VJA Gang Rape: నన్ను సిగ్గులేదా అన్నారు! బాబు ఇచ్చే ట్రైనింగ్ ఇదేనా? క్షమాపణకు వాసిరెడ్డి పద్మ డిమాండ్

Vijayawada Govt Hospital: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయం చేయడం కోసం గ్యాంగ్ రేప్ ఘటనను ఉపయోగించుకొంటున్నారని మండిపడ్డారు.

FOLLOW US: 

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారం జరిగిన వేళ శుక్రవారం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. బాధితురాలిని పరామర్శించేందుకు చంద్రబాబు రావడం, అంతకుముందే టీడీపీ నేతలకు అక్కడికి చేరుకోవడం, అదే సమయంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా అక్కడికి రావడంతో టీడీపీ నేతలకు ఆమెకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో జరిగిన దారుణంపై టీడీపీ కార్యకర్తలు వాసిరెడ్డి పద్మను నిలదీశారు. వాసిరెడ్డి పద్మ ఆసుపత్రి లోపలికి వెళ్లే సమయంలోనే టీడీపీ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత పోలీసులు కలగజేసుకొని ఆందోళన కారులను నిలువరించి పద్మను లోనికి పంపించారు. అనంతరం ఆమె బాధితురాలిని పరామర్శించారు.

వాసిరెడ్డి పద్మ అక్కడ ఉన్న సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అక్కడికి చేరుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆమెకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇదే సమయంలో స్థానిక టీడీపీ నేత పంచుమర్తి అనురాధకు వాసిరెడ్డి పద్మ మధ్య వాగ్వివాదం సాగింది. మధ్యలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా కలగజేసుకున్నారు. చంద్రబాబు అక్కడున్న సమయంలోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు, వాసిరెడ్డి పద్మ మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాల వారు పరస్పరం విమర్శలు చేసుకొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయం చేయడం కోసం గ్యాంగ్ రేప్ ఘటనను ఉపయోగించుకొంటున్నారని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీ క్రాంతి రాణాను ఆదేశించినట్టుగా ఆమె చెప్పారు.

అంతేకాకుండా, చంద్రబాబు బెదిరించారని, ఇతర టీడీపీ నేతలు తనను అనకూడని మాటలు అన్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. బొండా ఉమ తనను సిగ్గులేదా అన్నారని చెప్పారు. వారికి కాలం చెల్లుతుందని బొండా ఉమ లాంటి ఆకు రౌడీలు భవిష్యత్తులో ఎక్కడుంటారో తాను చూస్తానంటూ చెప్పారు. చంద్రబాబు వారికి ఇచ్చే ట్రైనింగ్ ఇదేనా అంటూ మండిపడ్డారు. మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ను అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలి. ‘‘గతంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరైనా స్పందించారా? మీ తప్పులను ఎత్తి చూపితే సహించలేని రాజకీయ నాయకులు మీరు. తాజా ఘటనపై మేం రిపోర్ట్ అడుగుతున్నాం. ప్రభుత్వం విచారణ జరుపుతోంది’’ అని  వాసిరెడ్డి పద్మ అన్నారు.

జగన్ పరామర్శకు వస్తే వచ్చే నష్టమేంటి?: బాబు

బాధితురాలిని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తుందా అని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరవైందన్నారు. ఇలాంటి సంఘటనలు రోజూ ఏదో ప్రాంతంలో జరుగుతున్నాయని.. ఇలాంటివి చూస్తుంటే అసలీ ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా అని ప్రశ్న తలెత్తుతుందన్నారు. 

నిన్న నెల్లూరులో తిరుమల వెళ్తున్న ఫ్యామిలీని నడిరోడ్డుపై వదిలేసి పోలీసులే కారు ఎత్తుకెళ్లిపోయారని... అలాంటి వీళ్లకు ఆడపిల్లలు లెక్కే లేదన్నారు చంద్రబాబు. అక్కడ కారును ఎత్తుకెళ్తే.. ఇక్కడ ఆడపిల్లను ఎత్తుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని జరుగుతున్నా సీఎం స్పందించకపోవడం అహంకారమా లేకా ఉన్మాదమా అని ప్రశ్నించారు. తన ఇంటి పక్కనే ఉన్న ఆసుపత్రికి వచ్చి బాధితురాలిని పరామర్శిస్తే వచ్చే నష్టమేంటని చంద్రబాబు నిలదీశారు.

Published at : 22 Apr 2022 02:56 PM (IST) Tags: Chandrababu BONDA UMA vasireddy padma vijayawada govt hospital Vijayawada gang rape gang rape in govt hospital

సంబంధిత కథనాలు

Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

AP Courier Offices: బెజవాడ డ్రగ్స్ ఎఫెక్ట్ - ఏపీలో కొరియ‌ర్ ఆఫీస్‌లపై పోలీసుల నిఘా

AP Courier Offices: బెజవాడ డ్రగ్స్ ఎఫెక్ట్ - ఏపీలో కొరియ‌ర్ ఆఫీస్‌లపై పోలీసుల నిఘా

Petrol Diesel Price 20th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా

Petrol Diesel Price 20th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా

Gold Silver Price Today 20th May 2022 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు, కాస్త తగ్గిన వెండి ధరలు, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

Gold Silver Price Today  20th May 2022 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు, కాస్త తగ్గిన వెండి ధరలు, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

Kondapalli Hidden Treasures : కొండపల్లి ఫారెస్ట్ లో గుప్త నిధులున్నట్లు ప్రచారం, తవ్వకాలు స్టార్ట్ చేసేసిన కేటుగాళ్లు

Kondapalli Hidden Treasures : కొండపల్లి ఫారెస్ట్ లో గుప్త నిధులున్నట్లు ప్రచారం, తవ్వకాలు స్టార్ట్ చేసేసిన కేటుగాళ్లు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?