Chandrababu: చంద్రబాబు పర్యటనలో కనిపించని ఎంపీ కేశినేని నాని, ఏపీ టీడీపీలో హాట్ టాపిక్
తెలుగు దేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని చంద్రబాబు టూర్ లో కనిపించలేదు. దీంతో ఆయన వ్యవహర శైలి మరో సారి పార్టీ నేతల్లో చర్చనీయాశంగా మారింది.
![Chandrababu: చంద్రబాబు పర్యటనలో కనిపించని ఎంపీ కేశినేని నాని, ఏపీ టీడీపీలో హాట్ టాపిక్ Vijayawada TDP MP KESINENI NANI missing at Chandrababu Road show and Events DNN Chandrababu: చంద్రబాబు పర్యటనలో కనిపించని ఎంపీ కేశినేని నాని, ఏపీ టీడీపీలో హాట్ టాపిక్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/12/7560c73b562923ad24c9851fbb740c241681317793386233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బెజవాడ తెలుగు దేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని చంద్రబాబు టూర్ లో కనిపించలేదు. దీంతో ఆయన వ్యవహర శైలి మరో సారి పార్టీ నేతల్లో చర్చనీయాశంగా మారింది.
చంద్రబాబు టూర్ లో ఎంపీ ఎక్కడ...
చంద్రబాబు పర్యటనలో పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని కనిపించకుండా పోయారు. చంద్రబాబు విజయవాడ పర్యటలో ఉండగా ఆయన తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉండి వేరొక కార్యక్రమానికి హజరు కావటం విశేషం. దీంతో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నేత చంద్రబాబు వెనుక లేకపోవటంపై పార్టీ నేతల్లో చర్చ మెదలైంది. ఉమ్మడి KRISHNA జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. మూడు నియోజవకర్గాల పరిధిలో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటన జరుగుతుంది. చంద్రబాబు తొలి రోజు పర్యటనలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో టూర్ స్టార్ట్ అయ్యింది. వాస్తవానికి పార్లమెంట్ సభ్యుడి హోదాలో కేశినేని నాని చంద్రబాబుకు స్వాగతం పలకాల్సి ఉంది. అయినా ఆయన మాత్రం కనిపించలేదు. స్థానిక శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్ మాత్రమే, చంద్రబాబుకు స్వాగతం పలికారు. నియోజకవర్గంలో పలువురు నేతలు తెలుగు దేశం పార్టిలో చేరటంతో వారికి చంద్రబాబు కండువా కప్పి పార్టిలోకి ఆహ్వనించారు.
సైకో పాలన పోవాలంటూ చంద్రబాబు ఫైర్...
విజయవాడలో పర్యటించిన చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ ను సైకో అంటూ మండిపడ్డారు. ఇంటింటికీ సీఎం జగన్ స్టిక్కర్లు అతికిస్తున్నారని, మన ఇళ్ల మీద సైకో బొమ్మలేంటని చంద్రబాబు ప్రశ్నించారు. వేరే వారి ఇళ్ల గోడల పై రాయాలన్నా, ఎలాంటి కరపత్రాలు, బొమ్మలు అతికించాలన్నా ఇంటి యజమానుల అనుమతి తప్పనిసరగా ఉండాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎవరి అనుమతి తీసుకొని వాలంటీర్లు జగన్ స్టిక్కర్లు ప్రజల ఇళ్ల గోడలపై అతికిస్తున్నారో చెప్పాలన్నారు. ప్రజలసొమ్ము జీతంగా తీసు కుంటున్న వాలంటీర్లు సైకో ముఖ్యమంత్రి కోసం ఎలాపనిచేస్తారా అని నిలదీశారు.
జగన్ సమాజానికి పట్టిన క్యాన్సర్ అని, జగన్ బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్యాన్సర్ మాదిరిగానే, జగన్ కూడా సమాజాన్ని, మరీ ముఖ్యంగా ఆడబిడ్డ ల్ని పట్టిపీడిస్తున్నాడని ఫైర్ అయ్యారు. నిత్యావసర ధరలు .. గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందో లేదో ఆడబిడ్డలు చెప్పాన్నారు. నూనె ధర బాగా పెరిగాయని, సలసలకాగే నూనెలో జగన్ ను వేస్తే, అప్పుడే అతనికిబుద్ధి వస్తుందని చంద్రబాబు అన్నారు. మద్యం ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఎంతపెరిగాయో అందరికి తెలిసిందేనని అన్నారు.
విద్యుత్ చార్జీలపై చంద్రబాబు ఆగ్రహం...
విద్యుత్ ఛార్జీలు ఈనెల నుంచి రూ.5,500 కోట్లు పెంచుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. యూనిట్ కు 50పైసలు పెంచుతున్నారని, ఇదే కదా బాదుడేబాదుడు అంటే అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ ఇచ్చేది పదిరూపాయలు... గుంజేది వంద రూపాయలన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. అబద్ధాలతో, మోసాలతో ప్రజల్ని నమ్మిస్తున్న జగన్ ప్రజల నమ్మకం.. భవిష్యత్ కానే కాదని చంద్రబాబు అన్నారు. జగనే రాష్ట్రానికి పట్టిన దరిద్రం, జగన్ ఉంటే రాష్ట్రం అంధకారమేన్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మనల్నిచూసి భయపడిన వారు, ఇప్పుడు మనల్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని, వారందరికి రాబోయే రోజుల్లో గట్టిగా సమధానం ఇవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)