అన్వేషించండి
Advertisement
Krishna District News: పెడనలో ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి
Road Accident At Pedana: ఆంధ్రప్రదేశ్‌లోని పెడన మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు.
కృష్ణా జిల్లా పెడన మండలం కృత్తివెన్ను వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీ కొనడంతో ఆరుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కృత్తివెన్ను సీతనపల్లి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఆరుగులు అక్కడికక్కడే చనిపోయారు. ఓ లారీ కృష్ణాజిల్లా బంటుమిల్లి వైపు వెళ్తుండగా మరొకటి భీమవరం వైపుగా వెళ్తోంది. మృతుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. చనిపోయిన వారిలో ఐదుగురు పశ్చిమగోదావరి జిల్లా తాళ్లరేవు వాసులుగా చెబుతున్నారు. ప్రమాదానికి గురైన ఒక లారీలో పదిమంది ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
కర్నూలు
ఆట
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion