NEET 2025:నీట్ 2025లో ఉత్తమ ఫలితాలు సాధించాం: శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ
NEET 2025: జూన్ 14న నీట్ 2025 ఫలితాలను ఎన్టీఏ ప్రకటించింది. ఈ ఫలితాల్లో మంచి ఫలితాలను తమ సంస్థ విద్యార్థులు సాధించారని శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ వెల్లడించింది.

NEET 2025: నీట్ 2025 ఫలితాల్లో శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ అద్భుత ఫలితాలు సాధించింది. పరీక్ష కఠినంగా ఉన్నప్పటికీ మంచి ర్యాంకులు సాధించారు ఆ సంస్థ విద్యార్థులు. ఈ మేరకు ఆ సంస్థ ప్రకటన చేసింది. "NTA ప్రకటించిన నీట్ - 2025 ఫలితాల్లో విజయవాడ శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలతో మరో ఏడాది చరిత్ర సృష్టించారు. నీట్-2025 పరీక్ష కఠినంగా ఉన్నప్పటికీ, పరీక్షా విధానం మారినప్పటికీ, నిర్దుష్టమైన ప్రణాళికతో ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి, నిజాయితీగా ప్రయత్నం చేయడం ద్వారా, ఫలితాల్లో ఎలాంటి మార్పులు ఉండవని, పైగా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని శ్రీ గోసలైట్స్ నిరూపించింది. మా విద్యార్థులు సాధించిన ఈ విజయానికి వారిని అభినందిస్తున్నాం.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం NEET 25 ఫలితాల్లో శ్రీ గోసలైట్స్ విద్యార్థులు సాధించిన మార్కుల వివరాలు. 720 మార్కులకు 600పైన మార్కులు సాధించిన విద్యార్థులు 11 మంది, 550 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 69 మంది, 500 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 379 మంది, 470 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 814 మంది, 450 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 1,086 మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం గర్వకారణం.
NEET-24 కటాఫ్ ప్రకారం, NEET-25 ఫలితాలను అంచనా వేయగా, సుమారుగా 1,500 మందికిపైగా శ్రీ గోసలైట్స్ విద్యార్థులు దేశవ్యాప్తంగా 'ఫ్రీ మెడికల్ సీట్లు' సాధించే దిశగా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ నుంచి ఒకే ఒక్క బ్రాంచితో స్థాపించిన శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ తొలి ఏడాదిలో నీట్-2021లో 724 ఫ్రీ మెడికల్ సీట్లు, నీటి-2022లో 1,013 ఫ్రీ మెడికల్ సీట్లు, నీట్-2023లో 1,237 ఫ్రీ మెడికల్ సీట్లు, నీట్-2024లో 1,392 ఫ్రీ మెడికల్ సీట్లు సాధించారని చెప్పడానికి గర్వపడుతున్నాం.
శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ నుంచి నీట్-2025లో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులందరూ టెక్నో స్కూల్స్ నుంచి కానీ, ఒలింపియాడ్ స్కూల్స్ నుంచి కానీ కాకుండా, కేవలం సాధారణ స్కూల్స్‌లో చదివిన సామాన్య విద్యార్థులు. అలాంటి సామాన్య విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దడంలో శ్రీ గోసలైట్స్‌కి మించిన సంస్థ మరొకటి లేదని సుస్పష్టంగా రుజువైంది. అని సంస్థ ప్రకటించింది.
శ్రీ గోసలైట్స్ ఛైర్మన్ నరేంద్ర బాబు మాట్లాడుతూ "నీట్ పరీక్ష ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, తెలుగు రాష్ట్రాల్లో లాంగ్ టర్మ్ కోచింగ్ ద్వారా 700 పైబడి మార్కులు సాధించిన మొట్టమొదటి విద్యాసంస్థగా శ్రీ గోసలైట్స్ చరిత్ర సృష్టించిందన్నారు. ఈ మార్కులు సాధించడంలో విజయవాడలో అందరి కంటే ఎక్కువగా శ్రీ గోసలైట్స్ కి మాత్రమే సాధ్యపడింది." అని అన్నారు
ఇంకా ఏమన్నారంటే...." నీట్-2025 ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రతి విద్యార్థిని, తల్లిదండ్రులను పేరుపేరునా అభినందిస్తున్నాను, అలాగే అద్భుత ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.





















