అన్వేషించండి

రాజకీయాల్లోకి వంగవీటి వారసురాలు, రంగా కుమార్తె ఆశా ఎంట్రీ ఇస్తున్నారా?

రాజకీయాల్లోకి వంగవీటి వారసురాలు.

వంగవీటి మోహన రంగా రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె రంగంలోకి దిగుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంపై వంగవీటి కుటుంబం మాత్రం స్పందించటం లేదు.

వంగవీటి కుటుంబం నుండి మరో నేత...
విజయవాడ మాజీ శాసన సభ్యుడు వంగవీటి మోహన రంగా రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె వంగవీటి ఆశా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం పై రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇప్పటి వరకు వంగవీటి మోహన రంగా రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు వంగవీటి రాధా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో వంగవీటి రాధా కూడా శాసన సభ్యుడిగా విజయం సాధించారు. ఆ తరువాత నుండి ఆయన వరుసగా రెండు సార్లు ఓడిపోయారు. అయితే ఆయన ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలో రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నారు. 

వంగవీటి కుటుంబం నుండి రాజకీయ నాయకులు..
వంగవీటి మోహన రంగా పేరు మీద ఆయన కుటుంబం నుండి చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. వంగవీటి మోహన రంగా, వంగవీటి రాధా హత్యలు తరువాత బెజవాడ రాజకీయాల్లో వారికంటూ ప్రత్యేక స్దానం ఏర్పడింది. ఆయన కుటుంబం నుండి శోభనా చలపతిరావు, వంగవీటి నరేంద్ర, వంగవీటి శంతన్ వంటి నాయకులు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ప్రస్తుం వంగవీటి నరేంద్ర మాత్రమే భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లో ఉంటున్నారు.

వంగవీటి బ్రాండ్...
వంగవీటి ...ఈ పేరు వింటేనే తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి మెదలయిన వంగవీటి మోహన రంగా రాజకీయం జీవితం, ఆ తరువాత నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను శాసించే స్థాయికి వెళ్ళాయి. అయితే ఆ తరువాత వంగవీటి మోహన రంగా దారుణ హత్య తరువాత రాజకీయం ఒక్క సారిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన కుటుంబం నుండి ఆయన కుమారుడు వంగవీటి రాధా రాజకీయాల్లో ఉన్నప్పటికి, ఆయన రాజకీయ వారసులిగా ఆశాను పాలిటిక్స్ లోకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారని అంటున్నారు.

తెలుగు దేశం కు చెక్ పెట్టేందుకేనా...
వంగవీటి ఆశా ను రాజకీయాల్లోకి తీసుకు రావటం ద్వార తెలుగు దేశం పార్టీకి చెక్ పెట్ట వచ్చనే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారని అంటున్నారు. వంగవీటి మోహన రంగాను దారుణంగా హత్య చేయించింది తెలుగు దేశం పార్టీ హయాంలోనే అనే ఆరోపణ ఉంది. అయితే అదే పార్టీలోకి వంగవీటి రాధా వెళ్ళటం చాలా మందికి ఇష్టం లేదు. అలాంటి పరిస్దితులను తమకు అనుకూలంగా మార్చుకోవటం తో పాటుగా తెలుగు దేశం పార్టీకి చెక్ పెట్టాలన్నా, రంగా అభిమానులను తమ వైపుకు తిప్పుకోవాలన్నా, కూడా ఆశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా తీసుకు రావాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

వంగవీటి ఫ్యామిలి నుండి రెండో మహిళ..
జరుగుతున్న ప్రచారానికి అనుగునంగా వంగవీటి ఆశా రాజకీయాల్లోకి వస్తే, ఆ కుటుంబం నుండి రెండో మహిళగా ఆమెకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.  వంగవీటి మోహన రంగా హత్య తరువాత ఆయన సతీమణి రత్న కుమారి రాజకీయాల్లోకి వచ్చి, రెండు సార్లు విజయవాడ శాసన సభ్యురాలిగా కూడా విజయం సాధించారు. ఇప్పుడు ఆశా కూడా రాజకీయాల్లోకి రావటం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం సహా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం సహా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం సహా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం సహా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం-  హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు- ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ మంత్రి
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు- ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ మంత్రి
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Tripura Bangladesh News: హోటల్స్‌లోకి బంగ్లాదేశీయులకు ఎంట్రీ లేదు- హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
హోటల్స్‌లోకి బంగ్లాదేశీయులకు ఎంట్రీ లేదు- హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
Lucknow News: పిలవని పెళ్లి భోజనానికి వెళ్లి లక్నో యూనివర్శిటీ విద్యార్థుల రచ్చ- ఎవరి తరపువాళ్లు అని అడిగినందుకు బంధువులపై దాడి
పిలవని పెళ్లి భోజనానికి వెళ్లి లక్నో యూనివర్శిటీ విద్యార్థుల రచ్చ- ఎవరి తరపువాళ్లు అని అడిగినందుకు బంధువులపై దాడి
Embed widget