News
News
X

కేసీఆర్‌ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన ఏంటీ?

కేసీఆర్‌ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీపై చంద్రబాబు ఏమన్నారు. ఆయన రియాక్షన్‌ ఏంటి?

FOLLOW US: 
 

దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారిని టీడీపీ అధినేత చంద్రబాబు దర్శించుకున్నారు. సతీసమేతంగా దేవీకి ప్రత్యేక పూజలు జేశారు. పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలికారు. 

దేవీ దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు చేశారు. అన్ని పార్టీల మద్దతుతో ఆనాడు రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించామని గుర్తు చేశారు. అప్పుడు అంగీకరించిన వైఎస్‌ఆర్‌సీపీ ఇప్పుడు మాట మార్చిందన్నారు. అలాంటి వారిని అమ్మవారు శిక్షిస్తారన్నారు. క్షమించదని అభిప్రాయపడ్డారు. అమరావతి రైతుల సంకల్పం చాలా గొప్పదని వాళ్లకు కచ్చితంగా అమ్మవారు న్యాయం చేస్తారన్నారు. 

ఈ సందర్భంగా కేసీఆర్‌  ప్రకటించబోయే జాతీయా పార్టీపై మీడియా ప్రతినిధులు చంద్రబాబును ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందించలేదు. నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

కాసేపట్లో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా కేసీఆర్ ప్రకటించనున్నారు. రాజకీయ పార్టీ ఆషామాషీగా పెట్టాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకోవడం లేదు. జాతీయ పార్టీ వెనుక సుదీర్ఘమైన కసరత్తు ఉంది. నెలల తరబడి విధానపరంగా.. పబ్లిసిటీ పరంగా.. క్యాడర్ పరంగా తీసుకోవాల్సిన  జాగ్రత్తల  గురించి ఆలోచించారు. అన్ని రకాల ప్లాన్లతో రెడీ అయ్యారు. ముఖ్యంగా పబ్లిసిటీ ప్రణాళికను పక్కాగా రెడీ చేసుకున్నారు. పార్టీ ప్రకటించిన వెంటనే.. దేశవ్యాప్తంగా అన్ని మీడియాల్లో చర్చలు జరిగేలా చూసుకుంటున్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నయి. 

News Reels

జాతీయ అంశంగా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన !

సాధారణంగా దక్షిణాది రాజకీయాలు జాతీయ మీడియాగా చెప్పుకునే ఇంగ్లిష్ , హిందీ మీడియాల్లో ఎక్కువగా హైలెట్ కావు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ప్రాంతీయ భాషా చానళ్లు పాతుకుపోయాయి. జాతీయ పార్టీల హవా లేదు. ఈ కారణంగా ఇంగ్లిష్ , హిందీ న్యూస్ చానళ్లలో దక్షిణాది వార్తలు పెద్దగా వర్కవుట్ కావని అనుకుంటారు. అందుకే ప్రాధాన్యత ఇవ్వరు. ఇటీవలి కాలంలో పరిస్థితి మారుతోంది. కానీ ఓ దక్షిణాది నేత జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారంటే భారీగా కవరేజ్ ఇచ్చే పరిస్థితి ఉండదు.కానీ కేసీఆర్ తన పార్టీ అంశాన్ని నేషనల్ ఇష్యూగా చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. చాలా మీడియా చానళ్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. డిల్లీలో కాకలు తీరిన జర్నలిస్టును పీఆర్వోగా పెట్టుకున్నారు. ఆ ఫలితంగానే ఇటీవలికాలంలో కేసీఆర్ జాతీయ పార్టీపై .. తెలంగాణ అభివృద్ధిపై జాతీయ మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. 

కేసీఆర్ విధానాలపై ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చలు!

ఇప్పటికే పలు మీడియా సంస్థలతో సన్నిహిత సంబంధాలు !

దేశం విషయంలో తన దృక్పధాన్ని స్పష్టంగా వెల్లడించే కేసీఆర్ ..  దేశ రాజకీయాల్లో మీడియా మద్దతు కోసం తన వంతు కృషి  చేశారు. టీఆర్ఎస్ కు బలమైన ఆర్థిక వనరులు ఉన్నాయి. ఆయా మీడియా చానళ్లకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వనున్నారు. కేసీఆర్ పార్టీ ప్రకటన చేసిన తర్వాత తెలంగాణ మోడల్ అభివృద్ధిని ప్రచారం  చేసేందుకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వనున్నారు. వాటితో పాటు మీడియా చానళ్ల న్యూస్ వేరు. కేసీఆర్‌పై ఇప్పటికే ఓ పాజిటివ్ భావన ప్రజల్లోకి వెళ్లింది. దీన్ని మరింతగా తీసుకెళ్లేలా మీడియా సంస్థలతో సన్నిహిత సంబంధాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఇక ఇప్పటి  రాజకీయాల్ని శాసిస్తున్న సోషల్ మీడియా విషయంలోనూ కేసీఆర్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హిందీ, ఇంగ్లిష్ లలో సోషల్ మీడియా టీముల్ని ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. 

కేసీఆర్ జాతీయ పార్టీ ముందుగా ఉత్తరాది ప్రజల్లోకి వెళ్లాలి. అలా వెళ్లాలంటే మీడియా సహకారం ఎంతో అవసరం. ఈ విషయం .. కేసీఆర్‌కు తెలియనిదేం కాదు. అందుకే మీడియా మద్దతు పొందడానికి ఆయన చేయాల్సిదంతా చేశారు. అందుకే రాజకీయ పార్టీ ఏర్పాటు జాతీయ అంశం అవుతుందని టీఆర్ఎస్ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. 

Published at : 05 Oct 2022 01:17 PM (IST) Tags: TRS BRS Telangana KCR TDP Chandra Babu Bharat rashtra samiti

సంబంధిత కథనాలు

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

AP News Developments Today: ఏపీలో ఇవాళ్టి ముఖ్యమైన అప్‌డేట్స్ ఏమున్నాయంటే?

AP News Developments Today: ఏపీలో ఇవాళ్టి ముఖ్యమైన అప్‌డేట్స్ ఏమున్నాయంటే?

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ విడుదల 

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ విడుదల 

సీబీఐ కేసుల్లో ఏపీ ప్రజాప్రతినిధులే టాప్- ఏపీలో 10 మందిపై నేరారోపణలు!

సీబీఐ కేసుల్లో ఏపీ ప్రజాప్రతినిధులే టాప్- ఏపీలో 10 మందిపై నేరారోపణలు!

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

టాప్ స్టోరీస్

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!

అరవింద్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే బరిలో ఉండి గెలుస్తానన్న కవిత ఛాలెంజ్‌ సీక్రెట్ ఏంటి?

అరవింద్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే బరిలో ఉండి గెలుస్తానన్న కవిత ఛాలెంజ్‌ సీక్రెట్ ఏంటి?