News
News
X

Nara Lokesh Padayatra: ఏపీలో లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ - ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతారంటే?

Nara Lokesh Padayatra: తెలుగు దేశం పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. సంక్రాంతి తర్వాత 450 రోజుల పాటు సాగేలా కార్యాచరణ సిద్ధం చేశారు. 

FOLLOW US: 

Nara Lokesh Padayatra: సంక్రాంతి తర్వాత నుంచి టీడీపీ యువ నేత నారా లోకేష్ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి గాంధీ జయంతి నాడు పాదయాత్ర ప్రారంభిస్తారని అందరూ భావించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధినేత చంద్రబాబు కూడా పాదయాత్ర అదే రోజున ప్రారంభించి సుదీర్ఘంగా నిర్వహించారు. ఇందుకు కొనసాగింపుగా అదే రోజున యాత్ర చేపట్టాలని భావించినా.. ఇప్పుడు ఆ నిర్ణయం మారింది. ఇందుకోసం ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. చిత్తూరు జిల్లా నుంచి ఇచ్చాపురం వరకు 450 రోజుల పాటు సుదీర్ఘంగా సాగనున్నట్లు సమాచారం. 

ముందస్తు ఎన్నికలు ఉండవని.. షెడ్యూల్ ముందుకు జరిపారు..!

కొద్ది నెలల క్రితం సీఎం జగన్ ముందుస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని టీడీపీ ముఖ్య నేతలు అంచనా వేశారు. ఈ క్రమంలోనే అందుకు అనుగుణంగా కార్యాచరణపై కసరత్తు చేశారు. అయితే సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపించకపోవడంతో... షెడ్యూల్ సంక్రాంతి తర్వాతకు మార్చినట్లు తెలుస్తోంది. జనవరిలో పాదయాత్రను ప్రారంభించి ఎన్నికల ప్రచారంతో నారా లోకేష్ భావిస్తున్నారు. దీంతో.. సుదీర్ఘ పాదయాత్రకు నిర్ణయం చేశారు. మొత్తం 450 రోజులపాటుగా చిత్తూరు టు శ్రీకాకుళం వరకు ఈ పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఇందు కోసం 2023 జనవరిలో ప్రారంభించి.. 2024 మార్చిలో ముగించేలా ఆలోచన చేస్తున్నారు. ఇందు కోసం తన తండ్రి నియోజకవర్గం కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

కుప్పం టు ఇచ్ఛాపురం.. 

జనవరి 26వ తేదీ పాదయాత్ర ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కుప్పం టు శ్రీకాకుళం వరకు పాదయాత్ర సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా టీడీపీ గురి పెట్టిన ప్రధాన నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం ఉంటూ.. పరిస్థితులపై అధ్యయనం, మార్పులు, సూచనలకు వీలుగా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. చంద్రబాబు పార్లమెంటరీ జిల్లాల పర్యటన ప్రారంభించినా.. మధ్యలో విరామం ఇచ్చారు. లోకేష్ పాదయాత్ర చేస్తూ... వచ్చే ఎన్నికలే టార్గెట్ గా ప్రభుత్వ వ్యతిరేకత పైన ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో గతంలో ప్రస్తుతం సీఎం జగన్ చేసిన పాదయాత్రల రికార్డులపైన గురి పెట్టినట్లుగా తెలుస్తోంది. జగన్ ప్రతిపక్ష హోదాలో నాడు 13 జిల్లాల్లో పాదయాత్ర చేశారు. మొత్తం 134 నియోజకవర్గాల్లో 341 రోజుల పాటు 3, 648 కిలో మీటర్ల మేర పాదయాత్ర రికార్డు క్రియేట్ చేశారు. ఇడుపుల పాయలో వైఎస్సార్ ఘాట్ నుంచి ప్రారంభించి 2019 ఎన్నికలకు ముందు ఇచ్ఛాపురంలో ముగించారు. 

కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు లోకేష్ తన పాదయాత్రలో 450 రోజుల పాటు.. వారంలో ఏడు రోజులు కొనసాగేలా సాధ్యమైన మేర దాదాపు అన్ని నియోజకవర్గాలను టచ్ చేసేలా కార్యాచరణ సిద్ధం అవుతోంది. 2024 ఫిబ్రవరి చివర లేదా మార్చి తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని టీడీపీ అంచనా వేస్తోంది. క్షేత్ర స్థాయితో పార్టీ పరిస్థితులను అంచనా వేయడంతో పాటు.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకునే ఏర్పాటు చేస్తున్నారు. 

Published at : 18 Sep 2022 12:52 PM (IST) Tags: Nara Lokesh nara lokesh news Nara Lokesh Comments Nara Lokesh Padayatra TDP Padayatra

సంబంధిత కథనాలు

Rains In AP Telangana: రెయిన్ అలర్ట్ - నేడు ఆ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్

Rains In AP Telangana: రెయిన్ అలర్ట్ - నేడు ఆ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్

Moola Nakshatra : రేపు బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ

Moola Nakshatra : రేపు బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ

మూలాన‌క్ష‌త్రంలో దేవి దర్శనానికి తరలి వస్తున్న భక్తులు- విజయవాడ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు

మూలాన‌క్ష‌త్రంలో దేవి దర్శనానికి తరలి వస్తున్న భక్తులు- విజయవాడ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు

పెంపుడు కుక్కను గన్‌తో కాల్చి చంపిన పాస్టర్‌- విచారిస్తున్న పోలీసులు

పెంపుడు కుక్కను గన్‌తో కాల్చి చంపిన పాస్టర్‌- విచారిస్తున్న పోలీసులు

భార్యకు నెలకు 8 లక్షల భరణం ఇవ్వండి- నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు ఆదేశం

భార్యకు నెలకు 8 లక్షల భరణం ఇవ్వండి- నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు ఆదేశం

టాప్ స్టోరీస్

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్