Vijayawada News : ఆటోలు అద్దెకు ఇవ్వాలని ప్లాన్ - కొంటె ఖర్చవుతుందని ఏం చేశారంటే?

ఆటోలు అద్దెకు ఇస్తే మంచి లాభాలు వస్తాయి. వాటితో లైఫ్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేద్దామనుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి అయిందొక్కటి.

FOLLOW US: 

తెలంగాణ(Telangana)కు చెందిన సయ్యద్ సమీర్ నవాజ్ ,మహమ్మద్ అలీమ్‌కు గొప్ప ఆలోచన వచ్చింది. కొన్ని కార్ల(Cars) కంపెనీలా ఆటో(Auto)లు అద్దెకు ఇస్తే ఎలా ఉంటుందనే ప్లాన్ వారిలో మెదిలింది. అంతే వర్కౌట్ చేయాలనుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత స్టెప్పే వారిని దోషులను చేసింది.  

అన్ని ఆటోలు ఒకేసారి కొంటే చాలా ఖర్చుతో కూడుకున్న యవ్వారం. అందుకే షార్ట్ కట్ వెతికారు సయ్యద్ సమీర్ నవాజ్, మహమ్మద్ అలీమ్. ఉన్న ఆటోలను చోరీ చేస్తే నెంబర్ ప్లేట్ మార్చేసి తిప్పుకోవచ్చు కదా అనే మాస్టర్ ప్లాన్ వేశారు. 

తెలంగాణలో ఉన్న ఆటోలు చోరీ చేసి ఇక్కడే తిప్పితే పోలీసుల(Police)కు అనుమానం వస్తుందని మరో ఖతర్నాక్ ప్లాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఆటోలు చోరీ చేసి తెలంగాణలో తిప్పితే ఎవరికీ ఎలాంటి డౌట్స్ రావని స్కెచ్ గీశారు. 

విజయవాడ(Vijayawada)ను టార్గెట్‌గా చేసుకున్నారు. భవానీపురం(Bhavani Puram), కృష్ణలంక(Krishna Lanka) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మధ్య కాలంలో చాలా ఆటోలు చోరీకి గురి అయ్యాయి. మారు తాళంతో ఆటోలు కొట్టేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వేల సీసీ కెమెరాల(CC Camer) ఫుటేజ్ పరిశీలించారు. చివరకు ఓ ఆటో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని చూశారు. 

ఆ ఆటోపై నిఘా పెట్టినపోలీసులు ఆ నెంబర్ ఎవరిదా అని చూశారు. అసలు అలాంటి నెంబర్‌ గల ఆటో లేదని అదో నకిలీ నెంబర్‌ ప్లేట్‌ గా నిర్దారించుకున్నారు. దీంతో ఆటోల చోరీకి ఈ ఆటోకు సంబంధం ఉంటుందని ఎంక్వయిరీ చేశారు. 

సయ్యద్ సమీర్ నవాజ్, మహమ్మద్ అలీమ్‌ను అరెస్టు చేశారు. వాళ్లు చెప్పిన ప్లాన్ విని పోలీసులు కంగుతిన్నారు. ఇప్పటికే తెలంగామలో ఎనిమిది ఆటోలు చోరీ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కచ్చితంగా ఈసారి ఆటోలు కొట్టేసి అద్దెకు ఇవ్వాలని డిసైడ్‌ అయ్యి విజయవాడపై ఫోకస్ పెట్టారు. 

కొట్టేసిన ఆటోలను వైఎస్సార్ కాలనీ సమీపాన చెట్ల మధ్య దాచి ఉంచారు. చివరకు నెంబర్ ప్లేట్ మార్చి ఆటోలో తిరుగుతు ఇలా చిక్కారు. అనుకున్న ప్లాన్ బెడిసి కొట్టి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు.

అనుమానితులు కనిపిస్తే పోలీసులకు చెప్పాలని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సీసీ కెమెరాలు లేకపోయి ఉంటే ఈ కేసులు అంత ఈజీగా ఛేదించేవాళ్లం కాదన్నారు.  అందుకే షాపులు, ఇళ్ల వద్ద, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. 

Published at : 13 Apr 2022 11:36 PM (IST) Tags: Vijayawada news BhavaniPuram Auto Theft Gang

సంబంధిత కథనాలు

Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్

Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్

AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !

AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌ పాఠాలు- టెక్‌ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్‌ డీల్

CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌ పాఠాలు- టెక్‌ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్‌ డీల్

Lokesh On Ysrcp Govt : తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్సీ అనంతబాబు, సజ్జలతో భేటీ - నారా లోకేశ్ సంచలన కామెంట్స్!

Lokesh On Ysrcp Govt :  తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్సీ అనంతబాబు, సజ్జలతో భేటీ - నారా లోకేశ్ సంచలన కామెంట్స్!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్‌ - ఇండియా టాప్‌-10లో ఉన్నట్టే!

Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్‌ - ఇండియా టాప్‌-10లో ఉన్నట్టే!