప్పాలని పేర్ని నాని వ్యాఖ్యానించారు. 2019లో ఏ సిద్ధాంతాలు కలవక విభేదించి విడిపోయారో, ఇప్పుడు ఏ సిద్ధాంతాలు కలిసి మళ్లీ పొత్తు పెట్టుకుంటున్నారో చెప్పాలన్నారు. అవినీతిపై రాజీలేని యుద్ధమే తన సిద్ధాంతం అని చెప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు అవినీతిపరుడితో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నావని పేర్ని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ తన నటనతో రాష్ట్ర ప్రజలను, జనసేన కార్యకర్తలను వంచిస్తున్నాడని అన్నారు. 

Published at : 14 Sep 2023 07:38 PM (IST) Tags: Pawan Kalyan Chandrababu Perni Nani YCP Leader Fires

ఇవి కూడా చూడండి

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

IITTP: తిరుపతి ఐఐటీలో ఎంఎస్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

IITTP: తిరుపతి ఐఐటీలో ఎంఎస్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?

ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !